బిఆర్ఐసిఎస్ విదేశాంగ మంత్రుల సమావేశం

ప్రపంచ చరిత్ర పునాదులు డైనమిక్ రీతిలో కదులుతున్నాయి. అధికారం పశ్చిమాన్నించి తూర్పుకు, ఉత్తరాన్నించి దక్షిణానికి మారుతోంది. ఇతర నిర్మాణ విధానాల మార్పుకన్నా ఇది ఎక్కువగానే ఉంది. ఇది చారిత్రాత్మకమైన మార్పు. సంపద, ప్రపంచ జనాభా ఒకే చోట కేంద్రీకృతం కావడం ఆధునిక యుగంలో ఇదే తొలిసారి. ఈ పరిణామమే ‘బ్రిక్స్’ తలెత్తడానికి కారణమైంది. ప్రపంచం వేగంగా పరిణామం చెందుతోంది. అలాగే ప్రపంచ శక్తులు కూడా. ప్రస్తుతం ప్రపంచ దృష్టి ‘బ్రిక్స్’ మీదే ఉంది.

బ్రిక్స్ ఇతర గ్రూపుల కన్నా భిన్నమైంది. ఇందులో మాజీ సూపర్ పవర్ ఉంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లాంటి శక్తివంతమైన చోట్ల శక్తిసామర్థ్యాలను, అధికారాన్ని నెలకొల్పేందుకు ఆ సూపర్ పవర్ పనిచేస్తోంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది ఇపుడిప్పుడే పైకి ఎదుగుతున్న అధికారశక్తుల పాత్రపై తన చూపును నిలుపుతోంది. అంతేకాదు సుస్థిరతపాదుకొల్పడంలో ముఖ్యమైన, గ్లోబల్ ఆర్థికవ్యవస్థ సుసంపన్నతలపై కూడా చూపు సారించింది. అంతర్జాతీయ సంబంధాలలో ‘బ్రిక్స్’ ఒక కొత్త కూటమి. జి7 కన్నా కూడా అత్యధిక ప్రాతినిద్యాన్ని కలిగి ఉన్న కూటమి. అలాంటి ‘బ్రిక్స్’ తన రెండవ దశాబ్ద ప్రయాణాన్ని ప్రారంభించింది.

గత వారం రియో డె జనైరోలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశం బహుపక్షవాదానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. అంతర్జాతీయ అంశాలలో ఐక్యరాజ్యసమితి ప్రధానపాత్ర పోషించాలని సమావేశంలో సభ్యులు అభిప్రాయపడ్డారు. కొన్ని పశ్చిమదేశాల్లో గ్లోబల్ పాలనా సంస్థలను లెక్కచేయకుండా చూడడం ఫ్యాషన్ అయింది. అలా కాకుండా యుఎన్, డబ్ల్యుటివొ, ఐఎంఎఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలను తేవాలని ‘బ్రిక్స్’ కోరుకుంటోంది. డబ్ల్యుటివొను ఏ విధంగా పటిష్టం చేయాలనే అంశంపై సభ్యదేశాలు సుదీర్ఘ చర్చలు జరిపాయి కూడా. తన ఆదేశాలను ప్రతి చోట సరిగా అమలు అయ్యేలా ఐక్యరాజ్యసమితి మరింత శక్తివంతంగా, సమర్థవంతంగా పనిచేసేలా చేయడానికి ఏం చేయాలన్న అంశానికి ఈ సమావేశంలో మంత్రులు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

ఐక్యరాజ్యసమితి సారథ్యంలో ఉగ్రవాదంపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఈ సమావేశంలో విదేశాంగ మంత్రులు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో అంతర్జాతీయ న్యాయ నిబంధనల ప్రాతిపదికగా కృషిచేయాలని భావించారు. గ్లోబల్‌గా, ప్రాంతీయంగా ఎదురవుతున్న ఉగ్రవాద సమస్యపై భారత్ గట్టిగా వాదించింది. ఏ దేశం కూడా ఉగ్రవాదం కారణంగా భారత్ అంత తీవ్రంగా దెబ్బతినలేదు. దీనిపై పోరాటం చేసేందుకు న్యూ ఢిల్లీ ఐదు సూత్రాలతో కూడిన అంతర్జాతీయ వ్యూహాన్ని పేర్కొంది. ఇంటిల్జెన్సీ సమాచారాన్ని వేగంగా అందజేసుకోవాలి, ప్రైవేటు రంగ సహకారంతో ఆధునిక సమాచారవ్యవస్థను తప్పుగా ఉపయోగించుకోకుండా నిరోధించడం, సరిహద్దు నియంత్రణను మెరుగుపరచు కునేందుకు సామర్థ్యాన్ని మరింత పెపొందించుకోవడం, ప్రయాణీకుల కదలికల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, గ్లోబల్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కౌంటర్-టెర్రర్ పాయింట్లను ఏర్పాటు చేయడం వంటి అంశాలను పేర్కొంది.

ఉగ్రదాడులపై మంత్రులు ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాదు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, దాని ఫలితాలు చిన్నవిగాని పెద్దవిగానీ వాటిని తప్పకుండా ఖండించాలని కూడా మంత్రులు అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న ‘బ్రిక్స్’ సహకారాన్ని కూడా గుర్తిస్తూ సమావేశంలో మంత్రులు ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని బ్రిక్స్‌ ‘వర్కింగ్ గ్రూప్ ఆన్ కౌంటర్ టెర్రరిజం’ ద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని అంగీకారానికి మంత్రులు వచ్చారు.

కేంద్ర రహదారులు, రవాణా, హైవేస్ సహాయ మంత్రి వి.కె. సింగ్ రియో సమావేశంలో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. ఆ సమావేశంలో ఆర్థిక నేరస్థులు, వారి ఆస్తుల రికవరీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ అందించిన తొమ్మిది అంశాలతో కూడిన ఎజెండాను పేర్కొన్నారు.

మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలలో కొనసాగుతున్న సంఘర్షణలపై కూడా ‘బ్రిక్స్’ విదేశాంగ మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరిణామాలు ప్రాంతీయ, అంతర్జాతీయంగా ప్రభావం చూపుతాయని భావించారు. మంత్రులు ‘ఆఫ్ఘన్ సారథ్యంలోని, ఆఫ్ఘన్ స్వతంత్రంగా శాంతి, సామరస్యాల కోసం ప్రయత్నించాలన్న దాన్ని ‘బ్రిక్స్’ విదేశాంగ మంత్రులు నొక్కిచెప్పడంపై న్యూఢిల్లీ సంతోషించింది. దాన్ని సంపూర్ణంగా ఆహ్వానించింది. అదొక్కటే శాంతి, సుస్థిరతలు, భద్రత, సమైక్యత, దేశాలను కలపుకోవడం వంటి ఉత్తమ లక్ష్యాలను సాధ్యం చేస్తాయని భావించింది. అవి పొరుగుదేశాల మధ్య సామరస్య వాతావరణాన్ని నెలకొల్పుతాయని అభిప్రాయపడింది.

వెనిజులా విషయంలో మాత్రం ‘బ్రిక్స్’ సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. బయట నుంచి జోక్యానికి తన వ్యతిరేకతను రష్యా పునరుద్ఘాటించింది. వెనుజులా ప్రజల బాధలను, ఆక్రందనలను లెక్కచేయమంటూ బ్రెజిల్ బ్రిక్స్ సభ్యులను కోరింది. అయితే వెనుజులాలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం శాంతియుతంగా పరిష్కారం కావాలని సభ్యులు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

కొత్త బ్రెజిలియన్ ప్రెసిడెంట్ ఈ ఏడాది ప్రారంభంలో పదవీపగ్గాలు చేపట్టిన సమయంలో కొన్ని అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. చాలామంది బ్రెజిల్ ప్రెసిడెంట్ బొలొసోనరో అంతర్జాతీయంగా తిరిగి కలుస్తారని, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి దూరమై, పశ్చిమదేశాల విధానాలకు మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి పశ్చిమదేశాల నాయకుల విధానాలకు దగ్గర అవుతారని చాలామంది భావించారు. కానీ ‘బ్రిక్స్’‌కు, దాని ఎజెండాకు బ్రెజిల్ అధ్యక్షుడు మన:స్ఫూర్తిగా మద్దతు పలికారు. బ్రిక్స్ కు సంబంధించి ఎజెండాలో బొలోసోనరో పేర్కొంటున్న కీలక అంశాలు శాంతి, భద్రత, నూతన ఆవిష్కరణలు, ఆర్థికాభివృద్ధి, విద్యుత్‌లు. ‘బ్రిక్స్’ విదేశాంగమంత్రుల తరువాయి సమావేశం న్యూయార్కులో సెప్టెంబరులో జరగబోయే యుఎన్ సర్వప్రతినిధిసభ 74వ సమావేశంతో కూడిఉంది.

రచన: ఆశ్ నరేన్ రాయ్, డైరక్టర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఢిల్లీ

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన