అభివృద్ధి దిశగా భారత్- భూటాన్ సంబంధాలు
భూటాన్ విదేశాంగ శాఖ మంత్రి ల్యోన్పో (డాక్టర్) తండి దోర్జీ, భారత పర్యటన ఉభ దేశాల స్నేహ సంబంధాలకు కొత్త ప్రమాణాలను, కొత్త అర్థాలను నిర్దేశించింది. డాక్టర్, దోర్జీ వారం రోజుల పర్యటనలో భాగంగా భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్. జయశంకర్’ తో సమావేసమయ్యారు. ఉభయ దేశాల విదేశాంగ మంత్రులు రెండు దేశాల దౌత్య సంబందాలకు సంబందించిన అన్ని అంశాలను సమగ్రంగా చర్చించారు. ఆర్థిక సహకారం, అభివృద్ధి భాగస్వామ్యం, జల విద్యుత్ సహకారం వంటి ద్వైపాక్షిక సంబంధాలను ఉభయ దేశాల విదేశాంగ శాఖ మంత్రులు అమూలగ్రంగా చర్చించారు. భారత విదేశాంగ శాఖ మంత్రితో సమావేశానికి ముందు,భూటాన్ విదేశాంగ మంత్రి దోర్జీ భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలేతోనూ సమావేశమయ్యారు.భూటాన్ విదేశాంగ మంత్రి డిల్లీ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి బీహార్’లోని బుద్ధగయ, రాజ్గిర్’ సందర్శిస్తారు. అక్కడి నుంచి కోల్’కత వెళతారు. కోల్’కతాలో ఆయన పశ్చిమ బెంగాలో గవర్నర్, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంది.
భారత్- భూటన దేశాల మధ్య ఉన్నతస్థాయి వ్యక్తుల పర్యటనలు, అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఆ సంప్రదాయంలోభాగంగానే, ల్యోన్పో తండి దోర్జీ భారత దేశంలో పర్యటించారు. భూటాన్ ప్రధానమంత్రి డాక్టర్ లోటె శెరింగ్ సారధ్యంలోని, డ్రక్ న్యామ్‌రూప్ త్సోగ్‌పా పార్టీ ప్రభుత్వం,నవంబర్ 7వ తేదీన ప్రధమ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి దోర్జీ భారత దేశంలో పర్యటించారు. శెరింగ్ ప్రభుత్వం, గడచిన సంవత్సర కాలంలో అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టేందుకు అవసరమా అర్తిఅక్ వనరులు లేక అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కుంది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో తీవ్ర నిధుల కొరతను ఎదుర్కుంది. ఆ దేశ12వ ప్రణాళికలో ఆరోగ్య ప్రణాళిక అమలుకు 13 బిలియన్’ ఎన్యూలు అవసరం కాగా, విదేశాంగ శాఖ 3.5 బిలియన్ ఎన్యూలు కేటాయించింది. భూటాన్ ప్రభుత్వం ప్రధానంగా విదేశీ రుణాలు, వాణిజ్య లోటు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మందగమనం వంటి విషయాల్లో సమస్యలను ఎదుర్కుంటోంది. ఈ రంగాల్లో భూటాన్ ప్రభుత్వం ఆర్ధిక సంస్కరణలను అమలు చేస్తోంది, అయినా సమస్యలు తపప్తం లేదు. ప్రతికూల స్థూల ఆర్థిక సూచికలకు భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కుంటున్న మందగమనానికి పరస్పర సంబందం ఉండవచ్చని భూటాన్ ప్రభుత్వం భావిస్తోంది.
ఇటీవల కాలంలో భారత్ – భూటన్ దేశాలమధ్య ఉన్నత స్థాయిలో పరస్పర ఇచ్చిపుచ్చుకుకే ధోరణి ఊపందుకుంది. ఈ నేపధ్యంలో భూటాన్ విదేశాంగ శాఖ మంత్రి పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉభయ దేశాల మధ్య, పరస్పర విశ్వాసం, పరస్పర అవగాహన ప్రాతిపదికన చాలా కాలంగా చక్కని ద్వైపాక్షిక స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. కొంతకాలం క్రితంభారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ భూటాన్ రాజధాని థింపులో పర్యటించారు.అంతకు ముందు భారత విదేసంగా మంత్రి డాక్టర్ జైశంకర్, పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే, ‘ఇరుగు పొరుగుకు ప్రధమ ప్రాధాన్యత’ విధానంలో భాగంగా భూటాన్’ సందర్శించారు. నిజానికి డాక్టర్ జైశంకర్, విదేశాంగ శాఖ మంత్రిగా చేపట్టిన తొలివిదేశీ పర్యటన భూటాన్ పర్యటన. అంతకు ముందు 2018లో భూటాన్ ప్రధానమంత్రి లోటె శెరింగ్’ ప్రధానిగా విదేశీ పర్యటనలకు భారత పర్యటనతోనే శ్రీకారం చుట్టారు.
భూటాన్, భారత దేశాల మధ్య 1968లో దౌత్య సంబంధాలు ఏర్పడిన అనంతరం, ఉభయ దేశాల దౌత్య బంధం అపూర్వ స్నేహబందానికి ఒక ఉదాహరణగానిలిచింది. పరస్పర విశ్వాసం, పరస్పర అవగాహన, ఉభయ దేశాల పరిపక్వత ఆధారంగా బలపడిన రెండు దేశాల స్నేహ, దౌత్య సంబంధాలు గాథ, దక్షిణ ఆసియా దేశాలలో విజయవంతమైన దౌత్య గాధలలో ఒకటిగా నిలిచింది . భారత్ – భూటాన్ దేశాల మధ్య 1949 సహకార ఒప్పందం ఏర్పడింది. ఈ ఒప్పందాన్ని మరింత బలోపేతం చేస్తూ 2007లో సవరణలు చోటు చేస్కున్నాయి. అదే సంవత్సరంలో సవరించిన సహకార ఒప్పందంపై ఉభయ దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందమే ఇప్పటికీ రెండు దేశాల స్నేహ, దౌత్య సంబంధాలకు బలమైన పునాదిగా, ఆధార స్తంభంగా నిలించింది.
ఈ ఒప్పందం ప్రకారం ఓపెన్ డోర్, రక్షణ రంగ సహకారం, ఉభయ దేశాల ప్రజల మధ్య వ్యక్తిగత సంబంధాలు పెంపొందించడం వంటి అనేక ప్రత్యేక సంబంధాల అభివృద్ధికి చక్కని ఆస్కారం లభించింది. ఉభయ దేశాల మధ్య అనేక సందర్భాలలో పొరపొచ్చాలు వచ్చినా, ఉభయ దేశాలు పరస్పర సహకార అవసరాలను గుర్తించాయి. ఆర్థిక వృద్ధిలో సమాన స్థాయిలో కలిసి అడుగులు వేశాయి. ప్రజాస్వామ్యం, ప్రాంతీయ శాంతికి సమన ప్రాధాన్యతను ఇచ్చాయి.. ఆ విధంగా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దేదీప్యమానంగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం, జల వనరులు, వాణిజ్య, రవాణా, ఆర్థిక సహకారం, రక్షణ, సరిహద్దుల యాజమాన్యం వంటి అనేక అంశాలకు సంబంధించి రెండు దేశాల మధ్యన అనేక సంస్థాగత దౌత్య ఏర్పాట్లు,ఒప్పందాలు, ఎలాంటి వడిదుడుకులు లేకుండా కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉంటే, భూటాన్ ప్రభుత్వం తమ దేశంలో పర్యటించే భారతీయ పర్యాటకులపై, ఇంతవరకూ లేని, ‘లేవీ’ విధించాలని నిర్ణయించింది. ఇటీవల కాలంలో హిమాలయ రాజ్యంలో పర్యటించే విదేశీ పర్యాటకుల సంఖ్య, ముఖ్యంగా భారతీయ పర్యాకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్క 2018 సంవత్సరాన్నే పరిగణలోకి తీసుకుంటే, భూటాన్’లో పర్యటించిన మొత్తం దక్షణ ఆసియా పర్యాటకులలో సగం మందికి పైగా భారతీయ పర్యాటకులే ఉన్నారు. ఇప్పటికే విధిస్తున ‘పర్మిట్ ప్రాసెసింగ్ ఫీజు’కు అదనంగా ఇప్పుడు భూటాన్ ప్రభుత్వం ‘సుస్థిర అభివృద్ధి రుసుము’ పేరిట కొత్త ఫీజును వాసులు చేయాలని పరతిపదించింది. అయితే ఇది ఎంత ఉంటుంది అనేది ఇంకా స్పష్టం కాలేదు. భూటాన్’లో పర్యావరణ వ్యవస్థ చాలా పెళుసుగా, సున్నితంగా ఉన్న నేపధ్యంలోపర్యాటక రంగం సుస్థిర అభివృద్ధికి ఈ కొత్త ఫీజును ప్రతిపాదించారు.
ఈ నేపధ్యంలో జరిగిన డాక్టర్ దోర్జీ భారత పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత మాత్రమే కాదు, మతపరమైన ప్రాధాన్యత కూడా ఉంది. అలాగే, ఈ పర్యటన విస్తృత ఆర్థిక సహకారం దిశగా పడిన మరో ముందడుగుగా కూడా భావించ వచ్చును.అదే విధంగా,ఉభయ దేశాల మధ్య ప్రస్తుత దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకుంటూ నూతన రంగాలలోకి విస్తరించుకోవడం కూడా డాక్టర్ దోర్జీ భారత పర్యటన ప్రధాన లక్ష్యాలలో ఒకటిగా పేర్కొనవచ్చును. ఉభయ దేశాల విదేశాంగ మంత్రులు దౌత్య సంబంధాలను మరింతగా ముందుకు తీసుకుపోయేందుకు అవసరమైన వివిధ అంశాలను స్థూలంగా చర్చించారు. వాతావరణ మార్పులు, మౌలిక వసతులు, రక్షణ, రక్షణ సంబంధ విషయాలు, భూటాన్ 12 వ పంచవర్ష ప్రణాళికకు భారత దేశం అందించే సాంకేతిక, ఆర్థిక సహకారం వంటి పలు కీలక అంశాలపై కూడా ఉభయ దేశాల విదేశాంగ మంత్రులు సమీక్షించారు. శరవేగంగా మారుతున్న ప్రాంతీయ, ప్రపంచ పరిణామాల నేపధ్యంలో ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగు పర్చుకోవాలని రెండు దేశాల విదేశాంగ మంత్రులు అంగీకరించారు.
రచన : డా. నిహార్ ఆర్. నాయక్ , రిసెర్చ్ ఫెలో, ఐడీఎస్ఎ

Comments
Post a Comment