మీడియాపై తీవ్ర స్థాయిలో చర్యలు చేపడుతున్న పాకిస్తాన్

పాకిస్తాన్ ప్రభుత్వానికి, అక్కడి మీడియాకు మధ్య సంబంధాలు లవ్ అండ్ హేట్ పద్ధతిలో ఉంటాయి. అక్కడి ప్రజాస్వామ్య చరిత్రలో చూస్తున్న సత్యం ఇది. స్వేచ్ఛయుతమైన మీడియా, ముఖ్యంగా పత్రికారంగంపై తరచూ అక్కడ నిషేధాలు కొనసాగుతూనే ఉంటాయి. వ్యంగ్యమైన అంశం ఏమిటంటే ఈ నిషేధాలు లేదా పత్రికా స్వేచ్ఛను అణచివేసే ధోరణులు ఏవీ సైనిక పాలనకు మాత్రం వర్తించవు. మీడియాపై విధిస్తున్న అలాంటి కఠిన చర్యల పట్ల పౌర యంత్రాంగం కూడా చాలా ఇబ్బందిపడుతోంది. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మీడియా కవరేజ్‌ను నిషేధించాలంటూ తాజాగా ఆదేశాలు జారీచేశారు. అంతేకాదు గతంలో న్యాయవిచారణ ఎదుర్కొంటున్న వారు, నిర్బంధంలో ఉన్న నేరస్తులైన రాజకీయ నాయకుల ఇంటర్వ్యూలను నిషేధిస్తూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లో మీడియాని నియంత్రణలో పెట్టే ‘ఆదేశాలను ఇస్తూ రెగ్యులేటరీ అథారిటీకి ఆదేశాలు ఇచ్చింది. 

గతంలో, టెలివిజన్ వార్తా చానల్స్ ‘ఛానల్ 24, ‘ఆబ్‌తక్ న్యూస్’, ‘క్యాపిటల్ టివి’ వంటివి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ సంచలన ఇంటర్వ్యూను ప్రసారం చేశాయి. ఆతర్వాత నుంచి ఆ ఛానల్స్ దేశం అంతటా ప్రసారం కావడం మానేశాయి. ఆ ఇంటర్వ్యూలో వీడియో సాక్ష్యం గురించి కూడా మరియం నవాజ్ వెల్లడించింది. తన తండ్రి నవాజ్ షరీఫ్‌ను సంవత్సరం క్రితం అవినీతి ఆరోపణలపై శిక్షించిన జడ్జి బ్లాక్‌మెయిల్‌కి గురయ్యారని అందులో మరియం ఆరోపించారు. కానీ ఆ జడ్జి మాత్రం దానిని ఖండిస్తూ వస్తున్నారు. అప్పుడు పాకిస్తాన్ మీడియా రెగ్యులేటరీ సంస్థ ఆ పత్రికా సమావేశాన్ని ప్రసారం చేసిన టివి ఛానల్స్‌ కు నోటీసులు జారీచేసింది. పాకిస్తాన్ అధికారులు సాంకేతిక కారణాల వల్ల ఈ ఛానల్స్ అందుబాటులో లేవని దీనికి కారణం చెపుతున్నారు. కొందరు దీనిని మీడియాపై సెన్సార్‌షిప్‌గా అభివర్ణించారు. 

పిఇఎంఆర్ఎస్ న్యాయ యంత్రాంగం సాధారణంగా సబ్జక్టు అంశాలపై, కొన్ని సమస్యలపై పరిమితులు విధిస్తుంటుంది తప్ప వ్యక్తుల కవరేజ్‌కు సంబంధించి ఎలాంటి పరిమితులు లేవు. ‘పిఇఎంఆర్ఎఎస్’ న్యాయచట్టాల ప్రకారం లైసెన్సు కొనసాగింపు, ఇతర అంశాలు, ప్రసారం చేసే విషయాలు ఆబ్జక్టివ్ పద్ధతిలో ఉండాలి తప్పతప్పుడు, అశ్లీలమైన సమచారాన్ని ఇస్లామిక్ విలువలకు వ్యతిరేకంగా, రెచ్చగొట్టే విధంగా, హింసను సమర్థించే రీతిలో లేకపోతే న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా , పాక్ సైన్యానికి వ్యతిరేకంగా ఉండకూడదని నిబంధనలు ఉన్నాయి. అలాగే సబ్ జుడిస్ అంశాలను ఈకలు లాగుతూ రాసేందుకు కూడా మీడియాను చట్ట రీత్యా అనుమతించరు. విచారణలో ఉన్న, నేరస్తులైన రాజకీయ నాయకుల మీడియా కవరేజ్ చేయకూడదని పూర్తి స్థాయి నిషిద్ధం పెట్టింది. అలాంటి ఇంటర్వ్యూలు సరైన విశ్లేషణతో, వాస్తవ సమాచారంతో ఉన్నప్పటికీ నిషేధం మాత్రం ఉంటోంది. భావప్రకటనా స్వేచ్చను, ప్రజల సమాచార హక్కు విషయంలో మీడియాకు ఉన్న హక్కు పట్ల పక్షపాత దోరణిని పాక్ చూపుతోంది. 

గత ఏడాది జర్నలిస్టులు, హక్కుల గ్రూపులు చేపట్టిన పలు నిరసనలను అధికారులు చెదరగొట్టారు. ప్రింటు నెట్‌వర్కులు, టెలివిజన్ న్యూసు సర్వీసులు చేసిన విస్తృత కవరేజ్ పాక్ ప్రభుత్వానికి, శక్తివంతమైన పాక్ సైన్యానికి మింగుడు పడలేదు. అంతేకాదు తమ విధానాలను సునిశితంగా విమర్శించే వార్తలను ఆపాలని ఇటీవల సంవత్సరాల్లో మీడియాపై పాక్ సైన్యం ఒత్తిడి తెచ్చింది. పాక్ సైన్యం ఈ ధోరణి తీవ్రంగా విమర్శలపాలైంది కూడా. 

స్వేచ్ఛాయుతమైన మీడియా వాతావరణం పాకిస్తాన్‌లో రోజు రోజుకీ కుచించుకుపోతోంది. మీడియాలో పనిచేసేవారికి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాలలో ఒకటిగా పాక్‌కు పేరు వచ్చింది. వార్తలను కవరేజ్ చేయడానికి వచ్చిన పలు దేశాల జర్నలిస్టులను అదుపులోకి తీసుకోవడం, వారిని తీవ్రంగా కొట్టడం, చంపడం వంటి చర్యలకు పాక్ ప్రభుత్వం లేదా సైన్యం పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి కూడా. అంతేకాదు జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడానికి పాక్ సోషల్ మీడియాను కూడా బాగా వాడుకుంటోంది. ధైర్యంగా సత్యాలు రిపోర్టులు చేసే జర్నలిస్టుల నోరు మూయించడానికి దుష్ప్రచారానికి సైతం పాక్ పాల్పడుతోంది. పాకిస్తాన్‌లో ఇప్పుడు డజన్ల కొద్దీ ఇండిపెండెంట్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. అయితే పాక్ ప్రజలందరి ఉద్దేశాలను ఒకే దిశలో నడిపించే పరిస్థితులు లేవు. అది చాలా కష్టం కూడా. అక్కడి ప్రజలు తమదైన స్వతంత్ర ఆలోచనలతో వ్యవహరిస్తున్నారు తప్ప అధికారిక వివరణలను నమ్మే పరిస్థితుల్లో లేరు. 

వాదప్రతివాదాలు, సాంకేతిక, వ్యవస్థాగతమైన అంశాల పరంగా గత కొన్ని దశాబ్దాల్లో పాకిస్తాన్ పత్రికారంగం ప్రగతి దిశగా సాగుతోందనే అభిప్రాయం ఉంది. సమాచార వ్యవస్థతో పాటు ఉపగ్రహాల క్రమబద్ధీకరణ, వార్తాప్రసారాల సాంకేతిక పరిజ్ఘానం వంటి వాటితో జర్నలిజం 24 గంటల బ్రేకింగ్ న్యూస్ రూపాన్ని సంతరించుకుంది. మీడియాగా పిలవడం మొదలైంది. అదే సమయంలో ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియా సైట్లల్లో కూడా వార్తా అంశాలు, చర్చలకు తెర లేచింది. ఇలాంటి రెండు రకాల ధోరణులు స్వేచ్ఛ సాధనలో ఎంతవరకూ తగును? అనే ప్రశ్న వస్తోంది. బహిరంగంగా ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు అని విజ్ఘతా రేఖను పాటించడంలో నిబద్ధతగా వ్యవహరించేత వరకూ రాజకీయపరంగా జర్నలిస్టు లేదా భావస్వేచ్ఛా ప్రకటన నిజంగా వచ్చినట్టు కాదు.

రచన: డా. స్మిత, ఆఫ్ఘన్-పాక్ వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన