ఐసిజెలో భారత దౌత్య విజయం
భారతదేశానికి చెందిన కులభూషణ్ సుధీర్ జాదవ్‌ను 2016, మార్చిలో పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాదచర్యలకు, గూఢచర్యానికి పాల్పడ్డట్టు ఆరోపిస్తూ జాదవ్‌ను పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది. 2017 ఏప్రిల్‌లో పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం జాదవ్‌కు ఉరిశిక్షను విధించింది. 2017, మేలో దీనిపై పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్, ఐసిజె) లో భారత్ కేసు నమోదుచేసింది. కాన్సులార్ సంబంధాలకు సంబంధించిన 1963 వియన్నా ఒప్పందాన్ని పాకిస్తాన్ అతిక్రమించిందని భారత్ పేర్కొంది. వియత్నాం ఒప్పందంలోని 36వ ఆర్టికల్ కింద జాదవ్‌ను నిర్భంధంలోకి తీసుకున్న విషయాన్ని పాకిస్తాన్ వెంటనే భారత్‌కు తెలియజేయాల్సి ఉందని అందులో స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు కుల్‌భూషణ్ హక్కుల గురించి తెలపాలని కోరింది. దీని కింద భారత కాంస్యులర్ అధికారులను కుల్‌భూషణ్‌ని కలవడానికి అనుమతించాలి కూడా.
అయితే ఇండియా కోరిన అంశాలను పాకిస్తాన్ నిర్ద్వందంగా తిరస్కరించింది. ఐసిజిలో కేసు విచారణ జరిగేటప్పుడు రకరకాల చట్టపరమైన వాదనలను వినిపించింది. 2019, జూలై 17వ తేదీన ఐసిజె తన తీర్పును వెలువరించింది. ఈ తీర్పులో అంతర్జాతీయ కోర్టు ఐసిజె భారత దేశీయుడైన కుల్‌భూషణ్ నిర్భంధం, విచారణ విషయాలలో వియత్నాం ఒప్పందంలోని 36వ ప్రకరణలో పేర్కొన్న అంశాలను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అతిక్రమించిందని పేర్కొంది.
ఇది మైలురాయిలాంటి తీర్పు. ఈ కేసుపై తనకు సంపూర్ణ అధికారం ఉందని ఐసిజె నొక్కి చెప్పింది. భారత్, పాకిస్తాన్లు వియత్నాం ఒప్పందంలో సంతకాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఐసిజె పేర్కొంది. ఈ కేసును పక్కదారి పట్టించే పాకిస్తాన్ ప్రయత్నాలను ఐసిజె తీవ్రంగా నిరసించింది. గూఢచర్యానికి పాల్పడ్డ వ్యక్తులపై చర్యలు తీసుకోవడానికి సంబంధించి వియత్నాం ఒప్పందం వర్తించదంటూ పాకిస్తాన్ చేస్తున్న వాదనను ఐసిజె పూర్తిగా వ్యతిరేకించింది. అంతేకాదు ఈ కేసును అర్బిట్రల్ ట్రిబ్యునల్ లేదా కన్సీలియేషన్ కమిషన్‌కు మళ్లించాలన్న పాక్ ప్రయత్నాలను తీవ్రంగా తిరస్కరించింది. ఈ విషయంలో భారత్ ఐసిజెను నేరుగా సంప్రదించే హక్కు ఉందని పేర్కొంది. కుల్‌భూషణ్ జాదవ్‌ను అదుపులోకి తీసుకున్న మూడు వారాల తర్వాత గానీ భారత్‌కు ఆ విషయాన్ని పాకిస్తాన్ తెలియచేయలేదనే విషయాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం గుర్తించింది. అంతేకాదు భారత కాంస్యులర్ అధికారులను కలిసే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. ఈ విషయాలపై వెంటనే స్పందించలేదు కూడా. అలా వియత్నాం ఒప్పందంలోని నిబంధనలను పాకిస్తాన్ అతిక్రమించింది. అంతేకాదు వియత్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36 ఆర్టికల్ కింద షరతులతో తన బాధ్యతలను నిర్వహించడానికి పాక్ చేసిన ప్రయత్నాలను ఐసిజె తిరస్కరించింది. ఇతర అంశాలపై భారత చర్యలను బట్టి ప్రవర్తించాలన్న పాకిస్తాన్ ప్రయత్నాలను కూడా ఐసిజె అంగీకరించలేదు.
ఐసిజె వెలువరించిన తీర్పులోని ముఖ్య అంశం సెక్షన్ ఆరులో ఉంది. వియత్నాం ఒప్పందాన్ని పాకిస్తాన్ అతిక్రమించడానికి సంబంధించి ప్రత్యామ్నాయ చర్యలను ఇందులో సిఫారసుచేసింది. కుల్‌భూషణ్ జాదవ్ హక్కులను కాపాడడం విషయంలో పాక్ వ్యతిరేక వైఖరిని, అలాగే భారత కాంస్యులర్ అధికారులను అనుమతించపోవడం అంతర్జాతీయంగా చాలా తప్పుడు చర్యలని ఐసిజె భావించింది. ఈ రెండు బాధ్యతలను పాకిస్తాన్ వెంటనే అమలుచేయాలని పాకిస్తాన్‌ను ఐసిజె ఆదేశించింది. ఈ కేసులో సరైన చర్యలు అంటే దీనిపై శక్తివంతమైన సమీక్ష నిర్వహించాలి. జాదవ్‌పై వేసిన శిక్ష, నిర్భంధాలను తిరిగి పునరాలోచించాలి. ఈ రెండెంటినీ పాకిస్తాన్ బేషరతుగా చేపట్టాలని అంతర్జాతీయ కోర్టు స్పష్టంచేసింది. సరైన న్యాయం జరిగేందుకు అవసరమైతే పాకిస్తాన్ ప్రత్యేక చట్టాలను కూడా తీసుకురావాలని సిజె ఈ సందర్భంగా స్పష్టంగా పేర్కొంది. అంతవరకూ కుల్‌భూషణ్ ఉరిశిక్షను అమలుచేయకుండా ఆపాలని ఆదేశించింది. ఎందుకంటే కేసుపరంగా శక్తివంతమైన సమీక్ష, పున: పరిశీలించాల్సిన అవసరాన్ని కొట్టివేయలేమని స్పష్టంచేసింది. అలాగే కుల్‌భూషణ్ శిక్షను పున:సమీక్షించాల్సిన అవసరం ఉందని ఐసిజె ఆదేశించింది.
తీర్పు వెలువడిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దానిపై స్పందిస్తూ ‘సత్యం, న్యాయం కొనసాగుతున్నాయి’ అంటూ వ్యాఖ్యానించారు. విస్తృతస్థాయిలో పరిశోధన చేసిన అనంతరం ఐసిజె ఈ తీర్పును వెలువరించడాన్ని ప్రధాని ప్రశంసించారు. ‘కుల్‌భూషణ్ జాదవ్‌కు న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకు ఉంది’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు ‘మా ప్రభుత్వం ప్రతి భారతీయుడి రక్షణ, సంక్షేమాల కోసం అనుక్షణం పనిచేస్తుంద’ని అన్నారు.
పలు కారణాలతో ఐసిజె తీర్పు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో ఐసిజె చట్టం 59వ ప్రకరణ ప్రకారం ఈ కేసులో ఉన్న పార్టీలతో పాటు సంబందిత కేసు విషయం పరంగా కూడా ఎంతో నిబద్ధతతో కట్టుబడి వ్యవహరించడం ఈ తీర్పులో కనిపిస్తుంది. తన ప్రజలకు న్యాయం చేకూర్చడానికి చట్టపరమైన చర్యల పట్ల భారత్‌కు ఉన్న విస్పష్టమైన నమ్మకం కూడా కనిపిస్తుంది. రెండుపక్షాల మధ్య సమస్యలు శాంతియుతంగా పరిష్కరించు కోవాలన్న భారత సుస్థిర విధానం, తపన ఇందులో కనిపిస్తాయి. తీర్పు అమలుచేయడం అనేది అంతర్జాతీయ సహకారానికి ఒక లిట్మస్ పరీక్షగా పేర్కొనాలి. ఇందుకోసం చట్టపాలనతో పాటు బహుపక్ష విధానాన్ని కూడా ఏర్పాటుచేశారు.
విస్తృత పరిధిలో చూస్తే, ఐసిజె తీర్పు 1947 నుంచి భారత వైభవవంతమైన ట్రాక్ రికార్డును ప్రతిఫలిస్తుంది. యుఎన్ ఛార్టర్‌లోని 13.1 ప్రకటరణకు అర్థాన్ని ఇచ్చింది. అంతర్జాతీయచట్టం, చట్ట క్రోడీకరణల ప్రగతిపూర్వకమైన అభివృద్ధికి ఇది పిలుపునిస్తుంది. కాంస్యులర్ సంబంధాలపై వియత్నాం ఒప్పందంలో పేర్కొన్న ప్రకరణలు ఈ కేసుతో ప్రాధాన్యతారీతిలో విస్తరించింది.
రచన: అంబాసిడర్ అశోక్ కుమార్ ముఖర్జీ, ఐక్యరాజ్యసమితి భారత మాజీ శాశ్వత ప్రతినిధి, న్యూ ఢిల్లీలోని వివేకానంద ఇంటర్నేషనల్ షౌండేషన్ గౌరవనీయ సభ్యులు

Comments
Post a Comment