అధిక వృద్ధిపై భరోసా కల్పిస్తున్న భారత ఆర్థిక రంగం

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్) తాజా ప్రపంచ ఆర్థిక చిత్రాన్ని ముందుపెట్టింది. దాని ప్రకారం భారత జాతీయోత్పత్తి పెరుగుదల ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు శాతం పెరగనుందని పేర్కొంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఇది 7.2 శాతం ఉంటుందని కూడా సూచించింది. కేంద్రం 2019 ఆర్థిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు ప్రభుత్వం ఆర్థిక సర్వే నివేదికను విడుదల చేసింది. అందులోని అంశాలపై ఐఎంఎఫ్ పరిశీలించింది. ఆర్థిక సర్వేలో పేర్కొన్న అంశాల కనుగుణంగా అంతర్జాతీయంగా క్లిష్టపరిస్థితుల గాలి వీస్తున్నా, భారత ఆర్థిక ప్రగతి పటిష్టంగా ఉంటుందని పేర్కొంది.

ఐఎంఎఫ్ ఈ ఆర్థిక సంవత్సరం అభివృద్ధి రేటును 7.3 శాతం నుంచి 7 శాతానికి తగ్గించి పేర్కొంది. దీనికి కారణం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధాలతో పాటు విస్తరిస్తున్న రక్షణవాదం, చైనాతో పాటు ఎన్నో దేశాల భారీ ఆర్థికవ్యవస్థల క్షీణత, నేడు అంతర్జాతీయ పెట్టుబడులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో పెరుగుదల వాతావరణం ఒక గొప్ప సానుకూల అంశంగా పేర్కొనాలి. అంతర్జాతీయంగా పరిస్థితులు బలహీనంగా ఉన్న పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ నేపథ్యంలోనే సుస్థిర పెరుగుదలను మనం సాధించడం గొప్ప విజయం. భారత దేశీయ ఆర్థికపరమైన మౌలికాంశాలతో పాటు విస్తృతమైన దేశ ఆర్థిక విధాన సంస్కరణలు, ద్రవ్య క్రమశిక్షణ వంటివి దీనికి కారణం.

గత ఐదు సంవత్సరాల కాలంలో భారత ఆర్థిక ప్రగతి 7.5 శాతం దగ్గరగా ఉంది. దీంతో మనదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా మారుమోగుతోంది. ‘పర్చేసింగ్ పవర్ పారిటీ (పిపిపి) నిబంధన కింద భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ ఉన్న దేశం. అమెరికా, జర్మనీల తర్వాతి స్థానం భారత్‌దే. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ పలు భారీ ఆర్థిక సంస్కరణలను భారీగా చేపట్టింది. వాటిల్లో సరుకులు, సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్, జిఎస్టీ)తో పాటు ‘ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ కోడ్ (ఐబిసి)’ కూడా ఉంది. సహకార సమాఖ్య వ్యవస్థలో జిఎస్టీ ఒక మంచి ప్రయోగంగా పలువురు అభిప్రాయపడ్డారు. దివాలా సమస్యలను పరిష్కరించడంలో ‘వన్ స్టాప్ సొల్యూషన్’ ని ప్రవేశపెట్టింది. దాంతోపాటు వాణిజ్య నిర్వహణ గజిబిజిగా ఉండడం తగ్గుతుంది. ఈ సంస్కరణలు అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రశంసలను అందుకోవడమే కాదు ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలెప్‌మెంట్ బ్యాంక్ వంటి ఎన్నో అంతర్జాతీయ ఆర్థిక సంస్థల మెప్పును కూడా పొందాయి. పలు అంతర్జాతీయ ఆర్థిక అంశాలైన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, ‘ట్రేడింగ్ అక్రాస్ బోర్డర్స్’, గ్లోబల్ ఇన్నోవేషన్ వంటి సూచికలు మొక్కవోని పట్టుదలతో భారత్ అత్యున్నత ఆర్థిక పథం దిశగా పరిగెడుతున్న తీరును విస్తృతంగా తెలుపుతున్నాయి. 

ఈ ఆర్థిక సంస్కరణలను అమలుపరచడంలో భారత్ గట్టిగా కట్టుబడి వ్యవహరిస్తూ సంస్కరణలను వేగవంతం చేస్తోంది. తద్వారా ఈజ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు విదేశీ పెట్టుబడులను సైతం ఆకర్షిస్తోంది. భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ)2018-19 సంవత్సరంలో 64 బిలియన్ల అమెరికన్ డాలర్ల దగ్గర ఆగాయి. గత ఏడాది కన్నా వీటిల్లో ఆరు శాతం పెరుగుదల కనిపించింది. సంవత్సరానికి 300 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర పెట్టుబడులను భారత్ టార్గెట్‌గా పెట్టుకుంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం విమానయాన రంగం, బీమా రంగాలతో పాటు ఎఫ్‌డిఐ, సుదీర్ఘకాలం కార్పొరేట్ బాండ్స్ ను మార్కెట్లు ఆకర్షించడం చూస్తాం. ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించినట్టు 2024 సంవత్సరానికి భారత్ ఐదు ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ పెరుగుదల దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికి భారత ఆర్థికరంగం 2.87 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల దగ్గర నిలిచింది. రానున్న ఐదు సంవత్సరాల కాలంలో ఈ మొత్తాన్ని రెట్టింపు చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం. ఇది సాధించాలంటే పెరుగుదల దగ్గరగా ఎనిమిది శాతం ఉండాలి. నిర్మాణాత్మక సంస్కరణలను ఆపకుండా కొనసాగించి నప్పుడే ఈ పెరుగుదల సాధ్యమవుతుంది. తక్కువ ఖర్చుతో కూడిన పెట్టుబడి అవకాశాలు అందుబాటులో ఉండాలి. అంతేకాదు మౌలికసదుపాయాల కల్పనపై ఎక్కువ ఖర్చు పెట్టడం కూడా ఈ పరిస్థితుల్లో చాలా ముఖ్యం. ఈ పనిని రెండవసారి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే మోదీ ప్రభుత్వం చేపట్టిన బడ్జెట్‌లో ఈ అంశంపై దృష్టిసారించింది. 

‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోయేటందుకు ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా గ్లోబల్ కంపెనీలను ఆహ్వానిస్తోంది. స్వచ్ఛమైన వేలం విధానాన్ని అనుసరించి తద్వారా భారీ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. అలాగే అత్యున్నత సాంకేతిక రంగాల విషయంలో కూడా దీన్ని అనుసరించాలనుకుంటోంది. ఇవి కాకుండా పన్ను లాభాలు వర్తింపచేసే పెట్టుబడులను కూడా అందజేస్తుంది. 


అత్యున్నత ఆర్థికాభివృద్ధిని కొనసాగించేందుకు స్థూల ఆర్థిక స్థిరత్వంపై భారత్ భరోసా కల్పిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతంకు నియంత్రించడం ద్వారా ఇది సాధ్యం చేయాలని చూస్తోంది. జిడిపి నిష్పత్తిననుసరించి నిర్వహణాసాధ్యమైన కరెంట్ అకౌంట్‌ను కొనసాగిస్తుంది. భారత్ సర్దుబాటు వైఖరికి తావివ్వకుండా నిబద్ధతగా ముందుకు సాగడాన్ని ఐఎంఎఫ్ ప్రశంసించింది. ఒక వైపు భారత్‌ని పొగుడుతూనే తన మార్గంలో వెనుకంజ వేయకుండా భారత్ ముందుకు దూసుకుపోవాలనే సూచనను ఐఎంఎఫ్ చేసింది. భారత నిబద్ధతలో ఎంతోమందిని ఆకర్షిస్తున్న అంశం సంస్కరణల ఎజెండా సాధనలో దాని వేగవంతమైన విధానం. చట్టాలను సరళీకృతం చేయడం, మరింత ద్రవ్య సంఘటితత్వానికి పూనుకోవడం, బ్యాంకింగ్, లేబర్ రంగంలో సానుకూల మార్పులను చేపట్టడం, ప్రభుత్వ రంగ రుణాలను తగ్గించడం వంటి చర్యల ద్వారా ఆర్థిక ప్రగతిలోని అడ్డంకులను ఎదుర్కోగలం. అంతర్జాతీయ పెరుగుదలలో ముందుకు వెడుతున్న ప్రధాన దేశాలలో భారత్‌ని ఒకటిగా చేయడంతో పాటు రానున్న సంవత్సరాలలో నూతన ఆవిష్కరణాలలో భారత్ మిగతా దేశాలతో పాటు ముందుంటుంది.



రచన: సత్యజిత్ మొహంతీ, ఐఆర్ఎస్, సీనియర్ ఆర్థిక వ్యాఖ్యాత

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన