జి-7 శిఖరాగ్ర సమావేశం
ఫ్రాన్స్ 1975లో జి-7 శిఖరాగ్ర సమావేశాలకు శ్రీకారం చుట్టింది. వీటిద్వారా ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థికవ్యవస్థలున్న ఏడు దేశాల నాయకులు పలు గ్లోబల్ అంశాలపై చర్చలు చేస్తారు. జి-7 పరిధిలోకి రాని ముఖ్యమైన ఇతర దేశాలకు సైతం సంక్లిష్ట రంగాలకు సంబంధించిన చర్చలను ఇది విస్తరిస్తుంది. జి-7 చర్చలు అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావాన్ని తీసుకురాగలవు. 1989 సంవత్సరంలో జి-7శిఖరాగ సమావేశాన్ని ఫ్రాన్సు నిర్వహించింది. అప్పుడే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్కు ఫోర్సు (ఎఫ్ఎటిఎఫ్)ను ఏర్పాటు చేసింది. హవాలాకు అడ్డుకట్టవేయడం, ఉగ్రవాదానికి నిధులు అందించడం వంటి వాటిని ఈ సంస్థ అడ్డుకుంటుంది. ఇటీవల సంవత్సరాల్లో ఎఫ్ఎటిఎఫ్ సభ్యురాలిగా భారత్ ఈ వేదికపై నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదానికి నిధులు అందించడాన్ని వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ సహకారాన్ని కోరింది.
ఫ్రాన్సులోని బియార్రిట్జ్ లో నిర్వహిస్తున్న జి-7 సమావేశంలో ‘స్పెషల్ బియార్రిట్జ్ పార్టనర్’గా పాల్గొనవలసిందంటూ భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫ్రాన్స్ ఆహ్వానం పంపింది. భారత్‌ను అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ముందుకు తీసుకురావాలని ఫ్రాన్సు భావించింది. అసమానతలపై శక్తివంతంగా, న్యాయబద్ధంగా, సంక్లిష్టరహితంగా వివిధ రీతుల్లో పోరాటం చేయాలన్నది దీని వెనుక ఉన్న లక్ష్యం. ప్రజాస్వామ్య సమాజాలు బహుపక్షవాదాన్ని గుర్తిస్తాయి. గౌరవిస్తాయి. వాటి పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తాయి. జి-7 పరిధిలో అన్ని రంగాలకు సంబంధించి పరస్పర చర్చలకు భారత్, ఫ్రాన్సు దేశాలు ప్రాధాన్యం ఇచ్చాయి. వాతావరణమార్పు, జీవవైవిధ్యం, సముద్రాలు, డిజిటల్ మార్పిడి వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
వాతావరణం, జీవవైవిధ్య అంశాలపరంగా జి-7 పరిధిలో చేపట్టే కొత్త కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి భారత్ సంసిద్ధంగా ఉంది. అలాగే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ-జనరల్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌ను ఈ ఏడాది సెప్టెంబరు 23న నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించడానికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నట్టు తెలిపారు. అలాగే నీటి సంరక్షణ, సౌర శక్తిని వృద్ధిచేయడం, అడవులు, మూగజీవులను పరిరక్షించడం ద్వారా సుస్థిర భవిష్యత్తును నెలకొల్పగలమని మోదీ అభిప్రాయపడ్డారు.
జి-7 శిఖరాగ్ర సమావేశానంతరం భారత్ చేపట్టే చర్యల్లో ‘వాతావరణ మార్పులను తగ్గించడం’ కూడా ఉంది. అలాగే ఆర్థికంగా నిలబడ్డం ద్వారా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ను యున్ఎఫ్‌సిసిసి 2015 పారిస్ ఒప్పందంలో పేర్కొన్న లక్ష్యాలకు అనుగుణంగా తగ్గించాలని నిర్ణయించుకుంది. మాంట్రియల్ ప్రొటోకాల్స్ కిగలి ప్లాన్‌లో భాగంగా, జి-7 బియార్రిట్జ్ ప్రతిన చేసింది. అదేమిటంటే ‘ఫాస్ట్ యాక్షన్ ఆన్ ఎఫిషియంట్ కూలింగ్’. దీని ద్వారా హైడ్రో-ఫ్లూరో-కార్బాన్స్ (హెచ్ఎఫ్‌సిఎస్)ల తగ్గింపుకు సంబంధించిన ప్రాజక్టుల్లో భారత్ పాల్గొంటుంది. తద్వారా ఎనర్జీ సామర్థ్య ప్రమాణాలను రిఫ్రిజిరేషన్ సెక్టర్‌లో మెరుగుపరుస్తుంది.
డిజిటల్ రంగానికి వస్తే, భారత్, ఫ్రాన్సు దేశాలు రెండూ బహిరంగ, భద్రతాపూర్వకమైన, శాంతియుతమైన సైబర్ స్పేస్ ద్వారా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. వీటికి అంతర్జాతీయ చట్టాలు వర్తిస్తాయి. జి-7 శిఖరాగ్ర సమావేశంలో ఫ్రాన్స్ ప్రధాన లక్ష్యం ఏమిటంటే సైబర్‌స్పేస్‌ను డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ల ద్వారా మరింత విప్లవీకరించే క్రమంలో ప్రాధమిక స్వేచ్ఛను పరిరక్షించేలా జి-7 రూపకల్పన చేయడం. అది జరిగింది.
డేటా సెట్స్ ఎంపిక ఎంతో ముఖ్యమైంది. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకితిక పరిజ్ఘానం మీద కూడా జి-7లో చర్చలు జరిగాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుల బృందం (భారత్ నుంచి వచ్చిన వారు కూడా వీరిలో ఉన్నారు) ఈ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రతిపాదించారు. రెండవ ముఖ్య అంశం ఏమిటంటే, జి-7 చర్చల్లో ఆన్ లైన్ వేదికల జవాబుదారీతనం, పారదర్శకతలకు ప్రాధాన్యం ఇచ్చింది. వాటిల్లో ప్రతిపాదిత ‘ఓపన్, ఫ్రీ అండ్ సేఫ్ ఇంటర్‌నెట్’ చార్టర్ కూడా ఉంది. ఇందులో ప్రభుత్వాలు, పలు వేదికలు, డిజిల్ సెక్టర్‌లోని వ్యాపారాలు ఇంటర్‌నెట్‌లో ప్రమాదకరమైన సమాచారాన్ని అడ్డుకునేందుకు సుస్థిరమైన నిబద్ధతలతో ముందుకు సాగడం వంటివి కూడా ఉన్నాయి. జి-7లో చర్చించిన మూడవ ముఖ్యమైన రంగం ఏమిటంటే డేటా ఆధారిత టెక్నాలజీ, మౌలికసదుపాయాల విషయంలో ఆత్మవివ్వాసం పెంపొందించుకోవడానికి సంబంధించింది. ముఖ్యంగా 5జి టెక్నాలజీ, డేటా ప్రవాహం స్వేచ్ఛగా అందుబాటులో ఉండడం వంటివి. వీటిల్లో భారత్ పాలుపంచుకోవడం వల్ల గ్లోబల్ నిర్ణయాలపై దాని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా భారత్ రూపాంతరం చెందడానికి సైబర్‌స్పేస్ వినియోగించడం ఒకటి.
సాంకేతిక పరిజ్ఘానం ద్వారా భూగ్రహంపై సాధికారం సాధ్యం చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. ముఖ్యంగా, ట్రాన్సఫర్మేటివ్ టెక్నాలజీ శక్తి ఎంతటిదో ఆయన పేర్కొన్నారు. ఇది మరింత నూతన ఆవిష్కరణలు చేస్తుందన్నారు. అంతేకాదు భారత్ టెక్నాలజీని ఉపయోగిస్తూ దేశాన్ని మరింత కొత్త ఆవిష్కరణల దిశగా, డిజిటల్ పేమెంట్స్ వైపు వృద్ధి చేసుకోవడం గురించి కూడా పేర్కొన్నారు.
జి-7 చేపట్టిన డిజిటల్ కార్యక్రమం చేపట్టడం, కొనసాగించడం భవిష్యత్తులో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మల్టీస్టేక్ హోల్డర్ కన్వెన్షన్ ఆన్ సైబర్ స్పేస్‌కు ఎంతో ఉత్ప్రేరకశక్తిగా పనిచేస్తుంది. ప్రజల అభివృద్ధి లక్ష్యంగా చేపట్టే సుస్థిర అభివృద్ధి అమలుకు డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి శక్తివంతమైన, లక్ష్యాలతో కూడిన అంతర్జాతీయ సహకారానికి అవసరమైన నియమాలు, నిబంధనలు అవసరం.
రచన: అంబాసిడర్ అశోక్ ముఖర్జీ, ఐక్యరాజ్యసమితికి భారత మాజీ శాశ్వత ప్రతినిధి

బియార్రిట్జ్ లో జరిగిన జి-7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. అదే సమయంలో మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరపడం ద్వారా దౌత్యపరంగా వేగవంతమైన అభివృద్ధి వాతావరణాన్ని, అనుకూల వాతావరణాన్ని నెలకొల్పారు. ఇది పెరుగుతున్న భారత గ్లోబల్ నాయకత్వ పాత్రపై మరింత పాజిటివ్ ప్రభావం కల్పిస్తుందనడంలో సందేహం లేదు. పైగా 2022 సంవత్సరంలో జరిగి జి-20 ప్రెసిడెన్సీ దిశగా భారత్ ముందుకు వెడుతోంది.
Comments
Post a Comment