భారత-జాంబియా సంబంధాలను మరింత పెంచనున్న జాంబియా ప్రెసిడెంట్ భారత పర్యటన

జాంబియా అధ్యక్షుడు ఎడ్గర్ ఛాగ్వా లుంగు భారత్‌లో పర్యటించారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయనను భారత్‌లో పర్యటించవలసిందిగా ఆహ్వానించారు. భారత్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జాంబియా అధ్యక్షుడి భారత తొలి పర్యటన ఇది. అంతేకాదు జాంబియా అధ్యక్షుడు లుంగు మొట్టమొదటిసారి భారతదేశాన్ని సందర్శించడం మరో విశేషం. పదహారు సంవత్సరాల క్రితం జాంబియా అధ్యక్షుడు లెవీ వనవాసా 2003 ఏప్రిల్‌లో భారత్‌ను సందర్శించారు.



ఆఫ్రికా దేశాలతో సత్సంబంధాల విధానాన్ని భారత్ చేపట్టిన విషయం తెలిసిందే. మూడవ ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ శిఖరాగ్ర సదస్సు జరగనున్న సమయంలో భారతదేశంలోని పలు రాజకీయ నాయకులు ఆఫ్రికా దేశాలకు 32 మార్లు పర్యటించారు. అలాగే ఆఫ్రికా దేశాల నాయకులు కూడా భారత దేశానికి 35 మార్లు పర్యటించారు. రాష్ట్రపతి కోవింద్ 2018లో జాంబియా పర్యటన చేసిన పదహారు నెలల తర్వాత జాంబియా అధ్యక్షుడి పర్యటన చోటుచేసుకుంది. ద్వైపాక్షిక సంబంధాల ప్రగతి సమీక్ష పరంగా జాంబియా అధ్యక్షుడి పర్యటన చాలా ముఖ్యమైంది. 




జాంబియా అధ్యక్షుడి పర్యటన సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో విందు నిర్వహించారు. జాంబియా అధ్యక్షులు రాజ్ ఘాట్‌ను సందర్శించారు. రాష్ట్రపతి కోవింద్‌తో సమావేశమయ్యారు. అంతేకాదు ప్రధాని నరేంద్రమోదీతో ప్రతినిది స్థాయి చర్చలు జరిపారు. వీటితోపాటు లెంగు న్యూ ఢిల్లీలో జరిగిన ఇండియా-జాంబియా బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొన్నారు. 



జాంబియా అధ్యక్షులు, ప్రధాని మోదీ ఇరువురూ కలిసి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య రక్షణ, భద్రత, ఖనిజాల వనరులు, వ్యాపారం, పెట్టుబడులు, మౌలికసదుపాయాలు, ఎనర్జీ, ఆరోగ్యం, సామర్థ్య పెంపుదల, సంస్కృతి, ప్రాంతీయ, గ్లోబల్ ప్రయోజనాలు తదితర అంశాలపై ఉపయుక్తమైన చర్చలను ఇరుదేశాల నాయకులు జరిపారు. సంతకాలు చేసిన ఒప్పందాల పురోగతిపై సమీక్షించారు. అంతేకాదు 2018లో రాష్ట్రపతి కోవింద జాంబియా పర్యటనలో నిర్ణయాలు సైతం తీసుకున్నారు. ఇప్పటివరకూ సాధించిన ప్రగతిపై సంతృప్తిని వ్యక్తంచేశారు. జాంబియా అధ్యక్షుడు లుంగు అందించిన మందుల సహాయాన్ని, వైద్యసామగ్రిని అందుకున్నారు. వీటి మొత్తం విలువ మూడు మిలియన్ అమెరికన్ డాలర్లు ఉంటాయి. అంతేకాదు ఒక లక్ష డాలర్లను మహాత్మా గాంధీ ప్రాథమిక పాఠశాలకు అందించారు. గత ఏడాది రాష్ట్రపతి కోవింద్ జాంబియా పర్యటనలో చేసిన ఈ ప్రకటనలను చేతలలో పూర్తిచేశారు. భారత్ అందించిన ఈ సహాయం పట్ల జాంబియా అధ్యక్షులు కృతజ్ఘతలను తెలిపారు. 




అభివృద్ధి భాగస్వామ్యం పరంగా గమనిస్తే, జాంబియా అధ్యక్షులు లుంగు జాంబియా అభివృద్ధి ప్రాజెక్టులకు భారత్ అందించిన మద్దతును ప్రశంసించారు. మరీ ముఖ్యంగా రక్షణ దళాల నిర్మాణ సామర్థ్యం విషయంలో భారత్ అందించిన సేవలను జాంబియా అధ్యక్షులు ప్రత్యేకంగా పేర్కొన్నారు. రక్షణ సహకారానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేయడం పట్ల కూడా ఆయన ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఒప్పందం ఈ రంగంలో ఇరుదేశాల మధ్య సహకార పెంపుదలకు మార్గం వేస్తుందన్నారు. దీంతోపాటు జాంబియా దేశ సైనిక బలగాల సామర్థ్య పెంపుదల కోసంగా సైనిక, వైమానిక శిక్షణా బృందాలను జాంబియాకు భారత్ పంపింది. 




మరో ముఖ్య ఒప్పందం/ఎంవొయు కూడా కుదిరింది. భౌగోళిక, ఖనిజ వనరుల రంగంలో సహకారానికి సంబంధించి కూడా ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. పలు ఎంవొయులపై రెండు దేశాలూ సంతకాలు చేశాయి. అంతేకాదు కళలు, సంస్కృతి రంగాలపై ఆరోగ్యం, మందుల సహకారంపై ఎంవొయు చేసుకున్నారు. అలాగే ఫారెన్ సర్వీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జాంబియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిప్లొమసీ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ మధ్య పరస్పర అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. పరస్పర అవగాహన, సహకారాల కోసం ఎన్నికలు, భారత ఎన్నికల సంఘం, ఎలక్ట్రోరల్ కమిషన్ ఆఫ్ జాంబియాల మధ్య ఒప్పందం, అలాగే టెలి ఎడ్యుకేషన్, టెలిమెడిసెన్‌లలో ఇ-విబిఎబి నెట్‌వర్కు ప్రాజెక్టులో పాల్గొనడం వంటి ఎన్నో ఒప్పందాలు చేసుకున్నాయి. 




సౌర్య శక్తికి సంబంధించి కొన్ని ప్రధాన ప్రకటనలను భారత్ చేసింది. అలాగే చిన్న, మధ్యతరహా ఎంటర్‌ప్రైజెస్ (ఎస్ఎంఇఎస్) గురించి ప్రకటించింది. ఈ ప్రకటనల పట్ల జాంబియా అధ్యక్షుడు లుగు కృతజ్ఘతలు వ్యక్తంచేశారు. వీటితోపాటు ఎస్ఎంఇ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు మద్దతును కూడా ఇస్తున్నాం. ఇది చిన్న, మధ్యతరహా అభివృద్ధి పెంపుదలకు తోడ్పడతాయి. జాంబియాలో వ్యవసాయ పెంపుదలకు సౌర శక్తితో పనిచేసే వంద సాగునీటి పంపులను సరఫరా చేయడానికి గ్రాంట్లు ఇవ్వడానికి కూడా భారత్ ఒప్పందపడింది. జాంబియా ఎయిర్ ఫోర్సు బేసెస్ కోసం ఐదు ఫైర్ టెండర్లు దించింది. మానవతాకోణంలో సేవలందించేందుకు వెయ్యి మెట్రిక్ టన్నుల బియ్యం, వంద మెట్రిక్ టన్నుల పాల పొడిని భారత్ సహాయం చేసింది. ఇవన్నీ కూడా జాంబియాతో భారత సంబంధాల నిబద్ధతను ప్రతిఫలిస్తున్నాయి. అంతేకాదు జాంబియా అభివృద్ధి, ప్రగతి కోసం భారత్ కట్టుబడి ఉన్న తీరును స్పష్టంచేస్తోంది. 




ద్వైపాక్షిక సంబంధాలలో వ్యాపారం, పెట్టుబడుల సంబంధాలు కూడా చాలా ముఖ్యమైనవి. రెండు దేశాల మధ్య వైవిధ్యవంతమైన వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవాలన్న ఉద్దేశాన్ని ఇరుదేశాల నాయకులు నొక్కి చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్యం మెల్లగా పెరుగుతూ 2018-19 సంవత్సరానికి 830 మిలియన్ అమెరికన్ డాలర్లకు వృద్ధిచెందింది. వీటిల్లో జాంబియా నుంచి చేసుకున్న ఎగుమతులు అధికంగా ఉన్నాయి. జాంబియాలో ప్రైవేటు పెట్టుబడులు మెల్లగా పెరుగుతూ వస్తున్నాయి. ఇవి ముఖ్యంగా గనులు, మౌలికసదు పాయాలు, తయారీరం, ఫార్మాస్యుటికల్స్, వ్యవసాయ రంగాలలో పెట్టుబడులు మెల్లగా కానీ స్థిరంగా జాంబియాలో పెరుగుతూ వస్తున్నాయి. జాంబియా అధ్యక్షుడి భారత పర్యటనతో ఇరుదేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు అవసరాని కనుగుణంగా మరింత వేగం పుంజుకోనున్నాయి. 




రచన: డా. నివేదితా రే, ఆఫ్రికా వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన