మరింతంగా పుంజుకున్న భారత-ఫ్రాన్స్ సంబంధాలు
ఈ వారంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ లో పర్యటించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పెంపుదలే ఈ పర్యటన లక్ష్యం. అంతేకాదు 20 సంవత్సరాల కాలపరిమితితో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై ఇరుదేశాలు 1998లో సంతకాలు చేశాయి. జమ్ము, కశ్మీర్‌లోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఫ్రాన్స్ జమ్ము, కశ్మీర్ అంశం భారత అంతర్గత అంశంగా పేర్కొనడం న్యూఢిల్లీకి నూతన శక్తిని ఇచ్చింది. యుఎన్ఎస్‌సి అధికారిక సంప్రదింపుల్లో భారత్‌కు అండగా నిలబడింది.
‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం’ అనే మూడు అంశాల పునాదిగా భారత, ఫ్రెంచి సంబంధాలు కొనసాగుతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఎన్నో దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య పటిష్టమైన సహకారం కొనసాగుతోందన్నారు. అంతేకాదు రెండు దేశాలు కూడా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకునే దిశగా రోడ్ మ్యాప్ కూడా రెండు దేశాలూ తయారుచేసుకున్నాయి. వాటిల్లో అభివృద్ధి సామర్థ్యం, పౌర విమానయానం, ఐటి, అంతరిక్షం వంటి అంశాలు ఉన్నాయి. ఇరుదేశాల మధ్య రక్షణ సహకారం అనేది సంబంధాల బలోపేతానికి కీలక స్తంభం అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సెప్టెంబరులో తొలి రాఫెల్ విమానాలను ఫ్రాన్స్ భారత్‌కు అందించబోతుండడాన్ని ప్రధాని ఆహ్వానించారు. ద్వైపాక్షిక సంబంధాల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. అంతేకాదు గ్లోబల్ సవాళ్లైన ఉగ్రవాదం, రాడికలైజేషన్, రక్షణ, కౌంటర్ టెర్రరిజం వంటి అంశాలపై చర్చించారు. రక్షణ, కౌంటర్ టెర్రరిజంపై సహకారాన్ని విస్తృతపరుచు కోవాలని పరస్పరం అంగీకరించారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్)లో ఇండో, ఫ్రెంచి సహకారం ద్వారా ఉగ్రవాదంపై నిధుల వెచ్చింపును పట్టుకోవడంలో విజయం సాధించాయి. అలా పాకిస్తాన్ బ్లాక్‌లిస్టు జాబితాలోకి వెళ్లింది. యుఎన్ఎస్‌సి తీర్మానం 2462 అమలుకు రెండు దేశాలు పిలుపునిచ్చాయి. ఈ తీర్మానం ఉగ్రవాదానికి నిధులు అందించడంపై పోరాటానికి సంబంధించింది. ఈ ఒప్పందాన్ని 2019, మార్చిలో చేపట్టారు. ఈ సందర్భంలో ఇరుదేశాల నాయకులూ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫైటింగ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అంశంపై సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సును 2019 నవంబరులో మెల్‌బోర్న్‌లో నిర్వహించాలని నిశ్చయించుకున్నారు.
రక్షణ సహకారం రంగంలో ఇరుదేశాలూ నావల్ (వరుణ), ఎయిర్ (గరుడ) విన్యాసాలను ఇటీవలే నిర్వహించారు. ఇండో-ఫసిఫిక్ సముద్ర ప్రాధాన్యం పెరుగుదల నేపథ్యంలో భారత్, ఫ్రాన్స్ దేశాలు నౌకాయాన స్వేచ్ఛతో పాటు సముద్రయానం, సైబర్ సెక్యూరిటీ అంశాలలో సహకారం పటిష్టం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. వీటితోపాటు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి నూతన రోడ్ మ్యాప్ తయారీకి సంబంధించి కూడా ఒక అంగీకారానికి వచ్చాయి.
సెంటర్ ఫర్ డెవలెప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డు కంప్యూటింగ్, అటోస్‌ల మధ్య ఒప్పందం కుదురింది. క్వాంటమ్ కంపూయటింగ్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అండ్ ‘ఎక్సాస్కేల్’ సూపర్‌కంపూయటింగ్, అలాగే పరస్పరం దగ్గరగా ఉండే సంబంధిత స్టార్టప్ ఎకోసిస్టమ్స్‌లపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటితోపాటు ఇరుదేశాలు దృష్టిపెట్టిన కొన్ని కీలక అంశాలు కూడా ఉన్నాయి. రెండు దేశాలూ అణుశక్తి ప్రగతికి సంబంధించిన చర్చలు ముందుకు సాగడంపై కూడా పరిశీలించాయి. అణుశక్తికి సంబంధించి భారత్‌కు చెందిన ఎన్‌పిసిఐఎల్, ఫ్రాన్స్‌కు సంబంధించి ఇడిఎఫ్‌లు దృష్టిపెట్టాయి. జైతాపూర్, మహారాష్ట్రలలో ఆరు న్యూక్లియర్ ఎనర్జీ రియాక్టర్లు నిర్మిస్తున్న నేపథ్యంలో ఇది కూడా చేపట్టారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ సమిష్టి కార్యక్రమంతో భారత ఎనర్జీ సెక్టర్‌లో కూడా ఫ్రెంచి పాత్ర పెరిగింది.
అత్యున్నతస్థాయి ఆర్థిక, ఫైనాన్షియల్ సంభాషణలను పునరుద్ధరించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్ అంగీకారానికి వచ్చారు. దీనికింద పెట్టుబడుల అంశాలు, ద్వైపాక్షిక వాణిజ్య పెంపుదలపై చర్చలు జరుగుతాయి. పౌర సమాజ స్థాయిలో, 2021-22 సంవత్సరంలో మరో పర్యాయం ‘నమస్తే ఫ్రాన్స్’ కార్యక్రమాన్ని కూడా ఇండియా ప్రణాళిక రచించింది. రెండు దేశాల మధ్య విద్యార్థుల మార్పిడి సంఖ్యను పెంచాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. భారత దేశంలో ఫ్రెంచి విద్యార్థుల సంఖ్య పెరగడం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తంచేశారు. వారిని ఆనందంగా ఆహ్వానించారు. ఇదే సమయంలో భారత, ఫ్రాన్సు దేశాలు మైగ్రేషనన్, మోబిలిటీ భాగస్వామ్యాన్ని కూడా చేసుకున్నాయి. దీనివల్ల భారత విద్యార్థులు అక్కడ చదువు అయిన తర్వాత ఫ్రాన్స్ లోనే ఉండి ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతరిక్ష అధ్యయనం రంగంలో 2022 సంవత్సరంలో చేపట్టే అంతరిక్ష మిషన్‌లో భారత వ్యోమగాములకు తోడ్పడేలా మెడికల్ సిబ్బందికి ఫ్రాన్స్ శిక్షణ ఇస్తుంది. పారిస్‌లోని భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఫ్రాన్సులో సంభవించిన ఎయిర్ ఇండియా విమానాలు కూలిన సంఘటనల్లో చనిపోయిన బాధితులకు రెండు మెమోరియల్స్ అంకితమిచ్చారు.
ప్రాంతీయ అంశాల విషయానికి వస్తే, ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జెసిపివొఎ)ని నొక్కి చెప్పారు. దానికి సంబంధించిన అంశాలను పునరుద్ఘాటించారు. వాటిని సంభాషణల ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. భారతదేశం సభ్యురాలు కానప్పటికీ, ప్రెసిడెంట్ మాక్రాన్ ‘బయార్రిట్జ్ పార్టనర్’గా పేర్కొంటూ ఈ వారాంతంలో జరిగే జి7 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సిందిగా భారత్‌ని ఆహ్వానించారు. ప్రధాని అందులో పర్యావరణం, వాతావరణ మార్పులు, డిజిటల్ మార్పుడుల సంబంధించిన అంశాలపై ప్రసంగిస్తారు. జి7 నాయకులతో ద్వైపాక్షిక చర్చలకు ఈ సదస్సు ద్వారా ఫ్రాన్స్ వేదిక కల్పిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన ఎంత విజయవంతంగా సాగింది. ఫ్రాన్స్ తో సమగ్రమైన, బహుముఖమైన సంబంధాలను భారత్ పంచుకుంటోంది.
రచన: ప్రొఫెసర్ ఉమ్ము సల్మా బావా, ఛైర్‌పర్సన్ అండ్ జీన్ మోనెట్ ఛైయిర్, సెంటర్ ఫర్ యురోపియన్ స్టడీస్, జెఎన్‌యు
Comments
Post a Comment