మరోసారి షాక్ ఇచ్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కశ్మీర్ విషయంలో చేసిన వ్యాఖ్యలు ప్రపంచమంతా సంచలనం సృష్టించాయి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో జరిగిన సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ వివాదంలో కలుగజేసుకుని మధ్యవర్తిగా వ్యవహరించమని తమని కోరారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇది కథలో సగం విషయమే. అమెరికా, పాకిస్తాన్ల మధ్య జరిగిన వ్యూహాత్మక చర్చలలో దాగున్న అసలు విషయాన్ని భారత్ జాగ్రత్తగా గమనించాలి. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలకు భిన్నంగా అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో కశ్మీర్ వివాదంలో యుఎస్ కలుగజేసుకునే ప్రసక్తి లేదని, కశ్మీర్ వివాదం భారత, పాకిస్తాన్ల మధ్య నలుగుతున్న ద్వైపాక్షిక అంశమని పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలకు స్పందిస్తూ భారత విదేశాంగ వ్యవహారాల శాఖా మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మాట్లాడుతూ అలాంటి విజ్ఘాపనను ప్రధాని నరేంద్రమోదీ అమెరికన్ అధ్యక్షుడితో చేయలేదని స్పష్టంచేశారు.
అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధాని మోదీ జపాన్‌లోని ఒసాకాలో జరిగిన జి20 శిఖరాగ్ర సదస్సు సమయంలో విడిగా చర్చలు జరిపారు. ఈ సమావేశం మోదీ రెండవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరిగింది. వీరిరువురూ వాషింగ్టన్ డిసిలో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధిసభ సమావేశ సమయంలో తిరిగి సమావేశమయ్యే అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ద్వైపాక్షిక సంభాషణలకు భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. అత్యున్నతస్థాయిలో జరగనున్న ఈ సమావేశ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన వెలువడింది. ఇరుదేశాల నాయకులు పలు సంక్లిష్ట సమస్యలపై చర్చలు జరపాలనుకుంటున్న తరుణంలో ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనించాలి.
భారతదేశానికి ‘నాటో తరహా మిత్రదేశం’ స్టాటస్‌ను జూలై మొదటి వారంలో మంజూరుచేస్తూ ఒక శాసనాన్ని అమెరికా జారీచేసింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతీయ సమస్యపై కూడా రెండు దేశాలు చర్చలు చేస్తున్నాయి. ఇది పక్కనపెడితే, అత్యంత విలువైన రక్షణ కాంట్రాక్టులు కూడా వారి జాబితాలో ఉన్నాయి. గతంలోని ప్రభుత్వాల్లో అధ్యక్షులుగా వ్యవహరించిన వారంతా కశ్మీర్ వివాదం భారత, పాకిస్తాన్ల మధ్య సాగుతున్న ద్వైపాక్షిక అంశంగా గుర్తిస్తూ వచ్చారు. కానీ ట్రంప్ హఠాత్తుగా ఆ దారి నుంచి పక్కకు తప్పుకుని ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనమయ్యాయి. ట్రంప్ ఇలా వ్యవహరించడానికి కారణం ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా నిలిచింది.
ఈ సంఘటన బట్టి సంప్రదాయబద్ధంగా కొనసాగిస్తున్న దౌత్య నిబంధనలు అమెరికా విషయంలో ఎక్కువ రోజులు చెల్లబోవని అర్థమవుతోంది. 1972లో జరిగిన షిమ్లా ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి పాకిస్తాన్‌తో ఉన్న వివాదాలన్నింటినీ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయంలో మూడవ పార్టీ జోక్యం అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టంచేసింది. 1971లో ఆ దేశంతో యుద్ధం జరగడానికి ముందే ఈ నిబంధనను పాకిస్తాన్‌కు స్పష్టంచేసింది. 1971 యుద్ధంలో భారత్ విజేతగా నిలిచిన తర్వాత కూడా ఇదే నిబంధనకు భారత్ కట్టుబడి కొనసాగు తోంది.
అప్పటినుంచి, కశ్మీర్ సమస్య పరిష్కారానికి మూడవ పార్టీ జోక్యాన్ని పాకిస్తాన్ కోరుతూవస్తోంది. దానిని మన దౌత్య విధానంలో భాగంగా భారత్ నిరాకరిస్తూ వస్తోంది. ద్వైపాక్షిక అంశాల విషయంలో మూడవ పార్టీ జోక్యం అనేది ఏవిధంగా అనుమతించే ప్రసక్తి లేదని భారత్ స్పష్టంచేసింది.
అమెరికా, పాకిస్తాన్ల మధ్య అత్యున్నత స్థాయిలో జరుగుతున్న చర్చల వెనుక అసలు ప్రయోజనం వేరే ఉంది. దక్షిణ ఆసియాలో చోటుచేసుకుంటున్న పరిణామాలలో ఇస్లామాబాద్‌కు సరికొత్త పాత్ర ఇవ్వాలన్నదే ఈ రెండు దేశాల చర్చల వెనుక ఉన్న పరమోద్దేశం. అలా ఇండియాతో తిరిగి సమతుల్యం అవాలనేది వీటి ఆలోచన. ఈ విషయంలో అమెరికా ప్రభుత్వ యంత్రాంగం బాగా ముందుకెళ్లడమే కాదు ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగుతున్న పలు బలహీన అంశాల పరిష్కారానికి పాకిస్తాన్‌కు అవకాశం కల్పిస్తూ ఆ దేశంలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న సైనిక ప్రచారం నుంచి గౌరవపూరకంగా తప్పుకోవాలని యుఎస్ యోచిస్తోంది. అమెరికా ‘గివ్ అండ్ టేక్’ విధానాన్ని పాకిస్తాన్ పట్ల వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. దీనికి కారణం ఒక్కటే వాషింగ్టన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి గౌరవంగా తప్పుకునే ప్రయత్నాలలో ఉంది.
కశ్మీర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అసలు విషయం ఏమిటంటే పాకిస్తాన్, అమెరికా దేశాల దౌత్యపరమైన సంభాషణలు కొన్ని నెలలుగా సంక్లిష్టంలో పడ్డాయి. హఫీజ్ సయూద్ లాంటి పాక్ దేశీయ ఉగ్రవాదులపై స్వదేశంలో చర్యలు తీసుకోవడం ద్వారా అమెరికా ఏం కోరుకుంటోందో పాకిస్తాన్ అది చేస్తోందనే అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తోంది. ఇది కూడా దక్షిణ ఆసియా విధానాన్ని తిరిగి సమతుల్యం చేసే లక్ష్యంతో కూడి ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంపూర్ణ మద్దతు పొంది స్వదేశానికి పాక్ ప్రధాని తిరిగి వచ్చిన తర్వాత కొత్త ఆట మొదలవుతుందని భావించవచ్చు.
అమెరికా అధ్యక్షుడి దౌత్య విధాన శైలి అసాధారణంగా ఉంటుంది. అమెరికాకు సంబంధించిన ముఖ్యమైన అంశాలకు అనుగుణంగా ఆయన వివిధ విషయాలపై తన అసాధారణ తీరును ప్రదర్శిస్తుంటారు. కానీ దక్షిణ ఆసియా ‘న్యూక్లియర్ ఫ్లాష్‌పాయింట్’ విషయం మాత్రం అమెరికా యొక్క కొత్త అంతర్జాతీయ కార్యక్రమాల శైలిని తిరగ రాస్తోందన్న సూచనలు అందుతున్నాయి. భారత-అమెరికా సంబంధాల విషయానికి వస్తే, తమ సార్వభౌమాధికారానికి ఎలాంటి హానీ జరగకుండా అతి జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా భారత్ వ్యవహరించాలి. మరో విషయం ఏమిటంటే విదేశీ విధానం పరిణితితో ఉండేలా ఉండాలన్న విషయాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలు గుర్తించాలి. అంతే తప్ప విదేశాంగ విషయాలలో నిర్లక్షమైన ప్రకటనలతో దౌత్యపరంగా వ్యవహరించడం సరికాదని అమెరికా తెలుసుకోవాలి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చి పోయాయి. కానీ కశ్మీర్ విషయంలో భారత్ అనుసరించిన విధానం మాత్రం ఒక్కటే. కశ్మీర్ సమస్య విషయంలో ఇప్పటివరకూ అధికారంలో కొనసాగిన ప్రభుత్వాలన్నీ ఏకమార్గాన్నే అనుసరిస్తూ వచ్చాయి. కశ్మీర్ వివాదంలో మూడవ పార్టీని మధ్యవర్తిగా వ్యవహరించడానికి ఏ ప్రభుత్వం అంగీకరించలేదు. అనుమతించలేదు.

రచన: కల్లోల్ భట్టాఛార్జీ, సీనియర్ కరస్పాండెంట్, ది హిందు
Comments
Post a Comment