పార్లమెంట్’లో ఈవారం

రచన:వీ. మోహన్ రావు, జర్నలిస్ట్ 

విదేశీ పెట్టుబడిదారులు, భారత ఆర్థిక వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం చూపుతున్నారని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్ర బడ్జెట్ 2020-21పై పార్లమెంట్’లో జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ, ఆర్థికమంత్రి ‘అభివృద్ధి పెట్టుబడులకు నిధులు సమకూర్చే సాధనసంపత్తి బ్యాంకులకు పుష్కలంగా ఉందని పార్లమెంట్’కి తెలిపారు. 2024-25 నాటికి ప్రభుత్వం మౌలిక సదుపాయాల రంగంలో లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. GST రెవిన్యూ వసూళ్ళలో క్రమానుగతి వృద్ధి కనపడుతోందని మంత్రి చెప్పారు. 2014-15లో రెండు ట్రిలియన్ డాలర్లున్న దేశ నామినల్ GDP, 2019-20 నాటికి 2.9 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని ఆర్థిక మంత్రి వివరించారు.యువత భవిత కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి నిర్మలా సీతారామన్, తెలిపారు.భారత ఆర్థికవ్యవస్థ పట్ల సర్వత్రా సానుకూల విశ్వాసం బలపడుతోందని అంటూ కేంద్ర అర్థిక మంత్రి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని వివరించారు.

నావెల్ కరోనా వైరస్ ముప్పును ఎదుర్కునేందుకు దేశం సర్వసన్నద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ తెలిపారు. లోక్ సభలో ఈ విషంపై మాట్లాడిన మంత్రి ముందు జాగ్రత చర్యలు అన్నీ తీసుకున్నామని, పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు జాగ్రత్తగ గమనిస్తోందని తెలిపారు. కరోనా వైరస్ పరిస్థితిని సమీక్షించేందుకు ప్రభుత్వం ఒక బృందాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు.వైద్య ఆరోగ్య శాఖ ఏ రోజుకారోజు పరిస్థితిని సమీక్షించి, అవసరమైన సత్వర చర్యలు తీసుకుంటోందని,ఇంతవరకు దేశంలో మొత్తం 1,118 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించామని మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ సభకు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి, చైనాలోని వూహాన్ నుంచి భారతీయ విధ్యార్ధులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో సహకరించిన ఎయిర్ ఇండియా, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.ఇదే విషయంపై రాజ్య సభలో ఒక ప్రకటన చేసిన డాక్టర్ హర్ష వర్ధన్, కరోనా వైరస్ క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు చేసిందని వివరించారు.ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు సంబంధించి రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి,ఈ పధకం కింద ద్వితీయ, తృతీయ ఆసుపత్రి సంరక్షణ చికిత్సకు, 10.74 కోట్ల పేద, ఉపేక్షిత కుటుంబాలకు, కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వంతున ఆరోగ్య బీమా సదుపాయం సమకూరుతుందని వివరించారు. 

కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ కు సమబందించి,హోమ్ శాకాహ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి 2019 నవంబర్ 9 నుంచి 2020 జనవరి 31 వరకు కర్తార్ పూర్ కారిడార్ ద్వారా 44 వేల 951 మంది యాత్రికులు శ్రీ కర్తార్ సాహిబ్ ‘ ను దర్శించుకున్నారని వివరించారు. కాగా, కిషన్ రెడ్డి సహచర సహాయ మంత్రి నిత్యానంద రాయ్, 2020 జనవరి 31 వరకు 35 లక్షల 40వేల267 మంది విదేశీ భారతీయలకు, ఓవర్ సీస్ సిటిజన్స్ అఫ్ ఇండియా -OCI – కార్డులు జారీ చేసినట్లు లోక్ సభకు తెలిపారు. పౌరసత్వ చట్టం 1955లో పేర్కొన్న విధంగా OCI కార్డులను ఎప్పుడైనా రద్దు చేయవచ్చుని సభ్యుల ప్రశ్నకు సమాదానంగా చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం 2019 ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి 2014 డిసెంబర్ 31కి ముందు భారత దేశానికి శరణార్ధులుగా వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ, క్రైస్తవులకు పౌరసత్వం కలిపించేందుకు ఉద్దేశించిన చట్టమని తెలిపారు. 

దేశంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిరోధించేందుకు క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ, 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల తయారీ, వినియోగాన్ని నిషేధించిందని, రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి సదానంద గౌడ సభకుతెలిపారు.అయితే, ఒకసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వస్తువల వలన పర్యావరణానికి,ముఖ్యంగా భూమి, జలవనరులు, సముద్ర పర్యావరణ పరిస్థితుల పై భారీ ప్రభావం చూపుతున్నందున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, 2022 నాటికి ఒక సారి ఉపయోగించివదిలేసే ప్లాస్టిక్ వస్తువల పై పూర్తి స్థాయి నిషేధం ప్రకటించారని మంత్రి చెప్పారు. 



నూతన పర్యాటక విధానం తయారు చేయడం జరిగిందని, ప్రస్తుతం నూతన విధానం సమీక్షలో ఉందని పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. నూతన పర్యాటక విధానంలో ఉద్యోగ కల్పన, ప్రజల భాగస్వామ్యానికి పెద్ద పీట వేయడం జరిగిందని చెప్పారు. అదే విధంగా విదేశీ పర్యాటకులు తప్పక చూసి తీరవలసిన పర్యాటక ప్రాంతాలుగా దేశంలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటుగా దేశీయ పర్యాటకులు స్వదేశీ వైభవాన్ని, అందాలను తెలుసుకునే విధంగా నూతన పర్యాటక విధానం ఉంటుందని మంత్రి వివరించారు. ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభలు బడ్జెట్ సమావేశాల మధ్యస్థ విశ్రాంతిలో ఉన్నాయి .. మార్చి మొదటి వారంలో పార్లమెంట్ బడ్జెట్ మలి విడత సమావేశాలు ప్రారంభమవుతాయి.

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన