శ్రీలంక ఏడవ అధ్యక్షునిగా గోటబయ రాజపక్స ఎన్నిక
శ్రీలంక రాక్షపతి ఎన్నికలు గత శనివారం జరిగాయి. ఈ ఎన్నికలలో శ్రీ లంక పోడుజన పెరమున (ఎస్ఎల్పీపీ) అభ్యర్ధి గోటబయ రాజపక్స, దేశ ఏడవ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఏన్నికయ్యారు.పోలైన ఓట్లలో 52.25 శాతం ఓట్లు రాజపక్సేకే పోలయ్యాయి.ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రాజపక్సే, శ్రీలంకలోని అనురాధపురాలో తాను దేశాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు ప్రపంచ నాయకులు అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన గోటబయ రాజపక్సను అభినందించారు.
శ్రీలంక అధ్యక్షునిగా ఎన్నికైన గోటబయ రాజపక్సకు పంపిన అభినందన సందేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారత్ – శ్రీలంక సంబంధాలు మరింత బలపడే విధంగా భారత దేశం నూతన అధ్యక్షునితో కలిసి పనిచేస్తుందని, సేనః సంబంధాలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. భారత ప్రజలు, ప్రభుత్వం తరపున, వ్యక్తిగతంగా నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాజపక్సే సమర్ధ నాయకత్వంలో శ్రీలంక ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో అభివృద్ధి పథంలో ముందుకు పయనిస్తారన్నఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అదే విధంగా రాజపక్సే నాయకత్వంలో శ్రీలంక – భారత దేశాల మధ్య సాంస్కృతిక, చారిత్రిక, నాగరికతా సంబంధాలు మరింతగా బలోపేతం అవుతాయని, ఉభయ దేశాల ప్రజల ప్రజల మధ్య స్నేహ పూర్వక సంబంధాలు మరింతగా వికశిస్తాయని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు, శ్రీలంకలో ఏర్పడే నూతన ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఉభయ దేశాల అభివృద్ధి, రక్షణ కోసంగా భారత దేశంతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తామని, కలిసి పనిచేస్తమని రాజపక్సే ప్రత్యుత్తరంలో పేర్కొన్నారు.
శ్రీలంక ఆర్థిక అభివృద్ధి, రక్షణ విషయంగా భారత దేశం అనేక రూపాల్లో సహాయం అందించింది. ఆ విధంగా శ్రీలంకకు భారత దేశం అత్యంత సన్నిహిత భాగస్వామ్య దేశంగా గుర్తింపు పొందింది. అయినా, మహీంద్రా రాజపక్సే రెండవసారి దేశాధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం భారత – శ్రీలంక స్నేహ సంబంధాలు కొంచెంగా దెబ్బతిన్నాయి. చిన్న చిన్న పొరపచ్చాల కారణంగా కొద్దిగా క్షీణించాయి. అయితే, ఆ తర్వాతి కాలంలో పొరుగున ఉన్న ద్వీప దేశం శ్రీలంకలో జాతీయ ఐక్యతా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితులలో మార్పు వచ్చింది. ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2015-19 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరణ చెంది, రెండు దేశాల మధ్య పూర్వ బంధం బలపడింది. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలనే ఉభయ దేశాల సంకల్ప, దీక్షలకు అనుగుణంగా భారత ,శ్రీలంక దేశాలు అనేక అవగాహనా ఒప్పందాల పై సంతకాలు చేశాయి. అయితే శ్రీలంకలో దేశీయంగా ఏర్పడిన అవరోధాలు, పరిపాలనా పరమైన ఇబ్బందుల కారణంగా ఉభయ దేశాల మధ్య చేసుకున్న అవగాహనా ఒప్పందాలలో చాలావరకు ఒప్పందాలు అములుకు నోచుకోలేదు.ఇక ఇప్పుడు నూతన అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ఆయన ప్రభుత్వం అనుసరించే విధానాలపై ఈ ఒప్పందాల భవిష్యత్’ ఆధారపది ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
శ్రీలంకలో భారత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో జరుగతున్న జాప్యం, భారత దేశ భద్రతపై ప్రభావం చూపే విధంగా శ్రీలంకలో చైనా చూపుతున్న వ్యూహాత్మక చొరవ, శ్రీలంక సైనిక కార్యకలాపాలలో చైనా జోక్యం, శ్రీలంక తమిళులలో సయోధ్య లేమీ, ఇలా అనేక కారణాలు శ్రీలంక- భారత సంబంధాలఫై ప్రభావం చూపుతున్నాయి.
గోటబయ రాజపక్స దేశాధ్యక్షునిగా ఎన్నికైన నేపధ్యంలో, ప్రభుత్వ పరిపాలన వ్య్వహరాలో ఆయన కుటుంబం కీలక పాత్రను పోషిస్తుందని భావిస్తున్నారు. రాజపక్స సోదరులు, ఇతర కుటుంబ సభ్యుల కూడికతో ఏర్పడే ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనేది, వేచి చూడవలసి ఉంటుంది. అలాగే రాజపక్సే సోదరులు చైనాకు సన్నిహితంగా ఉన్నారు అనేది అందరికి తెలిసిన విషయం. మహీంద్రా రాజపక్సే ప్రభుత్వంలో గోటబోయ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పట్లో అయన భారత దేశ రక్షణ అంశాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక విధంగా ఉపేక్షించారు. అయితే, అనంతర కాలంలో రాజపక్సే సోదరులు తమ తప్పును తెలుసుకుని, తరిగి అధికారంలోకి వస్తే చేసిన తప్పులు దిద్దుకుంటామని మాటిచ్చారు.
గోటబయ రాజపక్స 2005-2009 మధ్య కాలంలో శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శిగా LTTEని ఓడించడంలో కీలక పాత్రను పోషించారు. అదే సమయంలో ఆయన మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కున్నారు. అలాగే, ఆరోజుల్లో ఆయన బౌద్ధ జాతీయ తీవ్రవాద సంస్థలను, ఆ సంస్థలు నిర్వహించే మతపరమైన కార్యక్రమాలను ప్రోత్సహించారనే ఆరోపణలు కూడా చాలా బలంగా వినిపించాయి. ఈ నేపధ్యంలోనే,2019 ఎన్నికల్లో శ్రీలంక అల్పసంఖ్యాక ఓట్లు చాలా వరకు ఆయన ప్రత్యర్ధి సజిత్ ప్రేమదాసకి పోలయ్యాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. అయితే, గోటబయ రాజపక్స తాను ‘అందరి అధ్యక్షుడి’ గా ఉంటానని ప్రకటించారు. అందరినీ సమానంగా చూస్తానని అన్నారు.
ఎన్నికలలో గెలిచిన తర్వాత చేసిన తొలి ప్రసంగంలో గోటబయ రాజపక్స, ఈస్టర్ సండే బాంబు పేలుళ్ళ తర్వాత తీవ్ర వత్తిళ్ళకు గురవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంపై పై దృష్టిని కేంద్రీకరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అదెలా ఉన్నా, తమిళుల విషయంలో దేశ అధ్యక్షునిగా గోటబయ రాజపక్స ఎలా వ్యవహరిస్తారు అనే దానిపై భారత దేశం ప్రదానంగా దృష్టి నిలిపింది. భారత్ – శ్రీలంక సంబందాలలో ఇదొక కీలక అంశం కావడం వలన, సహజంగానే ఈ విషయంలో నూతన అధ్యక్షుని ధోరణి ఎలా ఉంటుంది అనేది భారత దేశానికి కీలక అంశంగా నిలిచింది.
దేశ రక్షణ, భద్రతల దృష్ట్యా, గోటబయ రాజపక్స నాయకత్వంలో భారత, శ్రీలంకల మధ్య పటిష్టబంధ ఏర్పడాలని భారత దేశం ఆశిస్తోంది. భారత్ – శ్రీలంక బంధాలను బలోపేతం చేసుకునేందుకు ఎదో ఒక రంగంలో కాదు, అన్ని రంగాలలో ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావలసిన అవసరం ఉంది. దేశీయ సమస్యలు, దేశీయంగా చోటు చోటుచేసుకునే పరిణామాలు ఉభయ దేశాల సంబంధాలపై ఎప్పుడూ ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి, అల్పసంఖ్యాక ప్రజల బాగోగుల విషయంలో, మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించి, సయోధ్య సాధన యంత్రాగ ఏర్పాటు విషయంలో గోటబయ రాజపక్స ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే దానిపై, భారత్ – శ్రీలంక సంబంధాలు ఆధారపడి ఉంటాయి. అలాగే సమతుల్య విదేశాంగ విధానం అమలు చేయడంలో గోటబయ రాజపక్స ప్రభుత్వ, అపేక్ష, సామర్ధ్యాన్ని బట్టి కూడా భారత్ – శ్రీలంక భవిష్యత్ సంబంధాలు ఆధారపది ఉంటాయి. రాజకీయ, ఆర్థిక, రక్షణ రంగాల విషయంలో ఎదో ఒక దేశం వైపు మొగ్గుచూపకుండా సంతుల్యతను పాటిస్తే, ఉభయ దేశాల దౌత్య బంధాలు బలపడతాయి. ఉభయ దేశాలకు ప్రయోజనం చేకూరుతుంది.
రచన: డా. గుల్బిన్ సుల్తానా, రీసెర్చ్ ఎనలిస్ట్, ఐడీఎస్ఎ

Comments
Post a Comment