ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి శ్రీలంక ప్రధాన మంత్రి పర్యటన

శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్సా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో భారత్ సందర్శించారు. భారత నాయకత్వంతో ఆయన చర్చలు జరిపారు. రాష్టప్రతి రామనాథ్ కోవింద్ తో రాజపక్స సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. మన విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా శ్రీలంక ప్రధాన మంత్రితో చర్చల్లో పాల్గొన్నారు.

భారత్, శ్రీలంక దేశాలు చిరకాల సన్నిహిత స్నేహితులు అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. సంస్కృతి, మతం, ఆధ్యాత్మికత, కళ, భాష వంటి రంగు రంగుల అసంఖ్యాక దారాలతో మన ద్వైపాక్షిక బాంధవ్య చరిత్ర అల్లుకుపోయి ఉంది. భద్రత, ఆర్థిక వ్యవస్థ, సామాజిక ప్రగతి ఏ రంగాల్లో ఆయినా సరే మన గతం, మన భవిష్యత్తు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. శ్రీలంకలో స్థిరత్వం, భద్రత ,సౌభాగ్యాలు కేవలం భారత పరంగానే కాక యావత్ హిందూ మహాసముద్ర ప్రాంత పరంగా కూడా ముఖ్యమైనవి. అందుకే శాంతి సౌభాగ్యాలకు భారత పసిఫిక్ ప్రాంతాల్లో కూడా మన సన్నిహిత సహకారం చాలా విలువైనది. మన 'sagar' అంటే అందరికీ భద్రత పెరుగుదల విధానం, పొరుగుదేశానికి ప్రధమ ప్రాధాన్యం అనే సిద్ధాంతాల ప్రాతిపదికన శ్రీలంకతో భారత్ ప్రత్యేక ప్రాధాన్యతను కనబరుస్తూ ప్రాంతీయ భద్రత అభివృద్ధి కోసం భారత్ తో కలిసి పనిచేయాలన్న శ్రీలంక ప్రభుత్వ ఆలోచనను భారత్ స్వాగతించింది.

పరస్పర ప్రయోజనకరమైన, ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు అన్నింటిపైనా ప్రధానమంత్రి మోదీ, రాజపక్సేలు వివరంగా చర్చలు జరిపారు.దక్షిణాసియా ప్రాంతంలో ఉగ్రవాదం ఓ పెను ప్రమాదం. ఇరుదేశాలు ఈ సమస్యను ధీటుగా ఎదుర్కొన్నాయి.గత ఏడాది ఎప్రియల్లో ఈస్టర్ డే నాడు బాధాకరమైన,క్రూ రాతిక్రూరమైన దాడులు శ్రీలంక లో చోటు చేసుకున్నాయి. ఇవి శ్రీలంకపైనే కాక మానవత్వంపైన కూడా జరిగాయని చెప్పవచ్చు. ఉగ్రవాదంపై పోరుకు ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోయేలా చర్చలు జరిపారు. భారత్ ప్రీమియర్ శిక్షణా కేంద్రాలలో ఉగ్రవాద వ్యతిరేక కోర్సులలో పాల్గొనేందుకు శ్రీలంక పోలీసు అధికారులు పాల్గొనడం ప్రారంభించారు. ఇరుదేశాల ఈ సంస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భారత్ పనిచేస్తోంది.


శ్రీలంకలో సంయుక్త ఆర్థిక ప్రోజెక్టుల గురించి ఇరువురు నేతలు చర్చలు జరిపారు.అలాగే ఆర్ధిక,వ్యాపార,పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడంపై కూడా చర్చించారు.ఇరుదేశాలలోని ప్రజలతో ప్రజల అనుసంధానం,పర్యాటకరంగ ప్రోత్సాహం,అనుసంధానత మెరుగుదల అంశాలపై కూడా చర్చించారు.


చెన్నై,జాఫ్నాల మధ్య ఇటీవలి నేరుగా చేరుకునే విమానం ఈ దిశలో సలిపిన ప్రయత్నాలలో భాగం. నేరుగా చేరుకునే విమానం ఉత్తర శ్రీలంక ప్రాంతంలోని తమిళ జనాభాకు అనుసంధానతను పెంచడమేకాక ఆ ప్రాంత ఆర్థిక, సా మాజికాభివృద్ధికి ప్రయోజనకరి కాగలదు. ఈ విమానం పై అందుతున్న మంచి స్పందన ఇరు దేశాలకు సంతోషదాయకంగా ఉంది. మన బాం ధవ్యాన్ని మరింతగా మెరుగు పరిచేందుకు, పెంపొందించేందుకు తగు ప్రయత్నాలపై ఇరువురు ప్రధానమంత్రులు చర్చించారు.


శ్రీలంక అభివృద్ధి కృషిలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఉంటోంది. గత ఏడాది ప్రకటించిన నూతన Lines of Credit మన అభివృద్ధి సహకారానికి మరింత పరిపుష్టి ని తేగలవు. శ్రీలంక ఉత్తర,తూర్పు ప్రాంతాలలో అంతర్గతంగా స్థానభ్రంశం పొందిన ప్రజలకు భారత్ గృహనిర్మాణ ప్రాజెక్ట్ క్రింద నిర్మించిన 48,000 కుపైగా ఇళ్లు పూర్తి కావడము న్యూ ఢిల్లీ కి సంతోషదాయకం. దేశ ఎగువ ప్రాంతం లో భారత మూలాలున్న తమిళ ప్రజలకు చేబట్టిన పలు వేల ఇళ్ల నిర్మాణం కూడా పురోగమన దిశలోనే ఉంది. మత్స్యకారుల మానవీయ పరిస్థితులపై కూడా ప్రధానమంత్రి రాజపక్సే, మోడీ లు చర్చించారు.ఇరుదేశాల ప్రజల జీవనోపాధిని ఇది ప్రత్యక్షంగా ప్రభావితం గావిస్తుంది. ఈ అంశంపై నిర్మాణాత్మకమైన,మానవీయ వైఖరిని కొనసాగించేందుకు న్యూ ఢిల్లీ,కొలంబోలు అంగీకరించాయి.

విదేశీ విధానాల రూపకల్పనకు ఆచరణకు దారితీసిన దేశీయ నిర్బంధాల ను శ్రీలంక ప్రధానమంత్రి వక్కాణించారు."మాకు అభివృద్ధి మొదటి అవసరం.మాకు సమయవ్యవధి తక్కువగా ఉంది . ఐదేళ్లలో మేము ప్రజలకు ఫలితాలను చూపించాలి లేకుంటే ప్రజలు మమ్మల్ని తరిమి కొడతారు. నాకు అదే జరిగింది. శ్రీలంకకు ఉత్తమ ప్రయోజనకరమైన దాని పైనే మేము దృష్తి సారిస్తాం." కొలంబో ఎదుర్కొంటున్న చైనా రుణభారం పై రాజపక్సే స్పందిస్తూ అది తన ప్రభుత్వానికి నిర్దేశించింది అయి ఉంటే తాను అనుమతించి ఉండేవాణ్ని కానన్నారు.

Reconcilliation - సయోధ్య పై ఇరువురు నాయకులు సవివరంగా మాట్లాడుకున్నారు. సమైక్య శ్రీలంకలో సమాత్త్వం,న్యాయం,శాంతి,గౌరవాలను తమిళ ప్రజలు ఆశిస్తున్నారని ,వాటిని శ్రీలంక ప్రభుత్వం నెరవేర్చగలదని తాము విశ్వసిస్తున్నామని మన ప్రధానమంత్రి వ్యక్తపరిచారు. అందుకు శ్రీలంక రాజ్యాంగ పదమూడవ సవరణ అమలు తోబాటు reconcilliation ప్రక్రియ కొనసాగింపు అవసరం.


రచన: పదం సింగ్, ఆకాశవాణి వార్తా విశ్లేషకులు 

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన