భారత బాల్టిక్స్ విస్తరణ

భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఎస్టోనియా, లాట్వియా, లిధుయేనియా దేశాలలో పర్యటించారు. ఇది బాల్టిక్ దేశాలతో భారత సంబంధాలలో మైలురాయిగా చెప్పాలి. ఇప్పటి వరకూ బాల్టిక్స్ దేశాలతో భారత్ నడిపిన సంబంధాలలో అత్యున్నత స్థాయి దౌత్య చర్యగా దీన్ని అభివర్ణించాలి. ఆ దేశాల అధినాయకులతో సమావేశం కావడంతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పలు వాణిజ్య సమావేశాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతేకాదు ఆ దేశాలలోని భారతీయులతో సంభాషించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సహకారానికి సంబంధించి పలు ఎంవొయులు చేసుకున్నారు. ఒప్పందం కుదుర్చుకున్న రంగాలలో వ్యవసాయం, సైబర్ సెక్యూరిటీ, ఇ-గవర్నెన్స్, విద్య తదితర రంగాలు ఉన్నాయి. భారత ఉపరాష్ట్రపతి ఇస్తోనియన్ హెడ్స్ ఆఫ్ మిషన్ కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ చర్చలు ప్రధానంగా సంస్కృతం, యోగా, ఆయుర్వేదాలలో భారత ప్రాంతీయ నాగరికతా అంశాల పరంగా బాల్టిక్స్ దేశాల ప్రజల అంతరంగం పెనవేసి ఉన్న వైనంపై సాగాయి. చారిత్రకమూలాలతో కొనసాగుతున్న ఈ సంబంధాలు రెండు దేశాల మధ్య సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలను మరింత వృద్ధిచేస్తాయి. ఇది వసుధైవ కుటుంబకం (ప్రపంచం ఒక కుటుంబం అని సంస్కృతంలో దీని అర్థం) సిసలైన స్ఫూర్తిని ప్రతిఫలిస్తోంది. ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే మూడు బాల్టిక్ దేశాలలో మూడు హిందీ అధిపతులు ఉండడం.

బాల్టిక్స్ దేశాలు భౌగోళికంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న ప్రాంతం. ఇది నోర్డక్స్, రష్యా, సిఐఎస్ దేశాలకు ‘గేట్‌వే’. అంతేకాదు రిగా ‘ఆల్-వెదర్’ ఓడరేవు అక్కడ ఉంది. యురోపియన్ కూటమి దేశాలకు ఈ మూడు బాల్టిక్ దేశాలతో పటిష్టమైన కార్యకలాపాలు ఉన్నాయి. అంతేకాదు దీనివల్ల యురోపియన్ కూటమిలో భారత్ కాన్‌స్టిట్యువెన్సీస్ పెంపొందించుకోవచ్చు. అంతేకాదు సంప్రదాయ యురోపియన్ పవర్‌హౌసెస్‌కు మించి కూడా విస్తరించవచ్చు. బాల్టిక్ దీవులు మంచి ఆర్థిక ప్రగతితో మెల్లగా యురోపియన్ కూటమిలోకి వెడుతున్నాయి. భౌగోళికంగా ఇవి చిన్నవైనప్పటికీ ఇవి వినూత్న ఆవిష్కరణలలో, అత్యున్నత సాంకేతిక పరిజ్ఘాన పెంపుదలలో శక్తివంతమైనవిగా ముందుకు సాగుతున్నాయి.

నేడు పలు గ్లోబల్, ద్వైపాక్షిక అంశాలు అంతర్జాతీయ తెరపై చూస్తున్నాం. వీటిల్లో భారత్, బాల్టిక్ దేశాల ప్రయోజనాలు విస్తరించి ఉన్నాయి. ప్రపంచం పెద్ద ఎత్తున అధికార శత్రువర్గాలుగా నిలుస్తున్నాయి. వారసత్వం ఆధిక్యధోరణులు పెరుగుతున్నాయి. అంతర్గతంగా భౌగోళిక-ఆర్థిక అంశాలతోపాటు భౌగోళిక –వ్యూహాత్మక పోటీ నెలకొని ఉంది. అంతేకాదు సంప్రదాయ, సంప్రదాయరహితమైన భద్రతా ప్రమాదహెచ్చరికలు పెరుగుతున్నాయి. ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ, వాతావరణ మార్పు అంశాలు గ్లోబల్ వ్యూహాత్మక పర్యావరణాన్ని పాడుచేస్తున్నాయి. 21 వ శతాబ్దంలో ప్రపంచీకరణ చాలా కీలమైంది. జాతీయవాదం కూడా వూపందుకుంది. నాల్గవ పారిశ్రామిక విప్లవంలోకి ప్రవేశించినా కూడా సాంకేతిక పరిజ్ఘానాన్ని చాలా సందర్భాలలో తప్పుగా వాడుతున్న పరిస్థితులు చూస్తున్నాం.ఈ పరిణామాలన్నీ కొత్తతరహా భాగస్వామ్యాలను కోరుకుంటున్నాయి. గ్లోబల్ తెరపై భారత ప్రాధాన్యం పెరుగుతోంది. యురోపియన్ కూటమిలోకి బాల్టిక్ దేశాలు సభ్యులుగా ప్రవేశించడం, అంతర్జాతీయంగా తలెత్తుతున్న పరిణామాల నేపథ్యంలో ‘నాటో’ ఆ దేశాలను కూడా కలుపుకుని బలం పెంచుకుని గ్లోబల్ సమస్యలను పరిష్కరించుకోవాలనే ఆలోచన కూడా ఉంది.

అలాగే బాల్టిక్ దేశాల జాతీయ నూతన ఆవిష్కరణల ఎకోసిస్టమ్ పటిష్టమైంది. అలాగే విజ్ఘాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ భారత్‌కు ముఖ్యమైంది. అందుకే ఈ దేశాలు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చెయిన్ అండ్ ఇ-గవర్నెన్స్ వంటి అంశాలలో పెద్ద ప్రయత్నాలను చేపట్టింది. వాటి డిజిటల్ సంబంధాలు భారత ప్రధాని మోదీ అభివృద్ధి నినాదానికి సరిపోవడమే కాదు ప్రపంచ స్థాయి అత్యున్నత సాంకేతిక పరిజ్ఘానం ద్వారా అధునాతన సాంకేతిక పరిజ్ఘానం, సామర్థ్య పెంపుదల, సుస్థిర ప్రగతులను సంఘటిత పరచాలన్న ఆలోచనతో ఉన్నాయి. మార్పుకు బాటవేస్తున్న భారత ప్రాజక్టులు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కొన్ని వాటిల్లో బాల్టిక్ కంపెనీలు శక్తివంతమైన పాత్రను పోషించే అవకాశం ఉంటుంది.

సాంకేతికపరమైన అలాగే ఆర్థికపరమైన భాగస్వామ్యం ఈ దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో కీలకంగా నిలిచాయి. ఇరువురికీ లాభదాయకంగా భారత్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఘానం పొందే మార్గం సుగమమవుతుంది. అలాగే గ్లోబల్ ప్రగతిని ప్రతిఫలిస్తూ బాల్టిక్స్ దేశాలు భారత మార్కెట్‌లో నిలుస్తాయి. ఇవి 2018-19 సంవత్సరంలో 800 మిలియన్ అమెరికన్ డాలర్ల దగ్గర నిలిచాయి. ఈ దేశాలలో రెసిడెంట్ ఇండియన్ మిషన్స్ లేకపోయినప్పటికీ ఇది సాధ్యమైంది. పర్యాటకం, మందులు, విద్య, తయారీ, ఆరోగ్య రంగాలు భవిష్యత్తులో బాల్టిక్ దేశాలతో పటిష్ట సంబంధాలు మరింత పెంపొందడానికి నూతన మార్గాలుగా తోడ్పడతాయి. అయితే ఈ వేగాన్ని, మార్పులను నిరంతరాయంగా కొనసాగించడం అసలైన సవాలు.

రచన: రాజొర్షి రాయ్: అధ్యయన విశ్లేషకులు, ఐడిఎస్ఎ

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన