ఇండియా-రష్యా: కొత్త రంగాలలో సహకారం దిశగా కొనసాగిస్తున్న కృషి

ప్రధాని మోదీ రెండవ పర్యాయం ప్రధాని పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత, రష్యాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను కొత్త ఎత్తులకు తీసుకువెళ్లడానికి సంసిద్ధమ య్యాయి. ప్రధాని మోదీ తూర్పు ఆర్థిక వేదిక ఐదవ వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అంతేకాదు 2019 సెప్టెంబరు 4 నుంచి 6 వరకూ వ్లాదివోత్తోక్‌లో ఇరు దేశాల మధ్య జరగనున్న 20వ వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర మహాసభకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. కొత్త రంగాలలో సహకారానికి సరికొత్త అవకాశాలను ఇరుదేశాలూ అన్వేషిస్తున్నాయి. తద్వారా రెండు దేశాల మధ్య ఉన్న స్పెషల్ అండ్ ప్రివిలైజ్డ్ స్ట్రేటజిక్ పార్టనర్‌షిప్‌ని మరింత శక్తివంతం చేసే దిశగా ఇరుదేశాలూ అడుగులు వేస్తున్నాయి. 

భారత ప్రభుత్వం మన రాజ్యాంగంలోని 370 రాజ్యాంగ అధికరణను రద్దు చేయడాన్ని మొట్టమొదట ఆహ్వానించిన దేశాలలో రష్యా కూడా ఉంది. ఈ అంశాన్ని భారత అంతర్గత విషయంగా మాస్కో వ్యాఖ్యానించింది. అంతేకాదు భారత్‌కు పలు అంతర్జాతీయ వేదికలపై తన సంపూర్ణ మద్దతు తెలిపింది. 

ఈ నెల ప్రారంభంలో భారత కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వ్లాదివోత్సోక్‌లో పర్యటించారు. ఆయనతోపాటుగా నాలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. భారత రాష్ట్రాలు, రష్యా ఫార్‌ ఈస్ట్ ప్రావిన్సులకు మధ్య భాగస్వామ్య ప్రతిపాదనపై రష్యా డిప్యూటీ ప్రధానమంత్రి యూరి తుత్నెవ్, అలాగే ఫార్ ఈస్ట్రన్ ఫెడరల్ డిస్ట్రిక్‌కు చెందిన అధ్యక్ష రాయబారితో చర్చించడానికి పీయూష్ గోయల్ తదితరులు మాస్కోకు వెళ్లారు. రష్యా ఫార్ ఈస్ట్ ప్రాంతానికి భారత్ ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. ఆర్థిక సహకారం, పెట్టుబుడులను అక్కడ వృద్ధిచేయాలనుకుంటోంది. పెద్ద ఎత్తున వైవిధ్యమైన రీతిలో ద్వైపాక్షిక కార్యక్రమాలను విస్తరించాలని చూస్తోంది. అందుకే రష్యా ఫార్ ఈస్ట్ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిని భారత్ సారించింది. రక్షణ, అంతరిక్షం, ఎనర్జీ, న్యూక్లియర్ రంగాలలో సంప్రదాయానికి అతీతమైన సహకారాన్ని భారత్, రష్యా దేశాలు రెండూ కాంక్షిస్తున్నాయి. ద్వైపాక్షిక సహకారానికి ఇవి మూల స్తంభాలుగా పనిచేస్తాయి. అంతర్గత ప్రాంతీయ సహకారాన్ని కొత్త రంగాలకు విస్తరిస్తాయి. న్యూఢిల్లీ ప్రాంతంతో పెద్ద ఎత్తున వాణిజ్యాన్ని చేస్తోంది. 2018లో మూడు శాతం నుంచి 790 మిలియన్ అమెరికన్ డాలర్లకు విస్తరించింది. అప్పటికి భారత్ రష్యాతో చేస్తున్న వాణిజ్య విలువ మొత్తం పది బిలియన్ అమెరికన్ డాలర్లు దాటింది. రెండు దేశాలూ 2025 సంవత్సరం నాటికి 30 బిలియన్ అమెరికన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం సాధించాలని రెండు దేశాలూ టార్గెట్ పెట్టుకున్నాయి. 

భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా మాస్కోలో పర్యటించారు. రష్యా భద్రతా సలహాదారు నికోలై పత్రుషేవ్‌తో సమావేశమయ్యారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంపై సహకారాన్ని తీవ్రతరం చేయాలని మరొకసారి గట్టిగా నొక్కిచెప్పారు. అంతేకాదు సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, మూడవ పార్టీల జోక్యం లేకుండా ఉండడం లాంటి నిబంధనలకు పూర్తి మద్దతును, ప్రాధాన్యాన్ని ఇచ్చారు. 

ఎన్ఎస్ఎ ఆర్‌వొఎస్‌సివొఎస్‌ఎంఒఎస్ డైరక్టర్ దిమిత్రీ రొజోజిన్‌తో సమావేశమై అంతరిక్ష రంగంలో సహకారానికి సంబంధించి సమీక్షించారు. అంతేకాదు ‘గగన్‌యాన్’ కార్యక్రమం గురించి చర్చించారు. మాస్కోలోని యూరి గగరిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో 15 నెలల కాలపరిమితికి భారత్‌కు చెందిన 12 మంది వ్యోమగాముల్లో నలుగురుకి శిక్షణ ఇవ్వనుంది. 2022 నాటికి నిర్దేశించుకున్న భారత గగన్‌యాన్ మిషన్‌కు నలుగురు భారత వ్యోమగాములను ఈ సెంటర్‌లో సిద్ధంచేస్తున్నారు. 

కేంద్ర విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ ఈ వారంలో మాస్కో సందర్శించారు. కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది ఆయన తొలి మాస్కో పర్యటన. అక్కడ మన కేంద్ర విదేశాంగ మంత్రి రష్యా విదేశ వ్యవహారాల మంత్రి సెర్గే లవ్రోవ్‌ని కలిశారు. భారత ప్రధాని నరేంద్రమోదీ వ్లొదివోస్తోక్‌ను త్వరలో పర్యటించనున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లలో భాగంగా కేంద్ర మంత్రి అక్కడకు వెళ్లారు. మంత్రి జైశంకర్ రష్యా డిప్యూటీ ప్రధానమంత్రి యూరి బోరిసోవ్‌ని కలిశారు. ఇద్దరూ ఇండియా-రష్యా ఇంటర్-గవర్నమెంటల్ కమిషన్- టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో-ఆపరేషన్‌కు కో-ఛైయిర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశ సమయానికి అంతా సానుకూలంగా సాగేలా తగిన చర్యలను తీసుకుంటున్నారు. ఇండో-ఫసిఫిక్ మీద భారత దృక్కోణంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ‘వాదై డిస్కషన్ క్లబ్‌’లో ప్రసంగించారు కూడా. 

భారత్ నుంచి రష్యాకు అత్యున్నత స్థాయి పర్యటనలు చేసుకుంటున్నాయి. భౌగోళిక-రాజకీయ, భౌగోళిక-ఆర్థిక పరమైన మార్పులు ఈ ప్రాంతంలో తలెత్తుతున్న సందర్భంలో వీటి పరిణామాలు మరింత విస్తరించే అవకాశమున్న క్షణాల్లో ఈ పర్యటనలు జరిగాయి. సుదీర్ఘకాల మిత్రదేశమైన రష్యాతో సరికొత్త సహకారానికి నాంది పలకడంతోపాటు సహకారాన్ని కొత్త పుంతలు తొక్కించాలన్న ఉద్దేశంలో భారత్ ఉంది. సరికొత్తగా అభివృద్ధిచెందుతున్న పరస్పరసహకార కార్యక్రమాలు ప్రధానంగా కొన్ని ముఖ్యమైన రంగాలలో అంతర్గత ప్రాంతీయ సహకారంపై రెండు దేశాలూ దృష్టి పెట్టాయి. అందులో వ్యవసాయం, డైమండ్ కటింగ్, పాలిషింగ్ యూనిట్ల ఏర్పాటు, టింబరు వనరులు, పల్ప్, పర్యాటకరంగానికి వూత, మత్యపరిశ్రమ, మైనింగ్ రంగాలు ఉన్నాయి. గతంలో రష్యా, భారత్‌లు నాలుగు ప్రధాన రంగాలలో సహకారంపై సమిష్టిగా దృష్టి పెట్టాయి. వాటిల్లో ఎనర్జీ, డిజిటల్ ఎకానమీ, స్టార్టప్స్, మౌలికసదుపాయాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన సందర్భంగా, అలాగే భారత విదేశాంగ మంత్రి , రష్యా విదేశాంగ మంత్రులు జైశంకర్, సెర్గే లవ్రోవ్‌లు సహకారం కొత్తరంగాలకు విస్తరించాలని చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో రెండు దేశాలు తమ మధ్య సంబంధాలను నూతన దిశగా అభివృద్ధి పరచాలని దృఢంగా నిశ్చయించుకున్నట్టు స్పష్టమవుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ల సమావేశం రెండు దేశాల మధ్య ఉన్న ప్రగాఢ అనుబంధాన్ని వ్యూహాత్మకంగా, ఆర్థికపరమైన అభివృద్ధి పరంగా మరింత అర్థవంతం చేస్తుందనడంలో సందేహం లేదు. 

రచన: డా. మీనా సింగ్ రాయ్, రష్యా, సిఐఎస్ వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన