అరామ్కో దాడులతో యుఎస్-ఇరాన్ దేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తత

దమ్మామ్ సమీపంలోని అబ్ఖాక్, ఖురైస్‌లో ప్రపంచంలోనే భారీ స్థాయిలో ముడిచమురు సదుపాయలు ఉన్న విషయం తెలిసిందే. దీనిని సౌదీ అయిల్ జెయింట్ అయిన ఆరామ్కో నిర్వహిస్తోంది. ఆ రెండు ప్రాంతాలపై డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడులు అమెరికా-ఇరాన్ల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను మరింత తీవ్రతరం చేశాయి. దీంతో 1991లో గల్ఫ్ యుద్ధం సమయం నుంచి అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి.యెమన్ ఉనికిగా ‘అన్సార్ అల్లా’ (హోథీ) దళాలు ఈ దాడులకు తామే బాధ్యులమంటూ ప్రకటించాయి. ఈ దాడుల్లో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. అయితే ఇటువంటి దాడులు సౌదీ అరేబియాలో ముందు ముందు మరిన్ని జరుగుతాయంటూ హోథీ దళాలు హెచ్చరించాయి. సౌదీ చమురు స్థావరాలపై దాడికి పాల్పడడం ఇదే మొదటిసారి కాదు. గత నెల సౌదీ అరేబియాకు చెందిన మరో పెద్ద చమురు ఫీల్డ్ అయిన షేబాను కూడా హౌథీలు తమ డ్రౌన్ దాడిలో టార్గెట్ చేశాయి. 




సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబిఎస్) ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. దాడులను నిలువరించడానికి సౌదీ సిద్ధంగా ఉందని, దాడులను ఎదుర్కొనే సామర్థ్యం కూడా తమకు ఉందని అన్నారు. అత్యంత ప్రభావమైన దాడుల వల్ల, రియాద్ రోజుకు 0.2 మిలియన్ బారల్స్ అందించే చమురు పైప్‌లైన్‌ను మూసేసింది. ఇది సౌదీ అరామ్కో ఆరబ్ లైట్ చమురును బహ్రైన్ పెట్రోలియం కంపెనీకి పంపుతుంది. అయినప్పటికీ కూడా అది ఇప్పటికీ ఆరామ్కో ‘ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్’ (ఐపివొ) తన మొత్తం వాల్యుయేషన్‌లో రెండు ట్రిలియన్ అమెరికన్ డాలర్లలో ఒక శాతం మేర అనుకున్న సమయానికి పంపించ గలుగుతోంది. దీనికి తోడు మధ్య ప్రాచ్య జలమార్గాల సంరక్షణకై అమెరికా సారథ్యంలోని సంకీర్ణ కూటమి దేశాలతో అంటే ఆస్ట్రేలియా, బహ్రైన్, బ్రిటన్లతో సౌదీ అరేబియా కూడా కలుస్తోంది. సౌదీ మంత్రి మండలి స్పందిస్తూ దాడి నౌకా ప్రయాణాల స్వేచ్ఛను ప్రమాదంలోకి నెడుతోందని అభిప్రాయపడింది. అంతేకాదు గ్లోబల్ ఆర్థిక అభివృద్ధి సుస్థిరతను దెబ్బతీస్తోందని భావించింది. డ్రోన్ దాడులపై విచారణ జరపాలంటూ యుఎన్‌తో సహా పలు అంతర్జాతీయ సంస్థలను రియాద్ ఆహ్వానించింది. ఈ దాడిలో ఇరాన్ ఆయుధాలు వాడారని రియాద్ స్పష్టంచేసింది. 




డ్రోన్ దాడులను ప్రపంచదేశాలన్నీ కూడా ఖండిచాయి. అమెరికా నుంచి చాలా తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. దానికి సౌదీలతో ఆ ప్రాంతంలో సంకీర్ణ సంబంధం ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ని నిందించారు. సైనిక దాడి ఆయన ఉద్దేశగా కనిపిస్తోంది. ట్రంప్ మాట్లాడుతూ దాడుల పట్ల అమెరికా తీవ్ర నిరసనను వ్యక్తంచేశారు. అంతేకాదు సౌదీ అరేబియాతో నిఘా సమాచారాన్ని అధిక స్థాయిలో పంచుకోవడం వాషింగ్టన్ మొదలెట్టింది. 




అమెరికా విదేశాంగ శాఖా మంత్రి మైక్ పోంపే సౌదీ అరేబియాను త్వరలో సందర్శించనున్నారని తెలుస్తోంది. సౌదీ అరేబియా, యుఎఇలతో దాడులపై పోంపే చర్చించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ఇరాన్ దాడిని ఎదుర్కోవడానికి కృషి చేయనుంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నట్టు సైతం ఈ సందర్భంగా ఇరాన్ ప్రకటించింది. అమెరికా 2015 అణు ఒప్పందాన్ని అంగీకరించిన పక్షంలో ఆ ప్రమాదం జరగకుండా అడ్డుకోవచ్చని అంది. ఇరాన్ అధ్యక్షుడు హస్సాన్ రోహని మాట్లాడుతూ హౌథీలు సౌదీ చమురు సౌకర్యాలపై దాడి చేశారని అన్నారు. యెమెన్‌లో రియాద్ సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్న యుద్ధాన్ని ఆపాలని రియాద్‌ను హెచ్చరించే ఉద్దేశంతో ఈ పనికి హౌథీలు పూనుకున్నారు. ఇరాన్ విదేశాంగమంత్రి జవాద్ జరీఫ్ మాట్లాడుతూ ‘మాగ్జిమమ్ ప్రెషర్ నుంచి మాగ్జిమమ్ డిసీట్ (మోసం)’ విధానం వైపు అమెరికా మళ్లుతోందన్నారు. గ్లోబల్ ఎనర్జీ భద్రతను ఈ దాడులు ఎంతో శక్తివంతంగా తీవ్ర స్తబ్దతకు గురిచేసే అవకాశాలు ఉన్నాయి. 




అబ్‌ఖైఖ్ ప్రాంతంపై దాడుల వల్ల సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి 50 శాతం పడిపోయింది. ఇది బిపిడి పరంగా అత్యధిక శాతం అంటే 5.7 మిలియన్ల నష్టంతో 1950 సంవత్సరం నుంచీ బాధపడుతోంది. మొత్తం గ్లోబల్ చమురు పంపిణీ దెబ్బతింది. చమురు ధరలు 15 శాతానికి పెరిగాయి. చమురు పంపిణీ భయాలను తగ్గించే ప్రయత్నంలో సౌదీఅరేబియా తన ఆసియన్ కొనుగోలు దారులకు అక్టోబర్ అవసరాలను తాను తీరుస్తానంటూ భరోసా ఇస్తోంది. మరోవైపు సముద్ర చమురు బావుల విషయంలో ఆ షాక్‌ను అరామ్కో తట్టుకునేందుకు అంత శక్తివంతంగా లేకపోవడంతో, ఉత్పత్తుల కోత ఉన్నప్పటికీ తన పంపిణీ ఒప్పందాలను గౌరవిస్తానని రియాద్ భారత్‌కు మాట ఇచ్చింది. 




చమురు అవసరాల పరంగా సౌదీ అరేబియా భారత్‌కు రెండవ అతిపెద్ద ముడిచమురు ఎగుమతిదారు. కానీ ఇటీవల జరిగిన దాడుల సంఘటనతో భారత్ చమురు కోసం రష్యా ఇరాన్‌లతో కలిపి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సి వస్తోంది. ఈ రెండు పరిణామాలను భారత్ చాలా కీలకమైనవిగా భావిస్తోంది. ఒకవైపు, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు భారత సమీప పొరుగు దేశాలకు ఏమాత్రం వాంఛనీయం కాదు. మరోవైపు, పెరిగిన చమురు ధరలు గ్లోబల్ ఆర్థికరంగంపై తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది కూడా. 




గల్ఫ్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉంటున్నారు. వారి భద్రత కూడా న్యూఢిల్లీకి ఎంతో ముఖ్యమైంది. అందుకే అన్ని పక్షాలూ జాగ్రత్తగా అడుగులు వేయాలి. సంక్షోభం మరింత ముదరకుండా కాపాడాలి.


రచన: డా. లక్ష్మీ ప్రియ, అధ్యయన విశ్లేషకులు, ఐడిఎస్‌ఎ

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన