జపాన్-దక్షిణ కొరియాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు

ముఖ్యమైన అతి పెద్ద తూర్పు ఆసియా ఆర్థిక వ్యవస్థలైన జపాన్, దక్షిణ కొరియా దేశాలు వాణిజ్యపరమైన ఒత్తిడులతో మల్లగుల్లాలు పడుతున్నాయి. తీవ్ర ఉద్రిక్తతలతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దక్షిణ కొరియాపై నియంత్రణతో కూడిన వాణిజ్య చర్యలను జపాన్ విధించింది. మూడు రసాయనాల ఎగుమతులపై ఉచ్చుబిగించింది. వాటిల్లో భారీ సాంకేతిక పరిశ్రమల్లో వాడే హైడ్రోజన్ ఫ్లోరైడ్ గ్యాస్, ఫ్లోరినేటెడ్ పొలిమైడ్, ఫ్ రెసిస్టెంట్‌లు ఉన్నాయి. ఈ చర్యలు చేపట్టడానికి జాతి భద్రతను కారణంగా జపాన్ చూపుతోంది. 


ఈ రసాయనాల వినియోగంపై జపాన్ తన ఆందోళనను వివరించింది. వీటిలో సైనిక అవసరాలకు ఉపయోగపడే అప్లికేషన్లు కూడా ఉన్నాయని అది చెప్తోంది. యుఎన్ఎస్‌సి షరతుల అమలు విషయంలో దక్షిణ కొరియా పంథాపై టోక్యో ఆందోళనను వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. అలాగే సున్నితమైన మెటీరియల్‌కు సంబంధించి అంతర్జాతీయ ఎగుమతి నియంత్రణ పాలన వర్తింపుపై కూడా ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఇంకా, తన ప్రిఫెరెన్షియల్ ‘వైట్ లిస్ట్’ నుంచి దక్షిణ కొరియాను జపాన్ తొలిగించింది. ఈ జాబితాలో నమ్మదగ్గ వాణిజ్య భాగస్వామ్య దేశాలు మాత్రమే ఉంటాయి. దాదాపు 1,100 ముఖ్యమైన ఐటమ్స్‌ పై కఠినమైన ఎగుమతి స్ర్కీనింగ్‌ను జపాన్ అనుసరిస్తోంది. కఠిన వాణిజ్య నిబంధనలు వరుసగా కొనసాగితే ఆ పరిస్థితి గ్లోబల్ పంపిణీ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది. 


ప్రముఖ కొరియా కంపెనీలు చాలా రసాయనాలకు సంబంధించి జపాన్‌పై ఆధారపడి ఉన్నాయి. కారణం వీటిని పంపిణీ చేసే కీలక దేశం జపానే. చిప్స్, అత్యాధునిక స్క్రీన్స్ ఉత్పత్తిలో ఈ రసాయనాలు చాలా ముఖ్యమైనవి. ప్రస్తుతం కొనసాగుతున్న పరిమితుల నేపథ్యంలో, జపాన్ ఎగుమతిదారులు వాటిని దక్షిణ కొరియాకు పంపడానికి ముందర జపాన్ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. వీటికి అనుమతి రావడానికి తొంభై రోజులు పడుతుంది. ప్రస్తుతం దక్షిణకొరియా స్టాక్‌లో ఉన్న రసాయనాలతో ఉత్పత్తి కొనసాగిస్తోంది. ఇప్పుడు కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు పరిష్కారం కాకుండా ఇలాగే కొననసాగిన పక్షంలో స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిపై దీని ప్రభావం తీవ్రంగా పడుతుంది. అదే సమయంలో దక్షిణ కొరియా కూడా జపాన్‌ని తమ ‘వైట్ లిస్ట్’ లోని ఫాస్ట్ ట్రాక్ ట్రేడ్ స్టాటస్ నుంచి తప్పించింది. టోక్యోను కొత్తగా రూపొందించిన ట్రేడ్ కేటగిరి దేశాల సరసన ఉంచుతుంది. ఇవి అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఎగుమతి నియంత్రణా వ్యవస్థను నడపవలేవు. అదనంగా సియోల్ మరో మార్గం చేపట్టింది. తన కేసును డబ్ల్యుటివొ జనరల్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. తద్వారా అంతర్జాతీయ మద్దతును పొందవచ్చని ఆశిస్తోంది. 

వాణిజ్య ఉద్రిక్తతలు పరిష్కరించబడకుండా ఇలాగే కొనసాగిన పక్షంలో జపాన్ ఎగుమతి నియంత్రణలు వ్యూహాత్మక వస్తువుల పంపిణీని దెబ్బతీస్తుంది. ఇది మధ్యంతర సరుకులపై అనుహ్యమైన ప్రభావాన్ని తీసుకురావడంతో పాటు అధునాతన పరిశ్రమల్లో అనూహ్య పరిణామాలకు దారి తీస్తుంది. దక్షిణ కొరియా ఆర్థిక ప్రగతి కూడా ఈ ఏడాది క్షీణించింది. గతంలో ఉన్న 2.6-2.7 శాతంతో పోలిస్తే 2.4-2.5 శాతానికి తగ్గింది. జపాన్ విధించిన ఎగుమతుల నియంత్రణను తట్టుకునేందుకుగాను స్థానిక పరిశ్రమలకు 1.6 బిలియన్ అమెరికన్ డాలర్ల సహాయాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వం అమలుచేయాలని ఆలోచించింది. మరోవైపు అక్కడి కంపెనీలు కూడా తమ పంపిణీదారుల చైన్ నిరాటంకంగా కొనసాగేందుకు చైనాలోని వైవిధ్యమైన పంపిణీదారులకు తమ సేవలను విస్తరించే ప్రణాళికలు వేస్తున్నాయి.


తమ ఆర్థిక వ్యవస్థను జపాన్ తక్కువచేసి చూస్తోందని కొరియా వాదిస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలలో విస్తృతమైన చారిత్రక అంశాలను లేవనెత్తలేకుండా టోక్యో వ్యవహారశైలి ఈ ఉంటోందని విమర్శిస్తోంది. జపాన్ చేపట్టిన పరిమితులతో కూడిన చర్యలు రాజకీయ దురుద్దేశంతో చేపట్టినవని దక్షిణ కొరియా అభిప్రాయపడింది. 2018లో దక్షిణ కొరియా సుప్రీం కోర్టు జపాన్ మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్‌ని వలస పాలనలో ఆ కంపెనీ చేపట్టిన బలవంతపు లేబర్ ఆరోపణల మీద పరిహారంగా పెద్ద ఎత్తున నష్టపరిహారం జపాన్ చెల్లించాలని ఆదేశించింది. అందులో భాగంగా ఆ కంపెనీ ఆస్తులను జప్తు చేయడం జరిగింది. దీనికి తోడు, మరో రెండు జపాన్ కంపెనీలు నిప్పన్ స్టీల్ కార్పొరేషన్, నాచి-ఫుజికొషి కార్పొరేషన్ల ఆస్తులను కూడా దక్షిణ కొరియాలో జప్తు చేశారు. బలవంతపు లేబర్ నేరారోపణలనుద్దేశించి కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొరియా ప్రభుత్వం అనుసరించింది. మరోవైపు జపాన్ ప్రభుత్వం 1965 ఒప్పందం కింద అవన్నీ కూడా పరిష్కారమయ్యాయని అంటోంది. అంతేకాదు రెండు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితిలోనే కొనసాగుతున్నాయని జపాన్ అంటోంది. 


ఆర్థిక వ్యవస్థను దాటి వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయి. దీంతో తూర్పు ఆసియాలో అమెరికాకు సంప్రదాయబద్ధమైన మిత్రదేశాలైన ఈ రెండింటికీ మధ్య భద్రతాపరమైన అంశాలు దెబ్బతింటున్నాయి. జపాన్‌తో చేసుకున్న జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంటును దక్షిణ కొరియా సస్పెండ్ చేసింది. దీనికి కారణం నిఘా సమాచారాన్ని టోక్యోతో పంచుకోవడం చాలా సంక్లిష్టమైన విషయమని సియోల్ భావించడమే. సియోల్ సెన్సిటివ్ మెటీరియల్‌ను ఎలా డీల్ చేస్తుందో అన్న అనుమానాలను టోక్యో వ్యక్తం చేసింది. ఇది ఒక కారణం. ఈ ఒప్పంద ఉద్దేశం ఏమిటంటే అమెరికా మిత్రదేశాలైన జపాన్, దక్షిణ కొరియాల మధ్య సమాచారం వేగవంతంగా అందిచుకోవడం, అలాగే భద్రతా పరమైన సహకారాన్ని అందించుకోవడం ద్వారా ఉత్తరకొరియా అణ్వాయుధ ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చన్న ఉద్దేశంతోనే. ఈ ఒప్పందానికి ముందు జపాన్, దక్షిణ కొరియాలు అమెరికా ద్వారా నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేవి. 


రెండు వైపులా ముందుకు సాగే విషయంలో రాజకీయంగా చొరవచూపాలి. రెండు దేశాల మధ్య నలుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను పరిష్కరించుకోవాలి. విశ్వాసలేమిని పరిష్కరించుకోవాలి. ఎందుకంటే జపాన్-దక్షిణ కొరియా వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం ప్రస్తుతం మంచిది కాదు. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం గురించి తెలిసిందే. ఇది ఎగుమతి ఆధారంగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థను ఇఫ్పటికే దెబ్బతీయడం ప్రారంభించింది. 


జపాన్, దక్షిణ కొరియాలు రెండు భారతదేశానికి ఎంతో ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు. అంతేకాదు భారత ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో కీలక పాత్ర పోషించే దేశాలు కూడా. స్వేచ్ఛా వాణిజ్యాన్ని, బహిరంగ మార్కెట్లకు ద్వారాలు తెరవాలంటే వాణిజ్య విభేదాలను తొలుత అదుపులో పెట్టుకోవాలి. స్నేహపూర్వకసంబంధాలతో సమస్యలను పరిష్కరించుకోవాలి.




రచన: డా. తిత్లీ బసు, తూర్పు, ఆగ్నేయాసియా వ్యూహాత్మక విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన