FATF నిషేధిత జాబితాలోనే ఇరాన్... నిఘా జాబితాలో పాకిస్థాన్
ఇరాన్‌ను ‘నిషేధిత జాబితా’లో కొనసాగించాలని అంతర్జాతీయ ఆర్థిక కార్యాచరణ సంస్థ- FATF గత శుక్రవారం నిర్ణయించింది. మరోవైపు పాకిస్థాన్‌ను మాత్రం ‘నిఘా జాబితా’లోనే ఉంచింది. అంతర్జాతీయ ఉగ్రవాదానికి నిధుల నిరోధంద్వారా ప్రపంచాన్ని మరింత సురక్షితంగా ఉంచేందుకు 40 సభ్యదేశాలతో కూడిన ఈ సంస్థ పారిస్ కేంద్రంగా కృషి చేస్తూంటుంది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా అక్రమ ద్రవ్య చలామణీ, ఉగ్రవాదానికి నిధుల ప్రవాహంపై నిఘా పెడుతూ, రెండు విభిన్న విభాగాల్లో సంబంధిత దేశాల జాబితాను రూపొందిస్తుంది. ఆయా దేశాలతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించే అంతర్జాతీయ సమాజానికి ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచుతుంది. ఈ క్రమంలో FATF ఏదైనా దేశాన్ని నిషేధిత జాబితాలో చేర్చిందంటే- ఆ దేశంతో ఆర్థిక లావాదేవీలు అత్యంత ప్రమాదకరమని అర్థం. అలాగే ‘నిఘా జాబితా’లోని దేశం అక్రమ ద్రవ్య చలామణీ, ఉగ్రవాదానికి నిధులపై చర్యలు తీసుకుంటున్నా ఇంకా చాలా చేయాల్సి ఉందని, అయినప్పటికీ దానితో వ్యవహారాలవల్ల పెద్దగా ముప్పులేదని అర్థం.
ఇరాన్‌లో పార్లమెంటరీ ఎన్నికలు నిర్వహించిన రోజునే ఆ దేశాన్ని ‘నిషేధిత జాబితా’లోనే కొనసాగిస్తున్నట్లు FATF ప్రకటించడం యాదృచ్ఛికం. కాగా, ఇరాన్‌లో అత్యంత శక్తిమంతమైన గార్డియన్ కౌన్సిల్ అధిశాతం సంస్కరణవాద అభ్యర్థులను వడపోయడంవల్ల ఈ ఎన్నికల్లో సంప్రదాయవాద అభ్యర్థులదే విజయమన్న అంచనాలున్నాయి. కాగా, ఇరాన్‌తో అణు ఒప్పందంనుంచి వైదొలగడమేగాక ఆ దేశంపై అమెరికా తీవ్ర ఆంక్షలు విధించింది. దీంతో ఇరాన్ ప్రజల్లో ఆర్థికపరమైన అసంతృప్తి విస్తృతమై నిరసన వెల్లువెత్తింది. ఇలా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలపై ఆ పరిణామాల ప్రభావం పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఐరోపాతో ప్రత్యామ్నాయ ఆర్థిక ఏర్పాటుద్వారా అణు ఒప్పందాన్ని కొనసాగించాలని ఇరాన్ పాలకులు భావించారు. కానీ, ఇరాన్‌ను నిషేధిత జాబితాలోనే ఉంచాలన్న FATF తాజా నిర్ణయంతో వారి ప్రయత్నం ఫలించే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు ఎన్నికల్లో సంప్రదాయవాదులు విజయం సాధిస్తే ఇరాన్-అమెరికాల మధ్య ప్రతిష్టంభన మరింత ముమ్మరమయ్యే ప్రమాదం ఉంది. వాస్తవానికి ఇరాన్‌ను FATF నిషేధిత జాబితానుంచి తప్పించే దిశగా పార్లమెంటులో ఆధిక్యంగల సంస్కరణవాదులు అధ్యక్షుడు హసన్ రౌహానీ నేతృత్వాన తీర్మానాన్ని ఆమోదించారు. కానీ, సంప్రదాయవాదుల ఆధిక్యంగల గార్డియన్ కౌన్సిల్ దీన్ని అడ్డుకుంది. సంప్రదాయ -సంస్కరణ వాదుల మధ్య ఈ ముఠాతత్వమే FATF నిర్ణయానికి దారితీసింది.
ఇక పాకిస్థాన్‌ను నిఘా జాబితాలోనే కొనసాగించాలని FATF నిర్ణయించింది. ఉగ్రవాదానికి నిధులు, భారత్‌సహా పలు దేశాల్లో ఉగ్రదాడులకు కేంద్రం కావడం వంటి చరిత్రగల దేశం పాకిస్థాన్. కాబట్టే అమెరికా తోడ్పాటుతో FATF నిఘా జాబితానుంచి బయటపడాలని ఆ దేశం యత్నించినా ఫలితం దక్కలేదు. మరోవైపు ఉగ్రవాదానికి నిధుల ప్రవాహాన్ని నిరోధిస్తామని ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ వాగ్దానం చేసినందువల్ల ఇరాన్‌తో పోలిస్తే FATF ప్రస్తుతం పాక్‌కు మరో అవకాశమిచ్చింది. అంతకుముందు 2012 నుంచి 2015 వరకూ పాకిస్థాన్ FATF నిఘా జాబితాలో ఉంది. ఆ తర్వాత అమెరికా పట్టుబట్టడంతో తిరిగి 2018లో మరోసారి నిఘా జాబితాలో చేరుస్తూ ఉగ్రవాదంపై తగిన చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. అయినప్పటికీ FATF తాజా సర్వసభ్య సమావేశం సందర్భంగా చైనా, మలేషియా, టర్కీ మద్దతు పలకడంతో నిషేధిత జాబితాలో చేరే ప్రమాదం నుంచి బయటపడగలిగింది. అంతేకాకుండా ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వైదొలగే దిశగా తాలిబన్లతో అమెరికా చర్చల్లో పాకిస్థాన్ కీలకపాత్ర పోషించాల్సి ఉంది. అలాగే ఇరాన్‌ను ఏకాకిని చేయడంలో పాకిస్థాన్ సహకారం కూడా అమెరికాకు అవసరం. ఏదేమైనా ఆర్థిక పతనం అంచునగల దేశాన్ని గట్టెక్కించేందుకు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పాటుపడుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ను FATF నిషేధిత జాబితాలో చేర్చి ఉంటే ఆ దేశానికి అది పెనువిపత్తుగా పరిణమించేదనడంలో సందేహం లేదు.
ఇరాన్ ఇకపైనా FATF నిషేధిత జాబితాలో కొనసాగనుండటం ఆ దేశాన్ని ఆర్థికంగా మరింత చిక్కుల్లో పడవేస్తుంది. అమెరికాతో సంప్రదింపుల ద్వారా కొన్ని గతిశీల మార్పులు సంభవిస్తే తప్ప సమీప భవిష్యత్తులో ఈ జాబితానుంచి ఇరాన్‌కు విముక్తి లభించే అవకాశం లేదు. ఇక ఉగ్రవాదానికి నిధులను నిరోధించడంతోపాటు ఉగ్రదాడులకు స్థావరమన్న ముద్రనుంచి బయటపడే దిశగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తన వాగ్దానాలను పటిష్ఠంగా అమలు చేస్తారని ఆశిద్దాం!
రచన: డాక్టర్ ఆసిఫ్ షుజా, సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయ మధ్యప్రాచ్య కేంద్రం సీనియర్ పరిశోధక సభ్యులు

Comments
Post a Comment