అనవసర సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్

అనేక సమస్యలు చుట్టు ముట్టిన పాకిస్తాన్ లో గత నెలలో చోటు చేసుకున్న అనేక పరిణామాల తో ఆ దేశ రాజకీయాల తీరు రసవత్తరంగా మారింది.

గత నెల్లాళ్లుగా మౌలానా ఫజులూర్ రెహమాన్ చేపట్టిన ఆజాదీ మార్చ్ చుట్టూనే పాకిస్థాన్ లో రాజకీయాలు పరిభ్రమించాయి. మూడు సార్లు ప్రధాన మంత్రిగా సేవలందించిన అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని చికిత్స కోసం విదేశాలకు వెళ్లడానికి అనుమతించాలా అనేదానిపై చర్చ జరిగింది .పాకిస్తాన్ భవిష్యత్తుకు సంబంధించిన ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టడం కంటే ఈ సమస్యపై పాకిస్తాన్ టెలివిజన్ చానెళ్లు వార్తా పత్రికలు అవసరాన్ని మించి చర్చలు జరిపాయి వార్తలకు ఎక్కువ చోటు కేటాయించాయి.

అక్టోబర్ 27 న సుకూర్ నుండి ప్రారంభమైన ఫజులూర్ మార్చ్ కొద్ది రోజులకు ఇస్లామాబాద్ చేరుకున్న అంశం మీడియా దృష్టిని పెద్ద ఎత్తున ఆకర్షించింది. ఇమ్రాన్ ప్రభుత్వాన్ని దించి వేయటమే తమ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యమని, అది జరగకుండా తన మనుషులు ఇస్లామాబాద్ ను విడిచిపెట్టరని మౌలానా అన్నారు. చేతుల్లో కర్రలతో తిరుగాడుతున్న అతని పార్టీ కార్యకర్తల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో చాలామంది వ్యాఖ్యాతలు ప్రభుత్వాన్ని కదిలించే హింసాత్మక ఫలితాలను ఊహించారు. .కొన్నాళ్లకి ప్రభుత్వం కొంత మొండి ధైర్యంతో మరొక స్థాయిలో కొంచెం మెతకబడి ఫజులూర్ తోను కొందరు ప్రతిపక్ష నాయకులతోను చర్చలు జరిపింది .వారి కవాతు ప్రదర్శనకు ఓ మాదిరి మద్దతు తెలిపింది. తత్ఫలితంగా మౌలానా తన మద్దతుదారులను ఈ మార్గం విడిచి, ప్లాన్ బి ని అమలు చేయాలని దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల్లో ర్యాలీలు నిర్వహించాలని కోరారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. పాకిస్తాన్లోని పరిశీలకుల పరిశీలన మేరకు ఇస్లామాబాద్ చేరిన వెంటనే మౌలానా నిష్క్రమణ వెనుక కుట్ర సిద్ధాంతాలు ర్యాలీ వెనుక సైన్యపు అదృశ్య హస్తాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి.

ర్యాలీ చుట్టూ ఏర్పడిన గందరగోళం మధ్య నవాజ్ షరీఫ్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లడానికి అనుమతించిన కేసు మీడియాలో చర్చకు వచ్చింది. దీంతో దాదాపుగా ప్రజల దృష్టి ర్యాలీ నుంచి మళ్లింది .అవినీతి కేసులో ఏడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న నవాజ్ షరీఫ్ మరొక కేసులో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అదుపులో ఉన్నారు. ఆయన దీర్ఘకాలంగా గుండె సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గటంతో లాహోర్ హైకోర్టు ఆయనకు ఆరోగ్య కారణాల రీత్యా బెయిలు మంజూరు చేసింది .అయితే పిటిఐ ప్రభుత్వం ఆయన పేరును ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్ నుంచి తీసివేయటానికి సుముఖంగా లేదు. ఏడు బిలియన్ రూపాయల నష్టపరిహార బాండ్ జమ చేసే షరతుతో ఆయనకు నాలుగు వారాల వన్ టైమ్ ఎగ్జిట్ కు సానుకులపడింది .అయితే పి ఎం ఎల్ ఎన్ ఈ ప్రతిపాదనను చాలావరకు తిరస్కరించింది. చివరకు లాహోర్ హైకోర్టు జోక్యం చేసుకుని నవాజ్ విదేశాలకు వెళ్ళడానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.దాంతో ప్రభుత్వం సానుకూలంగా మృదువుగా అవసరమైన అనుమతిని మంజూరు చేసింది .నవంబర్ 20 న ఖతారీ ఎయిర్ అంబు లెన్స్ లో నవాజ్ షరీఫ్ చికిత్స కోసం లండన్ కు బయలుదేరారు.

అవినీతి పరులను దోషులను దేశం వదలి పోయేందుకు తాను అనుమతించ నన్న గట్టి పట్టుదలను సడలించాలని సైన్యం నచ్చజెప్పినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి . నవాజ్ షరీఫ్ ప్రతిభావంతమైన రాజకీయ నేపథ్యం కారణంగా తాను ఎటువంటి రాయితీని ఇవ్వలేనని ఇమ్రాన్ అనవసరంగా చిక్కు ముళ్లు వేశారు. తన నయా పాకిస్తాన్ లో రియాసత్ ఏ మదీనా మేరకు వేర్వేరు తరగతులకు వేరువేరు నియమాలకి అవకాశం లేదన్నది ఆయన అభిప్రాయం .

అయితే కథ ఇక్కడితో ముగియదు . నవాజ్ కేసులో యూటర్న్ తీసుకున్నట్లు విమర్శలు ఎదుర్కొన్న ఇమ్రాన్ న్యాయ వ్యవస్థ బలవంతంపైనే తన నిర్ణయం సడలించాల్సి వచ్చిందని అన్నారు. ఇది ఇమ్రాన్ ఖాన్ విధానాలపై మరొకసారి విమర్శలకు దారితీస్తుంది. రాజకీయ నాయకులు ఇలాంటి సమస్యలతో సతమతమవుతూ వారి దుర్బలత్వాన్ని చూపిస్తుండగా, సైన్యపు నీడ పాకిస్తాన్ లో మందంగా విస్తరిస్తోంది .

ద్రవోల్బణం హెచ్చుగా ఉన్న సమయంలో ఉ ల్లిపాయలు టమాటాల ధరలు ఆకాశాన్ని తాకడం తో ప్రజలను నిరాశ ఆవహిస్తుంది. ఈ తరుణంలో ఇటువంటి దీర్ఘకాలిక రాజకీయ అల్లకల్లోలం ఇమ్రాన్ ప్రభుత్వానికి లేదా పాకిస్తాన్ ప్రజాస్వామ్యానికి దీర్ఘకాలంలో ఉపయోగపడదు.

రచన: డా.అశోక్ బెహురియా, దక్షిణాసియా కేంద్ర సమన్వయకర్త,సీనియర్ ఫెలో.

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన