భారత్ – ఆఫ్రికా రక్షణ మంత్రుల సదస్సు

లక్నోలో జరిగిన ‘డిఫెన్సు ఎక్స్పో ఇండియా’ సందర్భంగా, భారత్ – ఆఫ్రికా రక్షణ శాఖ మంత్రుల సదస్సు జరిగింది. భారత్, అఫ్రిక్ దేశాల రక్షణ మంత్రుల మధ్య అధికారికంగా సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడంతో ఈ సదస్సు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.అలాగే,అఫ్రికా దేశాలతో రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు వేసిన తొలి అడుగు కూడా ఇదే కావడం మరో విశేషం.ఆఫ్రికా దేశాలతో భారత దేశానికి రక్షణ భాగస్వామ్యం ఉంది.ఇప్పడు,ఈ సదస్సు,భారత దేశంలో తయారైన పరికరాలను ఆఫ్రికా ఖండానికి ఎగుమతి చేసే వేదికను ఏర్పాటు చేసింది. 14 ఆఫ్రికా దేశాల రక్షణ మంత్రులు, పార్లమెంట్ సంభ్యులు, 19 మంది సైన్యాధికారులు, ఎనిమిది మంది శాశ్విత కార్యదర్శులు సహా మొత్తం 154 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. రక్షణ రంగంలో భారత్-ఆఫ్రికా దేశాల సంబధాలకుగల ప్రత్యేక ప్రాధాన్యతను ఈ సదస్సు ద్రువీకరించింది.

ఆఫ్రికా దేశాలకు ఇప్పుడు అన్నికంటే ముఖ్యమైనది శాంతి, రక్షణ. ఇందు కోసం ఆఫ్రికా దేశాలు ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. “తుపాకుల నిశ్శబ్దం: ఆఫ్రికా అభివృద్ధికి అనుకూల వాతావరణ సృష్టి” ఇదే ఈ సంవత్సరం అఫ్రికా యూనియన్, నిర్దేశించుకున్న థీమ్, ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్య సాధనకోసంగా ఆఫ్రికా యూనియన్ రూపొందించుకున్న రోడ్డు మ్యాప్ ప్రణాళిక శాంతి, రక్షణ, అభివృద్ధి మధ్య సంబంధాన్ని గుర్తించింది. ఇది ప్రధానమంత్రి అభివృద్ధి దృక్పథం,‘సాగర్.’. అంటే ప్రాంత సెక్యూరిటీ, అన్ని ప్రాంతాల అభివృద్ది’ లక్ష్యాన్ని పోలి ఉంది.

భారత్ – ఆఫ్రికా సంబంధాలలో ఎంతో కాలంగా రక్షణ, భద్రత ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ఆఫ్రికా దేశాలలో వలస పాలన అంతమైన అనంతరం భారత దేశం,ఇథియోపియాలో మిలిటరీ అకాడెమి స్థాపనాకు సహాయం చేసింది. అదే విధంగా నైజీరియాలో డిఫెన్సు, నావల్ కాలేజీ, ఘనాలో ఎయిర్ ఫోర్సు కాలేజీ ఏర్పాటులోనూ సహకారాని అందించింది, అంతే కాదు, ఇంకా అనేక ఆఫ్రికా దేశాలలో సైనిక సిబ్బందికి భారత దేశం అవసరమైన శిక్షణ ఇచ్చింది. ఐక్య రాజ్య సమితి శాంతి రక్షణ చర్యల్లో పాలుపంచుకోవడం ద్వారా అఫ్రికా దేశాల్లో శాంతి పునరుద్ధరణకు భారత దేశం కీలక భూమిక పోషించింది.

ఇక లక్నో సదస్సు విషయానికి వస్తే,ఆఫ్రికా దేశాలు భారత దేశం రక్షణ ఉత్పత్తి రంగంలో సాధించిన ప్రగతిని గుర్తించాయి.అదే విధంగా పెరుగుతన్న ఉగ్రవాద సవాళ్ళ నేపధ్యంలో, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, రక్షణ రణంలో భారత దేశంతో విసృత సహకారాన్ని కోరాయి. ప్రజలకు జీవనోపాధి కలిపించడంలో సముద్రాలు, మహా సముద్రాల ప్రాధాన్యతను సదస్సు గుర్తించింది. సముద్ర రంగంలో సహకరాన్నిపెంచుకోవాలనీ సదస్సులో నిర్ణయించారు.మరో వంక భారత దేశం,ఇండియా-ఆఫ్రికా అభివృద్ధి భాగస్వామ్య ఒప్పందం ద్వారా, ఆఫ్రికా దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతికి సిద్దంగా ఉంచుతామని భారత దేశం వాగ్దానం చేసింది. భారత- ఆఫ్రికా రక్షణ సంబంధాలను మెరుగు పరచుకునేందుకు భారత ప్రధానమంత్రి నిర్దేశించిన 10 మార్గదర్శక సూత్రాలకు ఈ ప్రయత్నం మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఆఫ్రికా దేశాలతో భారత సంబంధాలను మరింతగా మెరుగుపరుస్తుంది.ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో, ఉత్తర ,పశ్చిమ ఆఫ్రికా దేశాలలో సాహేల్, గ్రేట్ లేక్ ప్రాంతలో అల్లర్లు విస్తరిస్తూనే ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా ISIS, నుస్రాత్- అల్- ఇస్లాం వాల్ ముస్లిమీన్ – JNIM- వంటి ఉగ్ర సంస్థలు ఆప్రాంతంలో పని చేస్తున్నాయి. అదే విధంగా పైరసీ, ఆయుధ దొంగల దోపిడీ, అక్రమ చేపల వేట, సరుకుల అక్రమ రవాణా, స్మగ్లింగ్, మడక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి సముద్ర నేరాలు హిందూ మహాసముద్ర ప్రాంతంలోని ఆఫ్రికా దేశాలకు సవాళ్ళు విసురుతూనే ఉన్నాయి.

సముద్ర రక్షణకు ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో,ఆ ముప్పును ఎదుర్కునేందుకు 2050 ఆఫ్రికా సమగ్ర సముద్ర రక్షణ ప్రణాళిక- AIM- పేర, ఆఫ్రికా సమూల సముద్ర వ్యూహాన్ని, ఆఫ్రికన్ యూనియన్ రూపొందించింది. ఇదొక అద్భుత, అద్వితీయ ప్రణాళిక అని చెప్పవచ్చును. ఎందుకంటే, సంప్రదాయంగా వస్తున్న సవాళ్ళను, సముద్ర ప్రమాదాలను తగ్గించడంతో పాటుగా ఆఫ్రికా సముద్ర ఆర్ధిక వ్యవస్థ సుస్థిర అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే, ఈ ప్రణాళిక అద్వితీయంగా నిలిచింది.

ఆఫ్రికా దేశాలతో భారత దేశ సంబంధాలు, ఆఫ్రికా దేశాలతో ఇతర దేశాల సంబంధాలకు భిన్నమైనవి. భారత – ఆఫ్రికా సంబంధాలు ఇతర దేశాలతో ఆఫ్రికా దేశాలకు గల సంబంధాల మధ్య పోలిక, పొంతన కుదరదు. ఆఫ్రికా దేశాలతో భారత సంబంధాలు పూర్తిగా సమ్మిళిత అభివృద్ధి బంధాలు. అంతే కాదు,అఫ్రికా ప్రాధాన్యతల ఆధారంగా బలపడిన బంధాలు.అందుకే లక్నో సదస్సులో ఆఫ్రికా దేశాల ప్రతినిధులు, భారత దేశాన్ని, భారత దేశం అందిస్తున్న స్నేహపూరిత, నిరాపేక్ష సంబంధాలను మెచ్చు కున్నారు.ఇటీవల భారత పొరుగు దేశం ఒకటి, దిజిబౌటీ పోర్టుకు సంబంధించి అప్పుల ఉబిలో ముంచే దౌత్యనీటి తీవ్ర విమర్శలు ఎదుర్కుంది.

భారత దేశానికి, హిందూ మహా సముద్ర తీర ఆఫ్రికా దేశాలతో పటిష్ట సముద్ర భద్రత వ్యవస్థ ఉంది. భారత దేశం పైరసీ వ్యతిరేక కార్యకలాపాలు, పర్యవేక్షణకు, మానవీయ, విపత్తు సహాయ కర్యకలాపలాను నిర్వహించేందుకు నావికా దళాలను పంపింది. ఆఫ్రికా దేశాల సైన్యాలతో బహరత దెస సైన్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. ఉగ్రవాదం, పైరసీల పరంగా ఎదురవుతున్న ఉమ్మడి సవాళ్ళకు భారత సేనలు రక్షణ కవచలా పనిచేస్తున్నాయి. ఇందుకోసమే, భారత ప్రభుత్వం కూడా ఆఫ్రికా దేశాలతో సంయుక్త సైనిక విన్యాసాలపై దృష్తి కేంద్రీకరిస్తోంది.

మేధో మధన సదస్సుగా సాగిన లక్నో సదస్సు, పరస్పర ప్రయోజనాలు, ప్రాధాన్యతలను అర్థం చేసుకునేందుకు ఎంతగానో ఉపకరించింది. రానున్న రోజుల్లో భారత - ఆఫ్రికా భాగస్వామ్య మరింత మెరుగులు దిద్దుకుని, మరింత అర్థవంతంగా ముదుకు సాగుతుందన్న ఆశలు వ్యక్తమయ్యాయి. సమానత్వం ఆధారంగా ఏర్పడిన భారత – ఆఫ్రికా భాగస్వామ్యం పారదర్శక భాగస్వామ్యం.



రచన: ఉత్తమ కుమార్ బిస్వాస్, డిఫెన్సు అనలిస్ట్

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన