సీపీఈసీ పై పాక్’కు అమెరికా హెచ్చరిక
చైనా 2013లో బెల్ట్ అండ్ రోడ్డు ఇనిషియేటివ్-BRI- పనులు ప్రారంభించింది. అప్పటినుంచి నుంచి, ముఖ్యంగా అందులో భాగంగా చేపట్టిన చైనా.. పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్, ఆర్థిక నడవ భారత దేశంలో ఆందోళనలు రేకేతిస్తోంది. ఈ నడవ నిర్మాణం భారత దేశ సార్వభౌమాధికారానికి ప్రమాదంగా పరిణమిస్తుందని, అదే విధంగా ఈ ప్రాంతంలో ఇతరత్రా ఉద్రిక్తతలకు దారి తీస్తుందని భారత దేశంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో భారత దేశం చాలా కచ్చితమైన, నియమబద్దమైన నిర్ణయాన్ని తీసుకుంది. ‘సీపీఈసీ’ని నిర్ద్వందంగా వ్యతిరేకించింది. నిజానికి BRIని మొదటగా వ్యతిరేకించిన దేశం భారతదేశం. అలాగే, చైనాలో జరిగిన బిల్డ్ అండ్ రోడ్ ఫోరం రెండు సమావేశాలకు తమ ప్రతినిధిని పంపని ఏకైక దేశం కూడా భారత దేశమే. ఆవిధంగా BRI విషయంలో భారత దేశం 2013నుంచి ఒకే విధానాన్ని,ఒకే పంధాను పాటిస్తూ వచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ కుండా వెళ్ళే BRI ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ CPEC విషయంలో భారత దేశం ఎప్పటికప్పుడు అభ్యతరాలను వ్యక్తపరుస్తూనే ఉంది. “ CPECని ప్రధాన ప్రాజెక్టులో చేర్చడంతో దేశ సర్వ భౌమాధికారం, ప్రాతీయ సమగ్రతల విషయంలో భారత దేశం వ్యక్తపరిచిన ఆందోళనను పట్టిచుకో లేదు” అనేదే భారత దేశం అధికారిక నిర్దేశం.
ఒక్క భారత దేశం మాత్రమే కాదు, ఇంకా అనేక దేశాలు కూడా, BRI పట్ల, మరీ ముఖ్యంగా CPEC పట్ల తీవ్ర అసంతృప్తిని, వ్యక్త పరుస్తూనే ఉన్నాయి. అమెరికా, కూడా ఆర్థిక నడవ విషయంలో అసంతృప్తిని, అభ్యంతరాలను వ్యక్తపరిచింది. దక్షిణ , మధ్య ఆసియా వ్యవహారాల యాక్టింగ్ అసిస్టెంట్ సెక్రటరీ అఫ్ స్టేట్, ఆలిస్ వెల్స్, వాషింగ్టన్’ డీసీలోని వుడ్రో విల్సన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్కాలర్స్, సమావేశంలో CPEC పై తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ, “ BRI ప్రాజెక్టులో భౌగోళిక రాజకీయ పర్యావరణ అంశాలు ముడిపడి ఉన్నాయని,అది నుంచి భారత దేశం చాలా స్పష్టంగా చెపుతూనే ఉంది. ఆర్థిక ప్రాతిపదిక లేకుండా దేశ సార్వభౌమాధికారానికి ప్రమాదంగా పరిణమించే ప్రాజెక్టుపై భారత దేశం వ్యక్తపరుస్తున్న ఆందోళనలతో మేము ఎకీభవిస్తున్నాము. భారత ఆందోళనలతో పాలుపంచుకుంటున్నాము” అని పేర్కొన్నారు.
“చైనా-పాకిస్థాన్ ఉమ్మడి కుట్ర, ముఖ్యంగా CPEC భారత సార్వభౌమాధికార హక్కులకు భంగం కలిగిస్తుంది” అని, వెల్స్ చేసిన ప్రకటన, BRI విషయంగా, ఈ ప్రాంతంలో చైనా ప్రదర్శిస్తున్న విపరీత, వికృత పోకడల విషయంలో భారత, అమెరికా ఉమ్మడి అభిప్రాయానికి అద్దం పట్టింది.
ఇదిలా ఉండగా, భారత దేశం జపాన్’తో కలిసి BRIకి విశ్వసనీయ, సుస్థిర, చిరకాలం మన్నే ప్రత్యాన్మాయాన్ని అనేక దేశాల ముందుంచే ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించింది. ఇందుకు సంబంధించి, ఆసియా–ఆఫ్రికా కారిడార్,(AAGC), కొలంబో నౌక కేంద్రంలో జపాన్ సహకారంతో డీప్-సీ కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి ఇటీవల సంతకాలు చేసిన ఒప్పందం, రెండు ప్రధాన ఉదాహరణలుగా పేర్కొనవచ్చును. అమెరికా కూడా ఇందులో చేరేందుకు ఆసక్తి చూపుతోంది.
వెల్స్ చేసిన వ్యాఖ్యలను, భారత – అమెరికాల మధ్య వేగంగా పెరుగతున్న భాగస్వామ్యానికి ప్రాతిపదికగా కూడా విశ్లేషించ వచ్చును. భారత ప్రధాన మంత్రి 2019 సెప్టెంబర్’లో అమెరికాలో పర్యటించారు. వివిధ అంశాలకు సంబంధించి ఉన్నత స్థాయిలో చర్చలు జరిపారు. ఆ తర్వాత భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్, అమెరికా వ్యూహ బృందంతో జరిపిన చర్చలు ఉభయ దేశాల సంబధాలను మరింతగా బలోపేతం చేసేందుకు, ఉపకరణంగా ఉపకరించాయి. అలాగే, పరస్పర ప్రయోజనాలను, ఒకరి ఆకాంక్షలను ఒకరు తెలుసుకునేందుకు, భవిష్యత్ సంబంధాలను మరింత ప్రయోజనకరంగా మలచుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన, ఆ తర్వాత భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కొనసాగించిన ప్రయత్నాలు, ఫలించాయి, ఫలితాలు ఇచ్చాయి. ఇలా భారత్, అమెరికా దేశాలమధ్య వ్యూహాత్మక సంబంధాల విషయంలో పెరిగిన సుహృద్భావ సంబంధాలు, పాక్ – చైనా దుష్ట సంగమం వలన భారత దేశం ఎదుర్కుంటున్న సవాళ్ళను అమెరికా విధాన నిర్ణేతలు అర్థం చేసుకునేలా చేశాయి.
అమెరికా అసిస్టంట్ సెక్రటరీ అఫ్ స్టేట్, చేసిన ఇతర వ్యాఖ్యల విషయానికి వస్తే, CPEC వలన పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. ఆర్థిక నడవ దీర్ఘకాల ప్రయోజనాల సాధ్యా సాధ్యలపై పాక్’ హెచ్చరించారు. అప్పుల ఊబిలో కూరుకు పోయిన పాకిస్థాన్ ఆర్థిక వ్యస్థను ఆ ఊబిలోంచి బయటకు చేర్చేందుకు చైనా చిత్తశుద్దిని చూపడం లేదని, ధర్మ బద్ధంగా వ్యహరించడం లేదని ఆమె సవివిరంగా వివరించారు. అలాగే, CPEC ప్రాజెక్టు ఉభయతారక ప్రాజెక్టు కాదని, ఈ ప్రాజెక్టు వలన చైనాకు మాత్రమే ప్రయోజనం జరుగుతుందని, వెల్స్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ 2019లో 3.3 శాతం వృద్ధిని సాధించింది. ఇది 2020లో 2.8శాతానికి చేరుతుందని భావిస్తున్నారు.
CPEC ఎన్నో లక్షల కోట్ల డాలర్ల ప్రాజెక్టు. దానితో పాటుగా పాకిస్థాన్ రుణ భారం కూడా, పెరిగింది. ఇంకా పెరుగుతుంది. 2018లో పాకిస్థాన్ విదేశీ రుణాలు 105 బిలియన్ అమెరికా డాలర్లుగా ప్రకటించారు. అదే సంవత్సరం జీడీపీ 312 అమెరికా డాలర్లుగా ఉంది. అదే, 2019 మే వచ్చేసరికి, డోలయమానంలో పడిన పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థతో 6 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ఒప్పందం పై సంతకం చేసింది.ఇందుకు అదనంగా,పాకిస్థాన్ CPEC ఇతర BRI ప్రాజెక్టుల కోసం సౌది అరేబియా వంటి దేశాల ఆర్థిక సహాయం కోరింది. అయితే వాస్తవాలు ఇలా ఉన్నప్పటికీ, చైనా, పాకిస్థాన్ అధికారులు CPEC పై వెల్స్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అయితే, వాస్తవంలో ఈ ప్రాజెక్టు, ఇప్పటికే సమస్యలతో సతమత మవుతున్న పాకిస్థాన్’కు తలకు మించిన భారంగా మారుతోంది, అనేది ఎవరూ కాదన లేని కఠిన సత్యం.
ఆంగ్ల మూలం: సానాహష్మి, చైనా వ్యవహరాల వ్యూహాత్మక విశ్లేషకులు

Comments
Post a Comment