జీ-7 భేటీలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ల సమావేశం
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మెక్రాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీని జీ 7 సదస్సుకు ‘ప్రత్యేక అతిథి’గా ఆహ్వానించారు. ఫ్రాన్స్‌లోని బిరిట్జ్‌లో ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సు సందర్భంగా భారత్, ఫ్రాన్స్‌లు కలిసి పని చేయవలసిన అనేక అంశాలు తెర మీదకు వచ్చాయి. ఇరాన్ అణు ఒప్పందం కొనసాగింపు, వాతావరణ మార్పులపై పోరాటం లాంటి అంశాలు అనేకం ఉన్నాయి. ఈ సదస్సు సందర్భంగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లు విడిగా భేటీ అయ్యారు.
ఈ సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు వాణిజ్యం, ఆర్థిక పరమైన అంశాలు చర్చించారు. డబ్ల్యుటీవో భారత్‌కు ఇచ్చిన ‘అభివృద్ధి చెందుతున్న దేశం’ అనే ట్యాగ్‌ను తమకు అనుకూలంగా మార్చుకుంటోందని అమెరికా అధ్యక్షుడు ఈ సందర్భంగా నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ట్యాగ్‌ను ఉపయోగించుకొని అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తోందని ఆయన అన్నారు. దీనికి ప్రతిగా అమెరికా భారత దేశం నుంచి దిగుమతి అవుతున్న ఉక్కుపై అధిక సుంకాలు విధించారు. దీనివల్ల భారత ఉత్పత్తులు ప్రియంగా మారేలా చేశారు.
భారత దేశం కూడా 2019 జూన్‌లో అమెరికాకు చెందిన 28 రకాల ఉత్పత్తులపై సుంకాలను విధించింది. ఇరు దేశాల నేతలు ఈ అంశంలో వ్యూహాత్మక సంబంధాల విషయంలో విస్తృతంగా చర్చించుకున్నారు. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో వాణిజ్యం అత్యంత ముఖ్యమైన అంశం అయినప్పటికీ ఇటీవలి కాలంలో మార్కెట్‌ల అందుబాటు, సుంకాలు కొంత ఆందోళనకరమైన పరిస్థితులకు దారి తీసింది. అయితే ఈ సమావేశాల సందర్భంగానే ప్రధాని మోదీ అమెరికా నుంచి తాము మరింత దిగుమతులు చేసుకునే ఉద్దేశం ఉందని స్పష్టం చేశారు. ఇరు దేశాలు సుంకాలు, మార్కెట్ అందుబాటు విషయంలో ఉన్న బేధాభిప్రాయాలను పరిష్కరించుకునేందుకు సంసిద్ధతను ప్రకటించాయి.
ఇంధన రంగంలో మరింత సహకారం అవసరమని ఈ సమావేశం సందర్భంగా ఇరు దేశాలు గుర్తించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ నెలలో అమెరికా జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు వెళ్తున్న సందర్భంగా హూస్టన్ పట్టణాన్ని సందర్శిస్తున్నారు. అక్కడ భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించే సందర్భంలో అక్కడ వాణిజ్య వేత్తలతో ఇంధన రంగం గురించి ప్రత్యేకంగా చర్చించనున్నారు. దీని ప్రధాన ఉద్దేశం అమెరికా నుంచి ఇంధనం (చమురు) దిగుమతి చేసుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించడం, అదే సమయంలో ఇంధన రంగంలో భారత దేశం ఎలాంటి పెట్టుబడులు పెట్టగలదో చూడడం ఇందులోని ముఖ్య ఉద్దేశాలు. భారత ప్రధాని తన పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీలో ప్రెసిడెంట్ ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశంలో కూడా పాల్గొంటారు. ఇరువురు వ్యూహాత్మక భాగస్వాముల మధ్య ఈ సందర్భంగా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వస్తాయి.
బిరిట్జ్‌లో ఇరు దేశాధి నేతల మధ్య జరిగిన సమావేశానికి మరో ప్రాధాన్యత కూడా ఉంది. ప్రధానిగా నరేంద్ర మోదీ తిరిగి రెండవ సారి ఎన్నికైన తర్వాత ఇరు దేశాధినేతల మధ్య జరిగే మొదటి సమావేశం ఇది. జమ్ము, కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసిన అనంతరం జరిగిన సమావేశం కూడా ఇది కావడం గమనార్హం. కశ్మీర్ పరిణామం అనంతరం పాకిస్థాన్ అంతర్జాతీయ సంస్థల వద్ద ప్రాంతీయ రాజకీయాల గురించి అనేక ఆరోపణలు చేసింది. అయితే భారత్ తన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా తమ అంతరంగిక వ్యవహారమని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో స్పష్టం చేసింది.
జమ్ము, కశ్మీర్‌లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, అంతా అదుపులోకి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ఈ విషయంపై మరింత వివరంగా మాట్లాడుతూ ‘‘భారత్, పాకిస్థాన్‌లు పరస్పరం సంభాషించుకోవచ్చు. దీన్ని వారు ఎంతో కాలంగా చేస్తున్నార’’ని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ విషయంలో ఇతర దేశాల సహాయం అవసరం లేదని చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ప్రెసిడెంట్ ట్రంప్ కశ్మీర్ ద్వైపాక్షిక అంశమని, భారత్-పాకిస్థాన్‌లు ఈ విషయంలో పరస్పరం చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవచ్చునని అన్నారు. ‘‘ఇలాంటి విషయాల్లో మేం ఏ దేశాన్ని ఇబ్బంది పెట్టదల్చుకోలేద’’ని ఆయన స్పష్టం చేశారు. దీంతో భారత దేశానికి అంతర్జాతీయ సమాజంలో ఉన్న కీలకమైన స్థానం ఏమిటో స్పష్టం చేసినట్లైంది.
రెండు దేశాల నేతల మధ్య సమావేశం ఒక సానుకూలమైన అడుగుగా భావిస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశలో సహకారానికి ఈ భేటీ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
శ్వేత సౌథం ఈ భేటీపై స్పందిస్తూ భారత ప్రధాన మంత్రి, అమెరికా అధ్యక్షుని సమావేశం వల్ల భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉన్న ఉద్రిక్తతలు తగ్గాయని వ్యాఖ్యానించింది. జీ 7 దేశాల సదస్సులో ఇదో కీలకమైన అంశంగా భావించవచ్చు. శ్వేత సౌథం విడుదల చేసిన ఒక ప్రకటనలో భారత్, అమెరికాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలపర్చుకునే అవసరాన్ని ప్రెసిడెంట్ ట్రంప్ గుర్తించారనీ, దీనికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపింది.
రచన : డాక్టర్ స్తుతి బెనర్జీ, అమెరికా వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు

Comments
Post a Comment