సంబంధాల అభివృద్ధికై విదేశ వ్యవహారాల మంత్రి చైనా పర్యటన
దౌత్యపరంగా చైనాతో సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బీజింగ్‌కు అధికార పర్యటనకు వెళ్లారు. సాంస్కృతిక ఉన్నత స్థాయి యంత్రంగంతో పాటు రెండు దేశాల ప్రజల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలకు సంబంధించి సమావేవంలో చర్చించేందుకు మంత్రి చైనా వెళ్లారు. ఈ పర్యటన ప్రధానంగా ఈ సంవత్సరం అనంతరం చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్ భారతదేశాన్ని సందర్శిస్తున్ననేపథ్యంలో మంత్రి భారత విదేశాంగమంత్రి బీజింగ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘వుహాన్’ తరహా సమావేశానికి రెండవ పర్యాయం భారత ప్రధాని నరేంద్రమోదీతో అనధికారికంగా సమావేశం అయింది. అంతేకాదు భారత్, చైనాల దౌత్య సంబంధాలు 70వ సంవత్సరంలో అడుగుపెట్టాయి. దీన్ని కూడా రెండు దేశాలు జరుపుకుంటున్నాయి. జమ్ము,కశ్మీర్‌కు సంబంధించి పార్లమెంటులో భారత్ చేపట్టిన చట్టం గురించి కూడా రెండు దేశాల విదేశాంగమంత్రుల సమావేశంలో చర్చకు వచ్చింది. భారత విదేశాంగమంత్రి జైశంకర్ చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ కిషాన్‌తో కూడా చర్చలు జరిపారు. రెండు దేశాలు కూడా అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున పరిణామాలపై చర్చించారు. అంతేకాదు ప్రస్తుతం ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా చైనా, భారత్‌లు సమానస్థాయిలో కీలక శక్తులుగా అవతరిస్తున్నాయి.
కొత్తగా విదేశాంగ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భారత మంత్రి తొలి చైనా పర్యటన ఇది. కానీ గతంలో చైనాకు రాయబారిగా ఆయన పనిచేశారు. చైనా వ్యవహారాలపై మంచి పట్టు ఉన్న మంత్రికి చైనా ఏమిటో విస్పష్టంగా అవగాహన ఉంది.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ తో సమగ్రమైన, ఫలవంతమైన చర్చలను ఆయన జరిపారు. ఈ చర్చల సమయంలో, చైనా విదేశాంగమంత్రి మాట్లాడుతూ జమ్ము-కశ్మీర్‌పై పార్లమెంటులో భారత్ చేపట్టిన చట్టం సంబంధించి కూడా చర్చల్లో లేవదీశారు. దీనిపై భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ ‘ఇది పూర్తిగా భారత అంతర్గత విషయమ’ని స్పష్టంచేశారు. జమ్ము,కశ్మీర్‌లలో సుపరిపాలనను పెంచేందుకు, అలాగే సామాజిక-ఆర్థిక అభివృద్ధి పెంపుదలను దృష్టిలో పెట్టుకుని చట్టబద్ధమైన చర్యలు చేపట్టినట్టు స్పష్టంచేశారు. దీనివల్ల భారత బహిర్గత సరిహద్దులపై లేదా భారత్-చైనా సరిహద్దులో ఉన్న వాస్తవాధీన రేఖపై పడే ప్రభావం ఏమీ ఉండదు.
భారత్ అదనపు ప్రాంతీయ హక్కులను ఏమీ ఎత్తడంలేదన్న విషయాన్ని కూడా ఈ సమావేశంలో స్పష్టంచేశారు. ఈ విషయంలో చైనా ఆందోళనలను అర్థరహితంగా పేర్కొన్నారు. ఇండియా-చైనా సరిహద్దు అంశం ప్రశ్నకు సంబంధించి ఇప్పటివరకూ చూసినట్లయితే, రెండు వైపులా సహేతుకమైన, పరస్పర అంగీకారమైన ఒప్పందం 2005 పొలిటికల్ పారామీటర్స్ అండ్ గైడింగ్ ప్రిన్సిపిల్స్ ఆధారంగానే అంగీకారానికి వచ్చాయి. చైనా విదేశాంగ మంత్రి భారత, పాకిస్తాన్ల మధ్య చెలరేగుతున్న ఒత్తిడులకు సంబంధించి లేవనెత్తిన అంశంపై భారత విదేశాంగమంత్రి జైశంకర్ స్పందిస్తూ ఇది పూర్తిగా భారత అంతర్గత వ్యవహారం. దీంతో పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం గానీ, అలాగే దానిపై పడే ఒత్తిడుల బరువుగానీ ఏమీ లేదని స్పష్టంచేశారు.
చర్చల సమయంలో,రెండు దేశాలు శాంతి, సామరస్యాలను ఇండో-చైనా సరిహద్దుల్లో నిరంతరాయంగా కొనసాగించాలని పునరుద్ఘాటించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పెంపుదలకు ఇవి చాలా అవసరమని రెండు పక్షాలూ అభిప్రాయపడ్డాయి. ద్వైపాక్షిక వాణిజ్యం , ఆర్థిక సంబంధాలు చూస్తే, ఆర్థిక సంబంధాలు మెరుగుచెందినా భారత్ పరంగా వాణిజ్యలోటు ఆలోచించాల్సిన అంశం. చైనా దేశీయ మార్కెట్లలో భారత ఫార్మాస్యూటికల్, ఐటి ఉత్పత్తులు, సేవలు ప్రవేశించే అంశంపై చైనా తప్పనిసరిగా దృష్టిపెట్టాలని తమ సమావేశంలో ఇరువురూ పునరుద్ఘాటించారు.
భారత విదేశాంగమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో భారత-చైనా సంబంధాలు ముఖ్య అంశాలపై పరస్పరం చూబించే సున్నితత్వంపై ఆధారపడి ఉంటాయని అన్నారు. అది సహజంగా ఉండాలి. ఈ రెండు దేశాలు అతి పెద్ద అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలు. అలాగే రెండు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలూ వివాదాలు రాకూడదు. ఇదే అభిప్రాయాన్ని ఇరుదేశాల మంత్రులూ తమ సమావేశంలో అభిప్రాయపడ్డారు.ఈ పరిణామాలు ఇరుదేశాల మధ్య పెంపొందిన పరిణితిని ప్రతిఫలిస్తోంది.
ఈ పర్యటన సమయంలో ఐదు ఎంవొయులను రెండు దేశాలూ చేసుకున్నాయి. 2020 సంవత్సరానికి ద్వైపాక్షిక సంబంధాల పరంగా రెండు దేశాలూ సహకారం ఇచ్చిపుచ్చు కోవాలని నిర్ణయించుకున్నాయి. క్రీడలు, భారత జాతీయ మ్యూజియం, అలాగే చైనా మ్యూజియంల మధ్య సాస్కృతిక వ్యవహారాల పరంగా ఇచ్చిపుచుకోవడం, అలాగే రెండు దేశాల సంప్రదాయ వైద్య రంగంలో సహకారం, భారత నేషనల్ మ్యూజియం, హుబై ప్రొవెన్షియల్ మ్యూజియం ఆఫ్ చైనాల మధ్య సహకారంపై ఒప్పందాలు జరిగాయి.
రచన: డా. రూపా నారాయణ్ దాస్, చైనా వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు
Comments
Post a Comment