నూతన భారతానికి రాష్ట్రపతి పిలుపు

భారత గౌరవనీయ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ దేశ 73వ స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వతంత్ర దేశంగా భారత్ నిలబడి ఇప్పటికి 72 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఇంకొక ముఖ్య అంశం ఏమిటంటే, ప్రత్యేక సందర్భంలో 73వ స్వాతంత్ర దినోత్సవాన్ని చేసుకోవడం మరో విశేషం. ఇప్పటి నుంచి కొన్ని వారాల్లో, అంటే అక్టోబర్ 2న భారత్ జాతిపిత మహాత్మాగాంధీ 150వ జన్మదినోత్సవాలను జరుపుకుంటున్నాం. భారతదేశ స్వాతంత్ర్య సాధనలో ఆయన ఒక వెలుగుగా మార్గనిర్దేశం చేసిన మహాత్ముడు. దేశంలోని అన్ని రకాల అసమానతలను పోగొట్టి సంస్కరించే దిశగా భారత్ నిరంతరాయంగా కృషిచేస్తూనే ఉంది.

మహాత్మాగాంధీ జీవించిన, పనిచేసిన సమయం, సమకాలీన భారతం రెండూ పరస్పర భిన్నమైనవని రాష్ట్రపతి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఈ రోజుకి కూడా గాంధీజీ చెప్పిన అంశాలు అనుసరణీయాలుగా, సమకాలీనమైనవిగా నిలిచిపోయాయి అని రాష్ట్రపతి అన్నారు. పేదలైన ప్రజలకు, కుటుంబాలకు సంక్షేమ కార్యక్రమాలను రూపొందించేటప్పుడు, సూర్యరశ్మి ద్వారా విద్యుత్‌ను రిన్యువబుల్ ఎనర్జీగా (పునరుత్పత్తి శక్తిగా) చేసేటప్పుడు గాంధీ తత్వాన్ని చేతల్లో మనం ఆవిష్కరించాలి.

అంతేకాదు ఈ ఏడాది భారత ప్రముఖమైన, ప్రభావితమైన వ్యక్తి గురునానక్ దేవ్‌జీ 550వ జన్మదిన వార్షికోత్సవం జరుపుకుంటున్నామని శ్రీ కోవింద్ పేర్కొన్నారు. గురునానక్ దేవ్‌జీ సిక్కిజం స్థాపకులు. ఆయన పట్ల సిక్కు సోదర, సోదరీమణులకే కాదు యావత్ భారత ప్రజలకు అపూర్వ గౌరవం, భక్తి ప్రపత్తులు ఉన్నాయి. వీళ్లు భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచమంతటా మిలియన్ల సంఖ్యలో ఉన్నారు.

ఈ వేసవి ప్రారంభంలో భారత ప్రజలు 17వ సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్నారు. భారత ఎన్నికల ప్రక్రియ మానవ చరిత్రలోనే అతి పెద్ద ప్రజాస్వామిక కార్యక్రమం . దీనికి భారత ప్రజల ఓటర్లందరికీ తన అభినందనలను తెలిపారు. భారత ప్రజలు భారీ స్థాయిలో పోలింగ్ బూతులకు తరలిరావడాన్ని, ఉత్సాహంగా పాల్గొనడాన్ని రాష్ట్రపతి కోవింద్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తమ ఎన్నికల హక్కును ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా ప్రదర్శించడమే కాకుండా ఓటర్లుగా తమ బాధ్యతను నిర్వర్తించారన్నారు.

రాష్ట్రం, ప్రభుత్వం దీన్ని సులభతరం అయ్యేలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ముఖ్య సంస్థలకు, విధానకర్తలకు ప్రజలు పంపిన సందేశాలు, వారి ఆలోచనలు, అభిలాషలు పరిశీలించడం, ప్రశంసించడంలో వెంటనే స్పందించాలి. భారత రాష్ట్రపతిగా దేశమంతటా పర్యటించాల్సిన అవసరం,హక్కు తనకు ఉన్నాయని రాష్ట్రపతి శ్రీ కోవింద్ భావించారు. వివిధ రాష్ట్రాలకు, ప్రాంతాలకు వెళ్లి అన్ని వర్గాల భారత ప్రజలను కలవాల్సిన అవసరం ఉందన్నారు. తమ అభిరుచులు, అలవాట్లలో భారతీయులు ఎంతో వైవిధ్యమైన వారని కోవింద్ అభిప్రాయపడ్డారు. కానీ భారతీయుల కలలు మాత్రం ఒకటేనని అన్నారు. 1947 సంవత్సరానికి ముందు భారత్‌కు స్వాతంత్ర్య సాధనే కలగా ఉంది. కానీ ఈ రోజు అభివృద్ధి పెంపుదల దిశగా తన లక్ష్యాలతో భారత్ ముందుకు దూసుకుపోతోంది. శక్తివంతమైన, పారదర్శకమైన ప్రభుత్వ పాలనకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రజల జీవితాల్లో ప్రత్యేక ముద్రవేయాలని కృషిచేస్తోంది.

భారత రాష్ట్రపతి కోవింద్ మాట్లాడుతూ అవకాశాలు, సామర్థ్యాలు ప్రధానంగా 1.3 మిలియన్ల భారతీయ యువత యొక్క నైపుణ్యం, ప్రతిభ, నూతన ఆవిష్కరణలు, సృజన, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లలో దాగున్నాయన్నారు. ఇవి కొత్త విషయాలేమీ కావు. ఇవి భారతదేశాన్ని ఎప్పటి నుంచో ముందుకు పోయేట్టు చేస్తున్నాయి. మన వేల సంవత్సరాల నాగరికతను మరింత వృద్ధిచేస్తున్నాయి. భారత ప్రజలు పలు కష్టాలు, సవాళ్లను ఎదుర్కొన్న సుదీర్ఘ చరిత్ర కూడా ఉంది. అలాంటి సందర్భాలలో సైతం మన సమాజం స్థిరంగా ఉంది. సాధారణ ప్రజలు సైతం అసాధారణ ధైర్య సాహసాలను చూపారు. ఎంతోమంది బలమైన వ్యక్తులు జీవించడానికి, తమ ప్రయత్నాలు కొనసాగించడానికి ఎంతో నూతనోత్సాహాన్ని పొందారు. ప్రభుత్వం అనుకూల వాతావరణం ఏర్పాటైంది. భారత్ ఏం సాధిస్తుంది అనేదానిని ఊహించుకోవచ్చు.

దౌత్య ప్రయత్నాలలో సహకారాన్ని అనుసరిస్తున్నాం. మన అనుభవాలు, బలాలను ప్రతి ఖండంలోని దేశాలతో పంచుకుంటాం. భారత విలక్షణత, మ్యాజిక్‌ల విషయంలో పూర్తి స్పృహ, చైతన్యంతో ఉండాలనే అంశాన్ని శ్రీ కోవింద్ భారతీయుల్లో నింపారు.

భారత్ యువ దేశం. యువత నిర్దేశంలో నడుస్తున్న దేశం, సమాజాలను ఇక్కడ చూస్తున్నాం. అలా దేశాన్ని రూపుదిద్దుతున్నాం. మన యువత శక్తిసామర్థ్యాలు వివిధ మార్గాలలో కొనసాగించాలి. క్రీడల నుంచి సైన్స సామర్థ్యాల శోధన వైపుగా, అలాగే స్కాలర్‌షిప్పుల నుంచి సాఫ్ట్ స్కిల్స్ వరకూ వారిలోని ప్రతిభను వివిధ మార్గాలలో ఉపయోగించుకునేలా కృషిచేస్తున్నాం. మన యువతకు మనం ఇచ్చే గొప్ప బహుమతి ఏమిటంటే రానున్న తరాలలో, వ్యవస్థలో ఉత్సుకత అనే సంస్కృతిని, మరీ ముఖ్యంగా తరగతి గదుల్లో పెంపొందించడాన్ని ప్రోత్సహించాలి. పిల్లల మాటలను మనం వినాలి. వారి ద్వారానే నూతన భవిష్యత్ మన ముందు ఆవిష్కృతమవుతుంది.

సుబ్రమణ్య భారతి కవితతో తన ప్రసంగాన్ని రాష్ట్రపతి ముగించారు. సుబ్రహణ్య భారతి కవితలో ఇలా చెప్తారు...

‘‘మనం గ్రంధాలను, సైన్సును తెలుసుకోవాలి

స్వర్గాలు, సముద్రాలను రెండింటినీ అన్వేషించాలి

చంద్రునిలోని రహస్యాలను ఛేదించాలి

మన వీధులను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ’’ అంటారు.

ఈ ఆదర్శాలను నేర్చుకోవాలి. మంచిగా అభివృద్ధి చెందడానికి వీటిని వినాలి. ఉత్సుకత, సౌభ్రాతృత్వాలు ఎప్పుడూ మనతో ఉండాలి. అవి మనల్ని ఎల్లవేళలా అనుగ్రహిస్తాయి. మన దేశాన్ని అనుగ్రహిస్తాయి.
రచన: ప్రొఫెసర్ శివాజీ సర్కార్, రాజకీయ వ్యాఖ్యాత

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన