ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ దిశగా భారత్
బడ్జెట్ 2019లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 నాటికి ఐదు ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు భారత్ చేరుకోవాలనే అంశంపై తన దృష్టిని కేంద్రీకరించారు. ‘విజన్ ఫర్ ది డికేడ్’ ను ఆమె ప్రకటించారు. ఇందులో విధానపరమైన పలు చర్యలు మిళితమై ఉన్నాయి. ఈ రోడ్‌మ్యాప్ పూర్తిగా పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధిపైనే తన దృష్టిని కేంద్రీకరించింది.
విధాన చర్యలు, భౌతిక, సామాజిక మౌలికసదుపాయాలతో పాటు డిజిటల్ మౌలిక సదుపాయాలతో పాటు ద్రవ్య పెంపుదలను కూడా చేర్చారు. అలాగే మహిళలకు, చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్యం , నీటి నిర్వహణ, బ్లూ ఎకానమీపై పోకస్, అంతరిక్ష కార్యక్రమాలను బలోపేతం చేయడం, ధాన్యాలు, పప్పులు ఉత్పత్తిలో స్వయంసాధి కారికంగా నిలబడ్డం, ‘మేక్ ఇన్ ఇండియా’ను మరింత విస్తృతస్థాయిలో వృద్ధిచేయడం, ‘ఆయుష్మాన్ భారత్’ను పూర్తిస్థాయి ప్రభుత్వం, పూర్తిస్థాయి పాలనా అంశాలతో మరింత పరిపుష్టం చేయడం వంటి అంశాలు కూడా విధానపరమైన చర్యల్లో ఉన్నాయి. ఈ మొత్తం కార్యక్రమాలలో ప్రతి భారతీయుడు వాటాదారుడేనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానిం చారు.
ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికాభివృద్ధిని 2024 నాటికి సాధించేలా పూర్తి స్థాయిలో నిర్మాణాత్మకమైన సంస్కరణలను రూపొందించారు. ఈ సందర్భంగా ప్రధాని ఆర్థిక సలహా మండలిలోని రతిన్ రాయ్ స్పందిస్తూ ‘మిడిల్ ఇంకమ్ ట్రాప్’లో అధిక అభివృద్ధి పథం పరంగా దారి తప్పే బలమైన ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.
మోదీ 2.0 ప్రభుత్వ లక్ష్యం పెరుగుదలను పెంచడానికి అధిక పెట్టుబడులను ఆకట్టుకోవాలి. భారత ఆర్థిక రంగంలో పెట్టుబడిదారుడు ఆత్మవిశ్వాసంతో పెట్టుబడులు పెట్టాలంటే ద్రవ్య సంఘటితం చాలా ముఖ్యమైందని మోదీ ప్రభుత్వం నొక్కి చెప్పింది. ద్రవ్య సంఘటితం విషయంలో భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇది ఆర్థికరంగంలోని స్థూల మూలధన నిర్మాణాన్ని నష్టపరిచేలా ఉండరాదు. పన్నుల నేతృత్వంలోని ద్రవ్య సంఘటితం ఆర్థిక ప్రగతికి ముఖ్యం. అంతేగాని ప్రజా ఖర్చుల కుదింపు చర్యలు కావు.
ఆర్థిక ప్రగతికి పన్నుల విధానం చాలా ముఖ్యమైన సాధనం. టాక్సేషన్ విషయం తీసుకుంటే, కార్పొరేషన్ టాక్సు హేతుబద్ధీకరణ చాలా ముఖ్యమైన ముందడుగు. కార్పొరేట్ టాక్సు రేటు 400 కోట్ల టర్నోవర్ ఉన్న అన్ని సంస్థలకు 25 శాతం తగ్గించారు. జిఎస్టీ రెవెన్యూ పెరగడానికి ‘ఈజ్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్స్’ చర్యలకు మరింత అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
వ్యవసాయరంగంలో కొనసాగుతున్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి కూడా భారత్ విధానాలను చేపట్టాలి. ఈరోజుటికి కూడా భారతదేశంలోని పండుతున్న చాలా పంటలు వర్షాధారితమైనవే. రుతుపవనాల్లో తలెత్తే వైఫల్యం పంటలను దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితి సహజంగానే రైతులను అప్పుల ఊబిలోకి తోస్తుంది. అందుకే వ్యవసాయరంగంలో స్థూల పెట్టుబడి నిర్మాణాన్ని వెంటనే పెంచాల్సి ఉంది. జనాభా డివిడెండ్‌కు కళ్లం వేయడం ఆర్థిక వృద్ధికి చాలా ముఖ్యం. అంతేకాదు ప్రభుత్వ విధానాలు విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ద్వారా మానవ పెట్టుబడి నిర్మాణాన్ని పటిష్టం చేయొచ్చు. అది ఆర్థిక వృద్ధికి శక్తివంతమైన అంశం. గత పదిహేను సంవత్సరాల కాలంలో ప్రవేశపెట్టిన జండర్ బడ్జెటింగ్‌ను అంచనా గట్టడానికి నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటును కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా ‘లీవ్ నో వన్ బిహైండ్’ (ఎన్ఎన్‌వొబి) నినాదాన్ని రెండవ సారి పదవిలోకి వచ్చిన మోదీ ప్రభుత్వ విధాన ప్రకటనగా తిరిగి పునరుద్ఘాటించారు. జండర్ సెన్సిటివ్‌తో కూడిన మానవాభివృద్ధిని మోదీ ప్రభుత్వం నొక్కి చెప్పింది.
పేద ప్రజలకు చేరువ చేసే ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం. ఎనర్జీ మౌలికసదుపాయాల రంగంలో ఉజ్వల కార్యక్రమం జండర్ బడ్జెటింగ్‌ను ప్రతిఫలిస్తుంది. ఇది మోదీ ప్రభుత్వం చేపట్టిన అత్యంత ముఖ్యమైన పాలసీ విధానం. ‘యుడే’ కార్యక్రమం ఇది. డిస్కమ్ (విద్యుత్ పంపిణీ కంపెనీలు)ఆర్థికపరమైన, కార్యచరణాత్మకంగా పనిచేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం మోదీ ప్రభుత్వం చేపట్టింది. దీని ప్రధాన ఉద్దేశం నూరు శాతం ఇళ్లకు విద్యుత్ కల్పన. ఈ పని ముందుకు సాగుతోంది. అమలు స్థాయిలో ఈ పథకాలకు ఎదురవుతున్న ఆటంకాలను ప్రభుత్వం గుర్తించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మౌలిక సదుపాయాల లేమి అనేది నాణ్యమైన జీవనశైలిని ప్రజలకు అందివ్వలేదు.
విమానయానరంగంతోపాటు పలు ముఖ్య రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) ను పెద్ద ఎత్తున ఆకట్టుకోవడం కూడా ప్రగతికి తోడ్పడుతుంది. విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడి ‘హాట్ మనీ’ వడ్డీ రేట్ల వ్యత్యాసాలకు స్పందిస్తుంది. దీనిపై చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే అమెరికా వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నపక్షంలో పెట్టుబడుల ప్రవాహంపై ప్రభావం చూపుతుంది. వాణిజ్యరంగం చూస్తే, ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీలో కొన్ని పెంచింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ నేపథ్యంలో, భారత్ తన వాణిజ్య విధానాన్ని చాలా విచక్షణతో ముందుకు కొనసాగించాలి.
భారత్ ప్రస్తుతం 2.87 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. సంవత్సరానికి పది శాతం మేర దీన్ని పెంచితే 2024 సంవత్సరం నాటికి ఐదు ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు మన ఆర్థిక రంగం చేరుకోగలదు. దేశంలో రాష్ట్ర, స్థానిక స్థాయిల్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు, మూలధన నిర్మాణం ద్వారా భారత్ పెట్టుకున్న ఐదు ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోగలుగుతాం.
Comments
Post a Comment