పటిష్టమవుతున్న భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక బంధం
భారత-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక బంధం మరింత పటిష్టమవుతోంది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా ఇటీవలి ఢాకా సందర్శన ఇందుకు అద్దం పట్టింది. ముఖ్యంగా బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా నాయకత్వంలోని ప్రస్తుత అవామీ లీగ్ ప్రభుత్వ హయాంలో ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊపు లభించింది. శృంగ్లా 2019 జనవరిదాకా బంగ్లాదేశ్‌లో భారత హై-కమిషనర్‌గా ఢాకాలో పనిచేశారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఎంతో కృషిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఢాకా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు భారతదేశంలో ఇటీవలి అంతర్గత పరిణామాలు తమ దేశంపై ప్రభావం చూపే అవకాశం ఉందని బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, బంగ్లాదేశ్ ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇవ్వడంతోపాటు భారత పరిణామాలపై అధికారిక సమాచారం కూడా అందజేశారు.
బంగబంధు షేక్ ముజీబుర్ రహ్మాన్ శతజయంతి వేడుకలను ఈ నెల మధ్యలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి వెళ్లనుండటంతో ఆయన పర్యటనకు రంగం సిద్ధం చేయడం కోసం శృంగ్లా ఢాకాను సందర్శించారు. కాగా, షేక్ ముజీబుర్ రహ్మాన్ మనకూ జాతీయ యోధుడేనని ప్రధానమంత్రి కొనియాడారు. ఆయన శతజయంతి వేడుకలకు మోదీ హాజరవుతున్న సందర్భంగా రెండు దేశాల మధ్య అనేక అంశాలు చర్చకు రాగల అవకాశాలున్నాయి. పరస్పర ఆందోళనకర అంశాలెన్నిటినో పరిష్కరించేలా రెండు దేశాలూ అనేక విశిష్ఠ చర్యలు తీసుకున్నాయి. దీనివల్ల గడచిన ఏడాది కాలంలో ఢాకా-ఢిల్లీ సంబంధాలు వృద్ధిపథంలో పయనిస్తున్నాయి. భౌగోళిక సరిహద్దు సమస్యపై చారిత్రక ఒప్పందంతోపాటు సముద్ర సరిహద్దు వివాదంపై అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి అంగీకారం కుదిరింది. దీంతో ఈ అంశాలమీద భారత్ వైఖరిపై బంగ్లా నిరంతర ఆరోపణలు సమసిపోయాయి. సరిహద్దుల గుర్తింపు పూర్తి కావడంతో 2001నాటి పైర్దివా సంఘటన తరహా ఘర్షణలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ చట్టవిరుద్ధ కార్యకలాపాల ఫలితంగా సరిహద్దుల్లో అప్పడప్పుడూ కాల్పుల మోత వినిపిస్తూ అక్కడ గస్తీని కాస్త కఠినతరం చేస్తోంది.
భారత-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణం క్రమేణా పెరుగుతోంది. ముఖ్యంగా 2011 నుంచి ప్రధానంగా జౌళి ఉత్పత్తులుసహా 61 వస్తువులపై భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు సుంకం మినహాయింపు ఇవ్వడంతో ఈ వృద్ధి కనిపిస్తోంది. ఎగుమతుల ప్రోత్సాహక సంస్థ గణాంకాల ప్రకారం... గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు బంగ్లా ఎగుమతులు 873.27 మిలియన్ డాలర్లు కాగా, 42.91 శాతం పెరిగి నేడు 1.25 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. ఈ విధంగా బంగ్లాదేశ్ ఏటా 7 శాతానికిపైగా వృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పుంజుకునే వీలున్నప్పటికీ సుంకాల మినహాయింపు లేకపోవడమన్నది ప్రధాన అవరోధం కానుంది. అయితే, అనుసంధాన, మౌలిక వసతుల ప్రాజెక్టులు అనేకం ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే ప్రతిపాదిత బంగ్లాదేశ్-భూటాన్-ఇండియా-నేపాల్- BBIN మోటారు వాహనాల చట్టం, బిమ్‌స్టెక్ కూటమి మోటారు వాహనాల చట్టం అమలులోకి వస్తే ద్వైపాక్షిక వాణిజ్యం కొత్త శిఖరాలకు చేరే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంధన వాణిజ్యంతోపాటు జలరవాణా మార్గాల్లో ప్రయాణ సౌలభ్యం కూడా వర్తక-వాణిజ్యాల వృద్ధిలో కీలకపాత్ర పోషించనున్నాయి.
ప్రధానమంత్రి ఢాకా పర్యటన సమయంలో రెండు దేశాల మధ్య రక్షణరంగ సహకారంపైనా చర్చలు జరిగే వీలుంది. రక్షణ రంగంకోసం బంగ్లాదేశ్‌కు 500 మిలియన్ డాలర్ల మేర రుణం మంజూరుకు భారత్ ఆమోదం తెలిపింది. అయితే, దీని అమలుపై రెండు దేశాల మధ్య ఇంకా సంభాషణలు సాగుతూనే ఉన్నాయి. బహుశా ప్రధాన ప్రస్తుత పర్యటనలో ఈ అంశం కూడా ఒక కొలిక్కి రాగలదని అంచనా. మరోవైపు తీరప్రాంత నిఘా వ్యవస్థ ఏర్పాటుపై రెండు దేశాలూ 2019లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనిపైనా ప్రధాని తాజా సందర్శన సందర్భంగా చర్చలు కొనసాగవచ్చు. ఇక ఉగ్రవాద నిరోధంలో భాగంగా ఉభయ దేశాలు ‘సంప్రీతి’ పేరిట చర్యలు చేపట్టడంతోపాటు ఉమ్మడి భద్రత సమస్యల పరిష్కారం కోసం గస్తీని సమన్వయం చేసుకుంటున్నాయి.
భారత్ నుంచి బంగ్లాకు 8 సంవత్సరాల వ్యవధిలో నాలుగు వంతులవారీ రుణాలు మంజూరయ్యాయి. అయితే, ఇందులో 51 శాతాన్ని మాత్రమే బంగ్లాదేశ్ వినియోగించుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 7.5 బిలియన్ డాలర్ల విలువైన రుణ సదుపాయం అమలు బంగ్లాకు అత్యవసరం కావడంతో మోదీ తాజా పర్యటన సందర్భంగా ఇది ప్రస్తావనకు రానుంది. కాగా, వివిధ వంతులవారీ రుణ సౌకర్యాలలో 510.12 మిలియన్ డాలర్ల విలువైన మూడు రైల్వే ప్రాజెక్టులున్నాయి. ఈ నిధుల్లో 2019 డిసెంబరునాటికి 87.80 మిలియన్ డాలర్లను మాత్రమే బంగ్లాదేశ్ వాడుకుంది. ప్రాజెక్టు నివేదికల రూపకల్పనలో బంగ్లాదేశ్ నిదానంగా వ్యవహరిస్తుండటమే నిధుల విడుదలకు ప్రధాన అవరోధం. పర్యవసానంగా కొన్ని ప్రాజెక్టుల నిర్మాణ అంచనా వ్యయం పెరిగిపోతోంది. ఇక కొత్త రైళ్లు, బస్సులను ప్రవేశపెట్టడంతో ప్రజల మధ్య సంబంధాలు కొన్నేళ్లుగా పెరుగుతున్నాయి. అంతేగాక ప్రత్యేక వైద్య వీసాల విధానం, భారత ప్రభుత్వ ‘పొరుగుకు ప్రాధాన్యం’’ విధానం కింద వీసా జారీ నిబంధనల సరళీకరణ మరో ముఖ్యమైన తాజా పరిణామం. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాల్లో నిరంతర అత్యున్నత వృద్ధిని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఢాకా పర్యటన ప్రస్ఫుటం చేస్తోంది.
రచన: డాక్టర్ స్మృతి ఎస్.పట్టనాయక్, దక్షిణాసియా వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు

Comments
Post a Comment