హఫీజ్ సయూద్‌ని తిరిగి బయటకు తెచ్చిన పాకిస్తాన్!
రచన: డా. అశోక్ బెహూరియా, కో-ఆర్డినేటర్, దక్షిణ ఆసియా సెంటర్, ఐడిఎస్ఎ
అరెస్టుకు ముందు ఇచ్చే బెయిల్‌ని నిషేధిత జమ్మత్-ఉద్-దా అవా(జెయుడి) అధిపతి హఫీజ్ ముహమ్మద్ సయూద్‌కి లాహోర్‌లోని యాంటీ-టెర్రరిజం కోర్టు (ఎటిసి) మంజూరుచేసింది. మరో ముగ్గురు కూడా దీన్ని పొందారు. పాకిస్తాన్ ఈ వార్త ఎవ్వరినీ ఆశ్చర్యపరచదు. జెయుడి పాకిస్తాన్ భూభాగంలో తమ శిక్షణాసంస్థల నిర్వహణ, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది. దానిపైనే కోర్టులో కేసు నడుస్తోంది.
తాత్కాలిక బెయిల్‌ని సయూద్‌కి, అతని సోదరుడు హఫీజ్ సయూద్‌కి, లష్కర్-ఇ-తోయిబా (ఎల్ఇటి)కి చెందిన ఇద్దరు సహవ్యవస్థాపకులకు, అమీర్, హమ్జా, మాలిక్ జఫర్లకు ఆగస్టు 31 వరకూ బెయిల్ మంజూరుచేసింది. వీరు ప్రతి ఒక్కరూ 50,000 పికెఆర్‌ను షూరిటీ బాండ్లను వ్యక్తిగత పూచీకత్తుగా ఇవ్వాలని పేర్కొంది.
హమ్జా, జఫర్ జెయుడికి నిధులు సహాయం చేశారు. కొన్ని వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ఏడాది క్రితం (మార్చి, 2018) హమజ్ ఎల్ఇటి నుంచి విడిపోయాడు. తర్వాత సొంతంగా జైష్-ఇ-మన్ఖవా పేరుతో మరో ఉగ్ర సంస్థను ఏర్పాటుచేశాడు.
జూలై మొదటివారంలో పాకిస్తాన్‌కు చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ (సిటిడి) నేషనల్ యాక్షన్ ప్లాన్ (ఎన్ఎపి) కింద నేషనల్ సెక్యూరిటీ కమిటీ (ఎన్ఎస్‌సి) ఆదేశాల ప్రకారం 2019 ఫిబ్రవరిలో ‘జుడ్’ (జెయుడి) నేతలకు వ్యతిరేకంగా 23 ఎఫ్ఐఆర్‌లను లాహోర్, ముల్తాన్, గుజ్రన్‌వాలా, ఫైసలాబాద్, సర్గోధాలలోని సిటిడి పోలీస్ స్టేషన్లలో నమోదు చేసింది. అంతేకాదు 13 మంది జెయుడి ఆఫీసు సభ్యులతోపాటు ఆ సంస్థకు చెందిన నలుగురు ఉన్నతస్థాయి నాయకులపై కూడా కేసులు నమోదుచేసింది. మేలో సయూద్ బావమరిది అబ్దుల్ రెహ్మాన్ మక్కితో పాటు మరో సీనియర్ నాయకుడైన మొహమ్మద్ షాబాజ్లను అదుపులోకి తీసుకున్నారు.
జెయుడిపై , ఆ ఉగ్రసంస్థ చారిటీ విభాగం ఫలాహ్-ఐ-ఇన్సానియాత్ (ఎఫ్ఐఎఫ్)పై
ఎన్ఎస్‌సి నిషేధం విధించిన అనంతరం లోతుకంటే పరిశోధనలు ప్రభుత్వం చేపట్టినట్టు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వచ్చాయి. జెయుడి ఉగ్రవాద సంస్థలకు నిధులందించే కార్యకలాపాలు చేస్తున్న విషయాన్ని సిటిడి గుర్తించింది. స్వచ్ఛంద సంస్థలైన ఎఫ్ఐఎఫ్, ల్-అన్‌ఫాల్ ట్రస్ట్, దావత్-ఉల్-ఇర్షాద్ ట్రస్ట్, మువాజ్ బిన్ జల్బాల్ ట్రస్ట్ వంటి పలు ట్రస్టుల నుంచి పెద్ద ఎత్తున జెయుడి నిధులను సేకరిస్తున్నట్టు వెల్లడైంది. ప్రభుత్వం ఇప్పటికే ఈ సంస్థలను స్వాధీనం చేసుకున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో, జెయుడికి చెందిన ముగ్గురు నాయకులకు లాహోర్ ఎటిసి కోర్టు బెయిల్ ఇవ్వడం చూస్తే ఈ సమస్యపై పాకిస్తాన్ చట్టపాలనా సంస్థలకు ఏపాటి సీరియస్‌నెస్, నిబద్ధత ఉందో స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాల కోసం అది చేస్తున్న నిధుల సమీకరణ సంబంధాలపై జెయుడి నాయకత్వాన్ని విచారించే విషయంలో చట్టబద్ధ సంస్థలు సీరియస్‌గా స్పందించడం లేదు. అంతేకాదు ఈ క్రమంలో పాకిస్తాన్‌లోని వివిధ సంస్థల మధ్య సంబంధాల లేమి వెల్లడవుతోంది సిటిడి, ఎటిసి కోర్టులు దేశంలోని ఉగ్రశక్తులపై విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఈ పరిణామాలను చూస్తాం.
పాకిస్తాన్ దీనిపై తగిన చర్యను తీసుకోలేదు. గతంలో పది నెలల గృహ నిర్భంధం తర్వాత హఫీజ్ సయూద్‌ను 2017 నవంబరులో లాహోర్ కోర్టు విడుదల చేసింది. హఫీస్ సయూద్‌కు ఒక విషయం స్పష్టంగా తెలుసు. ప్రభుత్వ ఏజన్సీలు తనకు, తన సంస్థకు స్వల్పపాటి ఇబ్బందిని, నష్టాన్ని మాత్రమే కలుగజేస్తాయనే స్పష్టమైన అవగాహన అతనికి ఉంది. ఈ చిన్న చర్యను ఉగ్రవాదం పట్ల, తన భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రసంస్థల పట్ల తాను కఠినంగా వ్యవహరించినట్టు మీడియాలో పాక్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది.
తాను తీసుకునే ఆ చిన్న చర్యలు కూడా అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడుల నేపథ్యంలో పాకిస్తాన్ తీసుకున్నవే. గత నెల అమెరికాలోని ఆర్లాండ్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) గ్రే లిస్టు జాబితాలో ఉన్న పాక్‌పై ఆందోళన వ్యక్తంచేసింది. 2019 మే నాటికి పూర్తిచేయాల్సిన అంశాల పరంగా పాక్ వైఫల్యాన్ని ఎత్తి చూపింది. అంతేకాదు, ఈ సందర్భంగా పాక్ జనవరి డెడ్‌లైన్‌ను సైతం దాటిపోవడాన్ని ఎఫ్ఎటిఎఫ్ ప్రస్తావించింది.
అక్టోబర్, 2019 నాటికి పాకిస్తాన్ తను అంగీకరించిన చర్యలను వేగవంతంగా అమలు పరచాలని ఎఫ్ఎటిఎఫ్ సూచించింది. ఆ విషయంలో కూడా పాక్ వైఫల్యం చెందిన పక్షంలో సరైన ప్రగతిని చూపనందుకు పాక్‌పై ఎఫ్ఎటిఎఫ్ ఎలాంటి చర్య తీసుకోవాలో నిర్ణయిస్తుంది అని ఆ సంస్థ పేర్కొంది. దీనివల్ల పాకిస్తాన్ బ్లాక్-లిస్టింగ్ జాబితాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
అందుకే ఉగ్రవాదసంస్థలు, ఉగ్రనిధుల సమీకరణ వంటి విషయాల్లో శక్తివంతంగా పాక్ వ్యవహరించాలి. వాటిపై ఆంక్షలు విధించాలి. అంతేకాదు వాటిపై సమర్థవంతమైన విచారణ, న్యాయస్థానం స్పందించడం వంటి వాటిని మరింత బలోపేతం చేస్తూ పాక్ ప్రభుత్వం స్పందించాలి. ఇలాంటి కేసులను విచారించేవారికి, న్యాయవ్యవస్థకు పాక్ ప్రభుత్వం మద్దతుగా నిలవాలి.

అయితే సయూద్, ఇతరుల విషయంలో కఠిన విచారణ జరగలేదు. ఇది సయూద్ న్యాయవాది సిటిడిలో దాఖలు చేసిన పిటిషన్ ద్వారా మనకు తెలుస్తుంది. సిటిడి సయూద్‌ని, అతని సిబ్బందిని ఎల్ఇటి సభ్యులుగా తప్పుగా చూపిందని సయూద్ లాయర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎల్ఇటిని 2002లోనే నిషేధించారన్నారు. అయితే లాహోర్ హైకోర్టు 2003లో వెలువరించిన ప్రకారం డిసెంబరు, 2001లో హఫీజ్ వెళ్లిపోయారన్నారు!
ఒకవైపు పాకిస్తాన్‌పై ఎఫ్ఎటిఎఫ్ ఒత్తిడి పెరుగుతుంటే, వచ్చే వారాంతానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా వెళ్లుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడ్డం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తమ భూభాగం నుంచి ఉగ్రవాదశక్తులు పుట్టుకొస్తున్నా యన్న అమెరికా ఆందోళనలపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశంతో సంభాషించడానికి సిద్ధంగా ఉన్నారన్న సూచనను ఇది పంపుతోంది.
పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఉగ్రసంస్థలైన ఎల్ఇటి వంటి వాటికి ఉన్న లోతైన నిర్మాణాత్మక సంబంధాలను పాక్ ప్రభుత్వం ముగింపు పలికితే అలాంటివి హఫీజ్ సయూద్ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాదులపై కఠినంగా చర్యలు తీసుకోవడానికి బాగా సహకరిస్తాయి.

Comments
Post a Comment