భారత యాక్ట్ ఈస్ట్ పాలసీకి వియత్నాం వారధి 

సోషలిస్ట్ రిపబ్లిక్ అఫ్ వియత్నాం ఉపరాష్ట్రపతి డాంగ్ థాయ్ న్గోక్ థిన్హ, ఇటీవల భారత దేశంలో పర్యటించారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో ప్రతినిధి స్థాయిలో అధికారిక చర్చలు జరిపారు. తూర్పు దేశాల దౌత్య సంబధాల విషయంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’కి, అదే విధంగా ఇండో – పసిఫిక్ వ్యుహనికీ కూడా వియత్నాం వారధిగా, సంధానకర్తగా నిలుస్తుంది.అంతే కాదు,ఆగ్నేయ ఆసియా దేశాలతో ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను మెరుగు పరచుకునే లక్ష్యంలోభాగంగా, భారత దేశం CLMV దేశాలుగా వ్యవహరించే-కంబోడియాలో పీడీఅర్,మయాన్మార్,వియత్నాం దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంలోనూ వియత్నాం,కీలక భూమికను పోషిస్తుంది.

భారత్ – వియత్నాం దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా వియత్నాం ఉపరాష్ట్రపతి భారత దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా భారత్ – వియత్నాం దేశాల మధ్య నేరుగా విమాన సర్వీస్ ఏర్పాటు చేస్తూ చేసిన ప్రకటన వియత్నాం ఉపరాష్ట్రపతి డాంగ్ థాయ్ న్గోక్’ భారత్ పర్యటనలో ప్రధానంగా చెప్పుకోవలసిన విశేషం. ఇందుకు అదనంగా,ఈ పర్యటనలో వాయిస్ అఫ్ వియత్నాం, రెసిడెంట్ ఆఫీసును డిల్లీలో ఏర్పాటుచేసే ఒప్పందంపై ఉభయ దేశాలు సంతకాలు చేశాయి.ఈ పర్యటనలో భాగంగా వియత్నాం ఉపరాష్ట్రపతి బుద్ధగయను సందర్శించారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2016 వియత్నాంలో పర్యటించారు. ప్రధాని వియత్నాం పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాలు ఒక మెట్టు పైకెక్కి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరుకున్నాయి.నిబంధనలకు అనుగుణంగా ప్రాంతీయ వ్యూహాత్మక భాగస్వామ్య వ్యవస్థ రూపుదిద్దుకుంది. వియత్నాం భారత దేశ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ విషయంలో సానుకూల దృక్పధంతో ఉంది. ప్రాంతీయ సమస్యల విషయంలో భారత దేశం పోషించే క్రియాశీలక పాత్రకు స్వాగతిస్తోంది. ఏషియాన్ రక్షణ మంత్రుల సమావేశం, తూర్పు ఆసియా సదస్సు, మెకాంగ్ గంగా సహకారం, ఆసియా యూరప్ సదస్సు, ఐక్య రాజ్య సమితి, ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి అంతర్జాతీయ,ప్రాంతీయ మండళ్ళలో పరస్పర సహకారంతో పాటుగా ఉన్నతస్థాయి నాయకుల పర్యటనలు, పరస్పర సేవా సహకారం, నౌకా దళం పర్యటనలు, శిక్షణ, సామర్ధ్య నిర్మాణం, రక్షణ పరికరాల కొనుగోలు, సాంకేతిక విజ్ఞానం బదలాయింపు వంటి అనేక విషయాల్లో ద్వైపాక్షిక రక్షణ భద్రతా రంగాలలో సహకారం మరింతగా బలపడింది.

భారత దేశం 2016లో రక్షణ పరికరాల కొనుగోలుకు 500 మిలయన్ అమెరికా డాలర్ల పూచికత్తు రుణ సదుపాయాన్ని ప్రకటించింది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని ఆఫ్ షోర్ హై స్పీడ్ పెట్రోల్ బోట్స్ కోసం లార్సెన్ అండ్ టుబ్రో సంస్థతో వియత్నాం బోర్డర్ సెక్యూరిటీ గార్డ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అంతే కాకుండా, నహ త్రంగ్’లోని టెలీకమ్యూనికేషన్స్ యూనివర్సిటీలో ఆర్మీ సాఫ్ట్- వేర్ పార్క్ నిర్మాణానికి మరో 5 మిలియన్ అమెరికా డాలర్ల రుణ మంజూరుకు భారత్ దేశం కట్టుబడి ఉంది. అదే విధంగా సరిహద్దు నేరాలను నిరోధించేందుకు ఉభయ దేశాల సముద్ర రక్షణ దళాలు అవగహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇందుకు అదనంగా, వియత్నాం ప్రజా రక్షణ మంత్రిత్వ శాఖ, భారత ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అవగాహన ఒప్పందం చేసుకున్నాయి.

ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో రక్షణ, భద్రత రంగాల సహకారంతో పాటుగా ఆర్థిక సహకారం కూడా అత్యంగా కీలకమై ఆధారం. వియత్నాం ప్రభుత్వ వాణిజ్య భాగస్వాములలో భారత దేశం తొలి పది స్థానాల్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుండి. ఏషియాన్’ దేశాలో భారత దేశం అత్యధికంగా ఎగుమతులుచేసే దేశాలలో సింగపూర్ తర్వాత రెండవ స్థానంలో వియత్నాం నిలుస్తుంది. అలాగే, అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్యంలో ఇండోనేషియా, సింగపూర్, మలేషియాల తర్వాత నాల్గవ స్థానంలో వియత్నాం నిలుస్తుంది. ఎగుమతులో ప్రధానంగా, వస్త్రాలు, చేనేత, ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తులు, చర్మ ఉత్పత్తులు, పాదరక్షలు, ఇంజనీరింగ్ రంగాలపై దృష్తిని కేంద్రీకరించారు.

ఆగ్నేయ ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన వియత్నాం భారతః దేశానికి అనేక అవకాశాలను అందిస్తోంది. మరో వంక భారత దేశం ఇంధనం, ఖనిజ అన్వేషణ, తవ్వకం, వ్యవసాయ ఉత్పత్తుల తయారీ, చెక్కెర తయారీ,రసాయనాలు, ఐటీ, ఆటో విదిభాలు వంటి అనేక రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. పెద్ద ఎత్తున దేశాలు పోటీ పడుతున్న దక్షిణ చైనా సముద్ర ప్రాంతం సహా అనేక రంగాల్లో భారత పెట్టుబడులను వియత్నాం స్వాగతిస్తోంది. వియత్నాంలో బ్లాక్ 6.1, బ్లాక్ 128లలో ONGC విదేశీకి భాగస్వామ్యం ఉంది. ONGCతో పాటుగా, టాటా పవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జిమ్’పెక్స్, JK టైర్లు, గ్లెన్మార్క్ లిమిటెడ్ వంటి అనేక భారతీయ సంస్థలు వియత్నాంలో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి.

ఇండియా – వియత్నాం వ్యూహాత్మక భాగస్వామ్యానికి చాలా చరిత్ర ఉంది. డిఎన్ బిఎన్ ఫూ లో ఫ్రెంచ్ పై వియత్నాం విజయం సాధించిన తర్వాత ఆ దేశంలో పర్యటించిన విదేశీ ప్రముఖుల్లో స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా ఉన్నారు. 1954లో అయన వియత్నాం లో పర్యటించారు.ఆ తర్వాత వియత్నాం అధ్యక్షుడు, భారత దేశంలో కూడా అంకుల్ – హోగా గౌరవం పొందిన హో చీ మిన్హ 1958లో భారత దేశంలో పర్యటించారు. ఆవెంటనే 1959లో భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, వియత్నాంలో పర్యటించారు. ఇక అప్పటినుంచి కొనసాగుతూ వచ్చిన ఉన్నత స్థాయి పర్యటనలు చివరకు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేశాయి.

భారత దేశం ఆచరిస్తున్న యాక్ట్ ఈస్ట్ ఆసియా విధానానికి వియత్నాం గుండెకాయ వంటిడి. భారత – వియత్నాం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మహోన్నత చారిత్రక శిఖరాలకు చేర్చేందుకు,భారత దేశం నిరంతరం పెట్టుబడులు పెడుతూనే ఉంటుంది. ఆ దిశగా వడి వడిగా అడుగులు వేస్తోంది.

రచన: డాక్టర్. టిట్లీ బసు, ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా స్ట్రాటజిక్ అనలిస్ట్

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన