ట్రంప్ తాలిబాన్‌తో చర్చలు రద్దు చేయడంతో అసంపూర్ణ స్థితిలో ఆఫ్ఘనిస్తాన్

పధ్నాలుగుమంది సభ్యులతో కూడిన శాంతి ప్రతినిధివర్గం ఈ సంవత్సరం ప్రారంభంలో తాలిబాన్ ఏర్పాటుచేసింది. ఈ ప్రతినిధి వర్గం ఎంతో క్లిష్టమైన శాంతి సంభాషణలను అమెరికాతో చేయాలి. ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, తాలిబాన్‌కు యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో సైతం ఇవి చర్చలు కొనసాగించాల్సి ఉంటుంది. విచక్షణారహితంగా, పౌరులను టార్గెట్ చేస్తూ ఎంతో నిర్దయగా తాలిబాన్ దాడులు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో చర్చలు సరైన దారిలో ప్రారంభదశ నుంచి కొనసాగించడం చాలా కష్టంతో కూడుకున్నది. 


ఈ సంభాషణల ప్రధాన లక్ష్యం విస్తృతస్థయిలో రాజకీయ నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలన్నది. దాని ద్వారా తాలిబాన్ల ఆశలను తీర్చడంతోపాటు కాబూల్‌ రాజకీయ వ్యవస్థలాంటి ప్రధాన స్రవంతిని కూడా చేర్చుకోవడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. కౌంటర్ టెర్రరిజంపై సంభాషణల్లో ప్రధానంగా చర్చించారు. ఈ గ్యారెంటీనే తాలిబాన్ నాయకులు అమెరికాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ తిరిగి 1990 నాటి పరిస్థితులకు వెళ్లదు. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్కులకు నిలయంగా ఉండేది. కౌంటర్ టెర్రరిజం గ్యారంటీ మెకానిజంను కొనసాగిస్తామని మాట ఇస్తే, పూర్తిస్థాయి దౌత్య ఉనికితో పాటు, ఇంటెలిజెన్స్ నెట్‌వర్కు పరంగా కూడా తాలిబాన్లను అమెరికన్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. అది కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి పోరాటదారులు నిష్క్రమించిన తర్వాత వీటి ఏర్పాటు కొనసాగింపును అమెరికా ప్రభుత్వం డిమాండుచేసింది. ఆఫ్ఘన్ తాలిబాన్లు మాత్రం అమెరికా నుంచి పూర్తిగా విరమించుకోవాలన్నఅంశాన్నే పునరుద్ఘాటిస్తున్నాయి. అందులో ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్సు కూడా ఉన్నాయి. ఇలాంటి సున్నిత పరిస్థితుల్లో తుపాకీ, బాంబుల దాడి కాబూల్ లోని మిలటరీ శిక్షణా కేంద్రంపై జరిగి అతలాకుతలాన్ని సృష్టించింది. ఈ దాడిలో ఒక అమెరికా సైనికకుడుతో పాటు పన్నెండుమంది ఇతరులు ప్రాణాలు కోల్పోయారు. 

ఈ దాడికి బాధ్యులం తామేనని తాలిబాన్ ప్రకటించింది. దీంతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపుతో చర్చలు ఆగిపోయాయి. ఈ దాడిని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తాలిబాన్లు పాలుపడ్డ ఈ దాడి అర్థరహితమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. రెండు దశాబ్దాల పోరాటం తర్వాత జరిగే రాజకీయ సంభాషణలు శాంతి స్థాపన దిశగా ఆశలు రేకెత్తించాయి. అదే పోరాటంలో యాక్టివ్‌గా పాల్గొంటున్న బృందంతో చర్చల నిర్వహణ ఎంతో క్లిష్టమైందో కూడా సమయంలో తాజా పరిణామాలు తెలుపుతున్నాయి. ఈ బృందం ఆఫ్ఘన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతో ఉధృతంగా పోరాటం చేస్తోంది. 

ఎన్ని ఆటంకాలు వచ్చినా తాము సంభాషణలకు సిద్ధమని తాలిబాన్ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సీనియర్ మాజీ దౌత్యవేత్తలు తాలిబాన్ అవసరాల వెనుక పాకిస్తాన్ పాత్రను గమనించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ఇంటెలిజెన్సీ వర్గాల తొలగింపుపై పాక్ వెనకుండి కథ నడిపిస్తోందన్న విషయాన్ని పేర్కొన్నారు. దీని వల్ల పాకిస్తాన్‌లోని ఉగ్ర సంస్థలకు దక్షిణ ఆసియాలోని పలు ఇతర ప్రాంతాలలో ఉగ్రవాదుల శిక్షణ, వారిని విభిన్న ఆపరేషన్లకు సంసిద్ధం చేసే పనుల శిక్షణ కొనసాగించడానికి వీలుంటుంది. తమ కార్యకలాపాలను అక్కడ నుంచే రూపొందించవచ్చు. గుర్తించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే ఇటీవల వారాల్లో తాలిబాన్ తన ప్రవర్తనా శైలిలో అత్యధిక స్వయంప్రతిపత్తి ధోరణులను చూపుతోంది. అలా ప్రాంతీయంగా కీలకపాత్ర వహిస్తున్న దేశాలతో కలిసిపనిచేస్తున్నాయి. 

ఈ గ్రూపు చైనా, రష్యా, ఇరాన్, గల్ఫ్ స్టేట్స్ అయిన సౌదీ అరేబియా, కతార్ వంటి దేశాలతో పనిచేస్తోంది. భారత్‌తో చర్చల పరంగా ఇది వైఫల్యం చెందింది. మొత్తానికి ఆగస్టు నెలలో పేరు తెలియని తాలిబాన్ వర్గాలు కొన్ని భారత్‌తో చర్చల పట్ల సంసిద్ధతను వ్యక్తంచేసినట్టు వార్తలు వస్తున్నాయి. తాలిబాన్‌తో బహుళ ప్రయోజనాలున్న దేశాలు సంభాషించడానికి అవకాశాలే లేవు. ప్రధానమైన అమెరికాతో రాజకీయ సంభాషణలే రద్దు అయిన పరిస్థితి చూస్తున్నాం. ఏ ఉగ్రవాద సంస్థతో ఎక్కడా కూడా సంభాషణలకు భారత్ సంసిద్ధంగా లేదని భారత్ ఎప్పటినుంచో ఈ విషయంలో స్పష్టంగా ప్రకటిస్తూ వచ్చింది. అదే స్టాండును కొనసాగిస్తోంది. 

తాజా వార్తలను బట్టి తాలిబాన్, అమెరికాల మధ్య తిరిగి సంబంధాలను ఏర్పాటు చేసేందుకు నార్వే, జర్మనీ, కతార్‌లు ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే రెండు పక్షాలు కూడా అమెరికా ప్రత్యేక ప్రతినిధి జాల్మే ఖలీల్‌జాద్, తాలిబాన్ బృందానికి మధ్య తాజాగా చర్చలను రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసిన అనంతరం రెండు పక్షాలూ ఆఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకుంటున్న హింసాత్మక సంఘటనలకు శాంతియుత పరిష్కారానికి సంసిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం, చర్చల రద్దు వల్ల లబ్దిపొందే సిసలైన పార్టీ ఎవరంటే ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ. ఈ నెలాఖరుకు ఇది పూర్తికావచ్చని తెలుస్తోంది. 

దీని వల్ల కూడా అధిక స్థాయిలో హింస చోటుచేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తాలిబాన్ ఎన్నికలను తిరస్కరిస్తూ ప్రకటన చేసింది. ఈ ఎన్నికలు న్యాయబద్ధమైనవి కావని అభిప్రాయపడుతోంది. ఈ పరిస్థితుల్లో, ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్ ఆలోచిస్తే ఇఫ్పటికే అది బయట నుంచి దాడులతో ఎంతగానో వీగిపోయి బలహీనంగా ఉంది. నాలుగు దశాలబ్దాలుగా అనిశ్చితంగా అక్కడ అంతర్యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాని పరిస్థితి నేటికీ అస్థిరంగా ఉంది. ఇప్పటి పరిస్థితులను గమనిస్తే అమెరికా సైనిక దళాలతో తాలిబాన్ తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. అంతేకాదు రాజకీయ సంభాషణలు చోటుచేసుకోకపోతే ఆఫ్ఘన్ ప్రభుత్వ పోరాటం కొనసాగుతుంది. 

అమెరికా సైనిక దళాలు బాగా అలసిపయాయి. రానున్న అధ్యక్ష ఎన్నికల పరంగా ట్రంప్ కూడా ఈ క్లిష్టమైన అంశంలో ట్రంప్ పాలసీ అప్షన్లు కూడా పరిమితంగానే ఉన్నాయి. ఆఫ్ఘన్ శాంతి స్థాపనా కార్యకర్తలు మాట్లాడుతూ ఆఫ్ఘన్ ఎన్నికల అనంతరం చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఇఫ్పటి పరిస్థితిని గమనిస్తే, ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ ఇపుడు అసంపూర్ణ స్థితిలో ఉంది. చర్చలు తిరిగి కొనసాగించాలంటే, అమెరికా పెట్టిన కౌంటర్ టెర్రరిజం గ్యారెంటీ డిమాండుకు తాలిబాన్ అంగీకరించాల్సి ఉంటుంది. ముందున్న దారి సులువుగానే కనిపిస్తోంది కానీ తాలిబాన్ల నుంచి సర్దుబాటు వైఖరి రావాల్సిన అవసరం ఎంతో ఉంది. 

రచన: కల్లోల్ భట్టాఛార్జీ, స్పెషల్ కరస్పాండెంట్, ది హిందు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన