యెమెన్‌లో కనపించని శాంతి

యెమెన్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యెమెన్ వేర్పాటు ఉద్యమం అధిపతి ప్రస్తుతం చిరు ఆశగా కనిపిస్తున్నారు. అడెన్ తిరుగుబాటు అనంతరం సౌదీ సారథ్యంలో శాంతి సంభాషణల్లో పాల్గొనేందుకు యెమెన్ వేర్పాటువాదం నాయకుడు తన సంసిద్ధతను వ్యక్తంచేశారు. యెమెన్‌లోని దక్షిణ వేర్పాటు దళాలకు యుఎఇ మద్దతు ఉంది. అవి అడెన్‌లోని అధ్యక్షభవనంను చుట్టుముట్టాయి. ఆ తీవ్ర పోరాటంలో 40 మంది ప్రాణాలు పోయాయి. 260 మంది గాయాలుపాలయ్యారు. వేర్పాటువాద నాయకుడు అదారస్ అల్ జుబైది మాట్లాడుతూ అబ్దరాబు మాన్‌సోర్ హది దళాలను హింసకు ప్రేరేపించాయి. ఆ దళాలే హొథి ఉద్యమం నాయకులను హత్యచేసేందుకు ప్రయత్నించాయి. వారిని లేపేయాలని చూశాయి. అడెన్ నగరంలో సౌద్రన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (ఎస్‌టిసి)పై సౌదీ ఎయిర్ దాడులు జరిగే సమయంలో ప్రకటన వచ్చింది. యుఎఇ, సౌదీ అరేబియా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న యెమెన్ రాజకీయ పక్షాలు అడెన్‌లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు వచ్చే వారంలో చర్చలకు కూడా ఆహ్వానించింది.

ఆరబ్ స్ర్పింగ్ చెలరేగడం వల్ల జరిగిన రాజకీయ బదలాయింపు వైఫల్యంలో సంఘర్షణా మూలాలు ఉన్నాయి. దీనివల్ల ఆలి అబ్దుల్లా సలాహ్ తప్పనిసరి పరిస్థితుల్లో తన డిప్యూటీ కి 2011 లో అధికారాన్ని అప్పగించాల్సి వచ్చింది. దీని పరిపాలన హది ప్రభుత్వ అంతర్గత విషయాలతో నిండామునిగి తేలుతోంది. వాటిల్లో జీహాదీ దాడులు కూడా ఉన్నాయి. దక్షిణ వేర్పాటు ఉద్యమం, భద్రతాసిబ్బంది పట్ల విధేయత, అవినీతి, నిరుద్యోగం, ఆహార భద్రత వంటివి కూడా ఉన్నాయి హోథి (షియా) తిరుగుబాటుదారులకు ఇది అనుకూలంగా మారింది. బదలాయింపు జరుగుతున్న సమయంలో గందరగోళంలో ఉన్నప్పుడు సున్నీలతో పాటు యెమెన్ పౌరుల సహాయంతో హోథీలు సాదా, సనాలపై నియంత్రణ సాధించడంలో విజయంసాధించారు. మొత్తం దేశాన్ని నియంత్రణలోకి తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రాంతీయ శత్రుదేశమైన ఇరాన్ మద్దతు ఉన్న ఒక బృందం ఏర్పడింది. సౌదీ తిరుగుబాటు దారులకు వ్యతిరేకంగా ఒక సంకీర్ణాన్ని ఏర్పాటుచేసి 2015లో హథీ ప్రభుత్వానికి మద్దతునివ్వడానికి సిద్ధపడింది. సున్నీ ఆరబ్ స్టేట్స్ అయిన సౌదీ అరేబియా, యుఎఇ, కువైట్, బహ్రైన్, కతార్, సుడాన్, ఈజిస్టు, జోర్డాన్, మొరాకాలు సైతం ఈ సంకీర్ణంలో భాగస్వాములు అయ్యాయి. బయట నుంచి అమెరికా, యుకెలు మెటీరియల్ మద్దతును అందించాయి. దక్షిణ యెమెన్ నుంచి సౌదీ సారథ్యంలోని సంకీర్ణం హోధీలను తరిమికొట్టింది. మొత్తానికి సనాపై అవి నియంత్రణ సాధించే దిశగా కొనసాగాయి. 2017లో బాలిస్టిక్ క్షిపణులను రియాద్‌లో ప్రారంభించారు. అది యెమెన్‌, సౌదీ అరేబియాలను అడ్డుకుంది. తిరుగుబాటుదారుల చేతుల్లో ఉన్న పోర్టు సిటీ హోడైడాపై సౌదీ అరేబియా దాడికి సిద్ధమైంది.

దీర్ఘకాలికంగా కొనసాగుతున్న ఈ సంక్షోభం ఎందరో యెమనీల జీవితాలను బలితీసుకుంది. ఈ విషయం అంతర్జాతీయ నివేదికల్లో సైతం చోటుచేసుకుంది. యెమెన్ మానవ విపత్తుగా పేర్కొన్నాయి. ‘ఆఫీస్ ఫర్ ది కో-ఆర్డినేషన్ ఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (ఒసిహెచ్ఎ) రూపొందించిన నివేదిక ‘2019 హ్యుమానిటేరియన్ నీడ్స్ ఓవర్‌వ్యూ ఫర్ విమెన్’ లో 14.3 మిలియన్ ప్రజలు తీవ్ర ఆహార సమస్యతో బాధపడుతున్నట్టు పేర్కొంది. వారిలో రెండు మిలియన్ల మంది చిన్నారులు కూడా ఉన్నారు. వారిలో ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు సైతం ఉన్నారు. అంతేకాదు ఒక మిలియన్ కన్నా ఎక్కువమంది గర్భిణీలు ఉన్నారు. పిల్లలకు పాలిచ్చే తల్లులు ఉన్నారు. ఐక్యరాజ్యసమితి 2018 డిశంబరులో శాంతి ఒప్పందానికి చొరవ చూపింది. హోథీలు రెండు దశల్లో నగరం వెలుపల రీడిప్లాయ్‌మెంటుకు మాట ఇచ్చారు కూడా. కానీ ఇప్పటివరకూ రీడిప్లాయ్‌మెంటుకు సంబంధించి ఎలాంటి ప్రగతి చోటుచేసుకోలేదు.

ఎర్రసముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లను కలిపే స్ట్రైయిట్స్‌లో ఉన్న యెమెన్ ఈ ప్రాంతానికి, ప్రపంచానికి ఎంతో ముఖ్యమైంది. ఇతర ప్రాంతాల నుంచి తరిమివేసినప్పుడు ఆల్ ఖైదాకు, ఐఎస్ఐఎస్‌లకు ఇది సురక్షిత ప్రాంతం. సున్నీ సౌదీ అరేబియా, షియా ఇరాన్ల మధ్య ప్రాంతీయ అధికార పోరు ఉంది. దీన్ని సంఘర్షణలో సంఘర్షణగా పేర్కొనాలి. ఎందుకంటే అంతక్లిష్టమైన సమస్య ఇది. ఇందులో సౌదీ ప్రభుత్వ దళాలకు మద్దతునిస్తోంది. అంతేకాదు యుఎఇ శిక్షణ పొందిన సెక్యూరిటీ బెల్ట్ ఫోర్స్ ఆఫ్ ఎస్‌టిసి షియా హౌథీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ప్రపంచంలోని 20 శాతం చమురు షిప్‌మెంట్ బాబ్ ల్ మన్ధెబ్ గుండా వెడుతుంది. యెమెన్ సంక్షోభం వల్ల ఇది ఒక రిస్కుగా నిలిచింది.

యెమెన్‌లో శాంతి స్థాపనను భారత్ ప్రధానంగా కోరుకుంటోంది. ఎందుకంటే ఈ సంక్షోభం కారణంగా భారత-మెమెన్ సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. భారత్ తన రాయబార కార్యాలయాన్ని సనా నుంచి జిమౌతికి 2015లో మార్చింది. యెమెన్‌కు వెళ్లడానికి సంబంధించి భారత్ సలహాపూర్వకమైన నిషేధాన్ని భారత ప్రభుత్వం జారీచేసింది. 2015లో భారత్ ఆపరేషన్ రాహత్‌ను విజయవంతంగా అమలుచేసింది. అంతేకాదు 4640 మంది భారతీయులను, అలాగే వైమానిక, సముద్ర మార్గాల నుంచి వచ్చే 41 దేశాలకు చెందిన 960 మంది విదేశీ జాతీయులను అక్కడి నుంచి ఖాళీ చేయించింది. సహాయం, పునర్నిర్మాణ పనుల్లో భారత్ పాలుపంచుకుంటోంది. చాలామంది భారతీయులు మానవ సంరక్షణా సేవలలను అందిస్తున్నారు.ముఖ్యంగా భారత్ శాంతియుతమైన యెమెన్‌ని కోరుకుంటుంది. యెమెన్ పెట్రోలియం, సహయవాయి రంగాలపై బాగా ఆసక్తిని చూపుతున్నట్టు న్యూఢిల్లీ వెల్లడించింది.

రచన: డా. లక్ష్మి ప్రియ, రీసెర్చ్ అనలిస్ట్, ఐడిఎస్ఎ

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన