భారత రెండవ చంద్రయానం అంతరిక్షంలోకి
భారత అంతరిక్ష కార్యక్రమాల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన, సంక్లిష్టమైన ప్రయోగం సోమవారం మధ్యాహ్నం అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకువెళ్లింది. భారత దేశ శక్తివంతమైన రాకెట్ జిఎస్ఎల్‌వి ఎంకె-3 చంద్రయాన్-2ని అంతరిక్షంలోకి విజయవంతంగా తీసుకువెళ్లింది. ఇది చంద్రగ్రహంపై భారత రెండవ మిషన్. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న భారత అంతరిక్ష స్పేస్ పోర్ట్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 నిమిషాలకు నింగికి ఎగిసింది. పదిహేడు నిమిషాల అనంతరం ముందరే నిర్ణయించిన భూగ్రహం చుట్టూ ఉన్న కక్ష్యలోకి చంద్రయాన్-2 వెళ్లేలా అనుసంధానించారు.
నిజానికి చంద్రయాన్-2 జూలై 15 వతేదీన పంపడానికి ప్రయత్నించారు కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల దాన్ని ఆపేసారు. ఆ సాంకేతిక లోపాన్ని సరైన సమయంలో గుర్తించి వెంటనే ఆ పొరపాటును స్వల్పవ్యవధిలోనే సరిచేసి చంద్రయాన్-2 నింగికి ఎగసేలా మన అంతరిక్ష శాస్త్రవేత్తలు చేశారు. అలా చంద్రయాన్-2 అంతరిక్ష్యంలోకి అనుకున్న సమయానికి వెళ్లేలా చేసిన క్రెడిట్ ఇస్రో శాస్త్రవేత్తలకే దక్కుతుంది.
ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. ఈ మిషన్‌లో ప్రయోగం కేవలం తొలి అడుగు మాత్రమే. ఇప్పటివరకూ ఇస్రో చేపట్టిన వాటిల్లో ఇది ఎంతో సంక్లిష్టమైన ప్రయోగం. చంద్రయాన్-2 జాబిల్లిని చేరి అక్కడ లాండ్ కావడానికి 48 రోజులు పడుతుంది. అంటే సెప్టెంబరు 7వ తేదీన చంద్రయాన్-2 జాబిల్లి మీద దిగుతుందనమాట.
భారత్ తొలిసారి చంద్రయాన్-1 మిషన్‌తో పోలిస్తే రెండవ మిషన్ చాలా క్లిష్టమైంది. మొదటిది కేవలం ఆర్బిటల్ మిషన్ మాత్రమే. రెండవ మిషన్‌లో ముఖ్యమైన మూడు భాగాలు ఉంటాయి. ఒకటి ఆర్బిటర్, రెండవది లాండర్, మూడవది రోవర్. ఇవి సంయుక్తంగా చంద్రుని ఉపరితల పరిస్థితులను పరిశోధన చేస్తాయి. భారత అంతరిక్ష కార్యక్రమాలకు తండ్రిగా భావించే లబ్దప్రతిష్టులు విక్రమ్ సారాబాయ్ పట్ల గౌరవసూచకంగా చంద్రయాన్-2 లాండర్‌కి ‘విక్రమ్’ అని పేరు పెట్టారు. రోవర్‌కి ‘ప్రగ్యాన్’ (అంటే సంస్కృత భాషలో ‘విజ్‌డం’ అని అర్థం) అని పేరు పెట్టారు. వందకిలోమీటర్ల ఎత్తు నుంచి ఆర్బిటర్ మ్యాపింగ్ చేస్తుంది. లాండర్ చంద్రయాన్-2ని జాబిల్లిపై మృదువుగా దిగేలా చేస్తుంది. అక్కడ నుంచి లాండర్ చంద్రుని ఉపరితలంపై పరిశోధనలను చేసేందుకు రోవర్‌ని బయటకు పంపుతుంది.
ఒక ఒప్పంద ప్రకారం, రష్యా మనకు లాండర్‌ని అందివ్వాలి. కానీ రష్యా ఈ విషయంలో వెనక్కి తగ్గడంతో, ఇస్రోనే దీన్ని రూపొందించి నిర్మించాల్సి వచ్చింది. అలా చంద్రయాన్-2 పూర్తిగా దేశీయ మిషన్.
చంద్రయాన్-2 మొత్తం 13 భారత పేలోడ్లను తీసుకెడుతోంది. వాటిల్లో ఎనిమిది ఆర్బిటర్‌లోకి, మూడు లాండర్ పైకి, రెండు రోవర్ సంబంధించి ఉన్నాయి. ఇవి చంద్రగ్రహంపై సమగ్ర పరిశీలనలు చేస్తాయి. అంతేకాదు ‘నాసా’కు చెందిన లేజర్ రిట్రో-రిఫ్లక్టర్‌ని కూడా లాండర్ తీసుకెడుతోంది. ఈ మిషన్ ప్రాథమిక లక్ష్యం చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ లాండింగ్ చేయడంతో పాటు చంద్రుని ఉపరితలంపై రొబోటిక్ రోవర్ అధ్యయనాలు చేస్తుంది.
చంద్రయాన్-2 లాండర్ దిగే ప్రదేశం దక్షిణ ధృవం నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది బాగా ఎత్తులో రెండు క్రేటర్స్ మధ్యలో ఉంది. ఇది భూమధ్యరేఖకు చాలా దూరంలో ఉంది. ఈ ప్రాంతంపై ఇప్పటివరకూ ఏ దేశ అంతరిక్ష నౌకా దిగలేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. శాస్త్రవేత్తలను కూడా చంద్రుని పోలార్ రిజీయన్స్ అర్థంకాకుండా ఎంతో సంక్లిష్టంగా ఉంటాయి. అక్కడ శాశ్వతంగా నీడలతో కప్పబడిన ఉపరితలంపై నీటితో గడ్డకట్టుకుపోయి ఐస్ బాగా ఉంటుంది.
సోమవారం చంద్రయాన్-2 విజయవంతంగా ప్రయోగించారు. అది బాగా పొడిగించబడినట్టు ఉన్న భూకక్ష్యలోకి ప్రవేశించి, అక్కడి నుంచి పలు కక్ష్యలను దాటుకుంటూ మెల్లగా జాబిల్లి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి ప్రవేశిస్తుంది. అలా మెల్లగా వంద కిలోమీటర్ల ఎత్తులో చంద్రుని చుట్టూతా ఉన్న సర్క్యులర్ పోలార్ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. లాండర్-రోవర్ కంబైన్‌ని విడుదల చేయడానికి ముందు పలు కక్ష్యలను ఇది దాటుకుంటూ చంద్రుని కక్ష్యలో 27 రోజులు ఉంటుంది. అది 30 కిలోమీటర్ల కన్నా ఎత్తులో ఉన్న చంద్రుని ఉపరితలం మీద మెల్లగా దిగుతుంది.
సెప్టెంబరు మొదటి వారంలో లాండర్ మరికొంత కిందికి దిగి చంద్రుని ఉపరితలంపై రిట్రోరాకెట్ల సహాయంతో మెల్లగా దిగుతుంది. దీనికి మొత్తం 15 నిమిషాల సమయం పడుతుంది. ఆ సమయం ఈ మిషన్‌లో ఎంతో భయోద్వేగాలకు గురిచేసే ముఖ్యమైన క్షణాలుగా ఇస్రో ఛైర్మన్ కె.శివన్ అభివర్ణించారు.
అంతా సవ్యంగా జరిగితే, అమెరికా, రష్యా, చైనాల తర్వాత చంద్రునిపై క్రాఫ్ట్ ను విజయవంతంగా దింపిన నాల్గవ దేశంగా భారత్ నిలుస్తుంది.
చంద్రుని ఉపరితలంపై దిగిన తర్వాత లాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై పలు పరిశోధనలను నిర్వహిస్తుంది. అక్కడ ఒక లూనార్ డే అంటే మన భూమిపై 14 రోజులతో సమానం. అన్ని రోజులు రోవర్ తన పరిశోధనలను అక్కడ కొనసాగిస్తుంది. ఈ మిషన్‌లోని ఆర్బిటర్ తన విధులను ఒక సంవత్సరం పాటు కొనసాగిస్తుంది.
మన లూనార్ లాండింగ్ మిషన్స్ సక్సెస్ రేటు 50 శాతం కన్నా తక్కువ ఉందని కానీ, ఇస్రో ట్రాక్ రికార్డు చూస్తే, మరీ ముఖ్యంగా 2008లో చేపట్టిన చంద్రయాన్-1, 2013లో చేపట్టిన మార్స్ ఆర్బిటర్ మిషన్, చంద్రయాన్-2 సక్సెస్ ఇవన్నీ భారత అంతరిక్ష ప్రగతిలో మరో కలికితురాయిగా నిలుస్తాయి.

రచన: బిమన్ బసు, సీనియర్ సైన్స్ రైటర్
Comments
Post a Comment