భారత ఉప ప్రాంతీయ అనుసంధాన ప్రణాళికకు బీబీఎన్ ఊతం, ఉత్సాహం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి – ఎన్డీఎ - ప్రభుత్వ విదేశాంగ విధానంలో , వైబర్హుడ్ ఫస్ట్, పొరుగువారికి ప్రధమ ప్రాధాన్యత, విధానం ఒక ప్రధాన అంగంగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014లో పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పొరుగు దేశాలపై,ముఖ్యంగా భారత దేశానికి తూర్పున ఉన్న పొరుగు దేశాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొరుగు దేశాల దౌత్య విధానంలో ప్రత్యేకత ఉంది. పొరుగు దేశాల దౌత్య సంబంధాలలో కేవలం ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను మెరుగు పరచుకోవడం మాత్రమే కాదు, అది అంతవరాకే పరిమితం కాదు.ప్రాంతీయ,ఉప ప్రాంతీయ స్థాయిలో బలమైన మౌలిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దౌత్య విధానంలో భాగంగా నిలిచింది.అంటే, రోడ్డు, రైలు, వాయు మార్గాల అనుసంధానంతో పాటుగా ఆర్థిక అనుసంధానం, ప్రజల మధ్య అనుసంధానం, డిజిటల్ అనుసంధానమ వంటి సున్నిత అనుసంధాన అంశాలు అన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దౌత్య ప్రణాళికలో, దౌత్య విధానంలో భాగంగా ఉన్నాయి. ఇందులో భాగంగా భారత దేశం, పొరుగు దేశాల మధ్య అనేక దృఢ, సున్నిత బంధాలను ప్రోత్సహించే అనుసంధాన ప్రాజెక్టుల ప్రక్రియలను విజయవంతంగా కొనసాగిస్తోంది.
ఈ లక్ష్యాలను చేరుకోవడంలో బీబీఐఎన్(బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్)ఉప ప్రాంతీయ అనుసంధాన ప్రణాళిక ఒకటి. అంతే కాదు ఇది ఒక ప్రత్యేక ప్రణాలిక. ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నప్రాజెక్ట్ బీబీఐఎన్. ఈ ఒప్పందం పై సంతకాలు చేసిన దేశాల నడుమ సమర్ధ నియంత్రణ యంత్రాంగం పర్యవేక్షణలో ఎలాంటి ఆటకం లేకుండా ప్రైవేటు వస్తు రవాణా, ప్రయాణీకుల వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చూడడం ప్రణాళిక ప్రకటిత లక్ష్యం.
ఇందుకు సంబంధించి,సరహద్దులు దాటి వాహనాల రాకపోకలకు సౌలభ్యం చేకూర్చే,మోటార్ వెహికల్స్ అగ్రిమెంట్ (MVA)ను వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో ఇటీవల బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్ దేశాల అధికారుల సమావేశం జరిగింది. భూటాన్ అధికారాలు పరిశీలన సభ్యులుగా హాజరయ్యారు.ఈ సమావేశంలో భాగస్వామ్య దేశాల నడుమ ప్రయాణీకుల, వస్తు రవాణా, వ్యక్తిగత వాహనాల రాకపోకలను నియంత్రించే MVAలో చేర్చ వలసిన వస్తు, ప్రయాణీకుల వాహన నియమావళిపై చర్చించారు. 2018లో జనవరిలో బెంగుళూరులో జరిగిన సమావేశం అనతరం ఇదే తొలి సమావేశం కావడంతో ఈ సమావేశం ప్రత్యేక ప్రధాన్యతను సంతరించుకుంది.
సమావేశంలో పాల్గొన్న దేశాలు, సమావేశంలో చర్చించిన అంశాలపై తమ తమ దేశాలలో అంతర్గత చర్చలు జరిపి, దేశీయంగా జరిపిన చర్చల సారాంశాన్ని 2020 మే నాటికి తెలియచేయాలని, సమావేశంలో పాల్గొన్న దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. చర్చల సందర్భంగా, ముసాయిదా అవగాహనా ఒప్పందం (MoU) పై భారత దేశం, బంగ్లాదేశ్, సంతకాలు చేశాయి. నేపాల్ కూడా ఈ చర్చల్లో పాల్గొంది. ఈ అవగాహనా ఒప్పందం, ప్రస్తుతానికి భూటాన్ మినహా మిగిలిన మూడు దేశాలు BBIN - MVA అమలుకు అవకాశం లభిస్తుంది. భారత్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ దేశాలు 2015 జూన్’లో మోటారు వెహికల్స్ అగ్రిమెంట్, మోటారు వాహనాల ఒప్పందం పై సంతకాలు చేశాయి. అయితే, భూటాన్ పార్లమెంట్ ఎగువ సభ ఈ ఒప్పందాన్ని ఇంకా దృవీకరించలేదు. అందువలన ఆ దేశం ఇంకా ఒప్పందం పై సంతకమ చేయలేదు.
భూటాన్ ఎగువ సభ శాసన నిర్మాతలు, BBIN మోటారు వాహనాల ఒప్పందానికి సంబంధించి,సుస్థిర అభివృద్ధి, పర్యావరణ సమస్యల పరంగా కొన్ని అభ్యతరాలను, ఆందోళన వ్యక్తపరిస్తున్నారు.భూటన్ చిన్నపర్వత దేశం. పర్యావరణ పరంగా సున్నిత దేశం. కాబట్టి, ఆ దేశం ఆందోళన చెందడం. అభ్యంతరం చెప్పడం తప్పుకాదు. భూటాన్ ఆందోళన అర్ధం చేసుకోదగినది. నిజమైనది. సభ్యదేశాలు భూటాన్ వ్యక్త పరిచిన అభ్యంతరాలపై దృష్టి నిలిపి, వారి సందేహాలను, ఆందోళనలను నివృత్తి చేయవలసి ఉంది. భూటాన్ దేశాన్ని, ఒప్పందం పరిధిలోకి తెచ్చుకునేందుకు, ఇతర దేశాలు భూటాన్’లో ప్రవేసించే వాహనాల సంఖ్యపై తమకు తాముగా పరిమితులు విధించుకోవచ్చును.భారత దేశం భూటాన్ ఆందోళనలను అర్థం చేసుకుంది.బుహత్తర రవాణా అనుసంధానం కోసంగా సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ పణంగా పెట్టరాదని విశ్వసిస్తోంది.
BBIN లో భాగస్వామ్యం ఉన్న నాలుగు దేశాలలో, రెండు కీలక దేశాలు, భూటాన్, నేపాల్ దేశాలు భూ సరిహద్దులు కలిగిఉన్న దేశాలు. ఈ దేశాలలో దేశీయ,సరిహద్దు మౌలిక అనుసంధానం తక్కువగా, పరిమితంగా ఉంటుంది. భూటాన్, నేపాల్ దేశాలు రెండూ కూడా, భారత దేశం ద్వారానే సముద్ర రవాణా సదుపాయాలను పొందుతున్నాయి. BBIN అమలులోకి వస్తే, ఉప ప్రాంత అనుసంధానం పెరగడం మాత్రమే కాకుండా, సభ్య దేశాల ప్రజల మధ్య అనుబంధం, వాణిజ్య అనుసంధానం పెరుగుతాయి. పరస్పర పర్యాటక రంగం అభివృద్ధికి దారితీస్తుంది. రవాణా సదుపాయాలు మెరుగైనకొద్దీ వాణిజ్య పెరుగుతుంది. వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయి. వాణిజ్య వస్తువుల కదలిక వేగాన్ని పుంజుకుంటుంది.వాణిజ్య వస్తువులు, ముఖ్యంగా త్వరగా చెడిపోయే సరుకుల రవాణాకు పట్టే సమయం భారత దేశంతో పోరుగు దేశాల వాణిజ్య సంబంధాల నిర్ధారించడం కీలక పాత్రను పోషిస్తుంది. ఇలాంటి ఏర్పాటు, ఒప్పందం వలన భారత దేశ ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు రాష్టాలు కూడా ప్రయోజనం పొందుతాయి. BBINలోని మూడు దేశాలతో భారత దేశానికి ద్వైపాక్షిక యంత్రాంగం ఉంది,కాబట్టి, బహుళ దేశ సరిహద్దు రవాణా వ్యవస్థ ఏర్పాటు అవరోధాలు, అడ్డంకులు లేకుండా సరహద్దు రవాణాకు చక్కని బాటలు వేస్తుంది.అలాగే, పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తుంది.
భారత దేశం, నేపాల్, బంగ్లాదేశ్, మోటారు వాహనాల ఒప్పందాన్ని అమలు చేయాలని నిర్ణయించినందున మూడు దేశాల అనుసంధాన ప్రణాళిక నిజమయ్యే సమయం ఆసన్నమైనదని అనుకోవచ్చును.అలాగే భూటాన్ కూడా, ఆ దేశ పార్లమెంట్ ఎగువ సభ ఆమోదంతో త్వరలోనే మిగిలిన మూడు దేశాలతో కలుపుతుందని అశించ వచ్చును.
రచన: డాక్టర్. రాహుల్ మిశ్రా , Strategic Analyst

Comments
Post a Comment