ప్రాముఖ్యతను సంతరించుకున్న భారత్ యూరోపియన్ యూనియన్ వ్యూహాత్మక భాగస్వామ్యం

యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాల మండలితో చర్చలకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రసెల్స్ సందర్శించారు. యూరోపియన్ యూనియన్ high representative/ విదేశీ వ్యవహారాలు, భద్రతా విధాన వైస్ ప్రెసిడెంట్ Mr.Joseph Borrel Fontelles ఆహ్వానం మేరకు ఈ సందర్శన చోటుచేసుకుంది. 2019 డిసెంబర్లో నూతన కమిషన్ అధికార బాధ్యతలు చేపట్టిన దరిమిలా, యూరోపియన్ యూనియన్ కి తొలిసారి జరిపిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి పర్యటన ఇది.

యూరోపియన్ యూనియన్ హై రిప్రజంటేటివ్, ఇరవై ఏడు సభ్య దేశాల వ్యవహార మంత్రులు ఈ విదేశీ వ్యవహారాల మండలి - FAC ని రూపొందించారు. విదేశాంగ విధానం, రక్షణ, భద్రత, వాణిజ్యం, అభివృద్ధి సహకారం, మానవతా సాయం వంటి అంశాల పై వెలుపలి చర్యలకు ఈ మండలి బాధ్యత వహిస్తుంది. భారత విదేశీ విధాన ప్రాధాన్యాలు, ప్రాంతీయ, భౌగోళిక అవగాహనపై FAC తో డాక్టర్ జయశంకర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్యాలైన భారత్,European Union ల ఉమ్మడి విలువలపై ప్రధానంగా చర్చల్లో దృష్టి నిలిపారు. ప్రజాస్వామ్యం, బహుళ పాక్షిిికత, నియమ ఆధారిత order,
నియమాల ప్రాతిపదికన WTO తో అంతర్జాతీయ వ్యాపారం, సుస్థిరాభివృద్ధి లపై అభిప్రాయ మార్పిడి చోటు చేసుకుంది.

విదేశీ వ్యహారాలు భద్రతా విధానాల European Union High Representative Mr. Joseph Borrel Fontelles ఇటీవల భారత్ లో ఉన్నారు.Raisina Dialogue 2020 లో ఆయన పాల్గొన్నారు.భారత్,European Union ల సామాన్యతలను పునరుద్ఘాటిస్తూ ఆయన, ఇరుపక్షాలు,నిబంధనల ఆధారిత బహుపాక్షిక క్రమాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉన్న తరుణం లో WTO వివాద పరిష్కార విధానం భారత్,European Union, ఇతర ఆగ్నేయ ఆసియా దేశాలకు ఆందోళన కరంగా ఉందని , ఈ ప్రతిష్ఠంభనను వైతొలగించేందుకు యూరోపియన్ యూనియన్ ప్రతిపాదనలు చేసినట్లు Raisina Dialogue లో అన్నారు . ఈ సమస్యా పరిష్కారం, ఆచరణాత్మక పరిష్కారాలతో ముందుకు రావడం ఉభయ పక్షాలకు ప్రయోజనకరమని Fontelles అన్నారు..

సముద్ర చౌర్యం, సముద్ర వనరుల భద్రత నిర్వహణ వంటి సవాళ్ల ను ఎదుర్కొనేలా సముద్ర భద్రతను బలోపేతం చేయడం ప్రధానమైన అంశం.భౌగోళిక సమాజానికి ఈ బెడద పెను ముప్పుగా పరిణమించింది. సముద్ర భద్రత,సుస్థిరతలకు కలిసికట్టిగా పని చేయడం అనివార్యం. Horn of Africa , పశ్చిమ హిందు మహాసముద్రాలలో సముద్ర చౌర్యాన్ని భారత్ సహకారంతో ఎదుర్కొనే Operation Atlanta ఒక మంచి ఉదాహరణ.


భద్రత మొదలుకొని digital, వాతావరణ మార్పు వంటి విషయాల వరకు 2025 నేపథ్యం తో భారత్ యూరోపియన్ యూనియన్ ల వ్యూహాత్మక భాగస్వామ్యం పై ఒక నూతన road map రూపొందించాల్సిన ఆవశ్యకతను European Union High Representative ఉద్ఘాటించారు.
సాధారణ ప్రాధాన్యాలైన వాతావరణ సమస్యల పరిష్కారం, బహుపాక్షికత పరిరక్షణ,రక్షణ,భద్రత,అనుసంధానం,digital economy,వాణిజ్యం,పెట్టుబడులతో బాటు రక్షణ,భద్రత రంగాలలో ను, ఉగ్రవాద భూతాన్ని తరిమి కొట్టడం వంటి విషయాలలోను ఇరు పక్షాలు లోతుగా నిమగ్నమవాలి. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. Executive Vice President for European Green Deal Mr. Frans Timberland, Commissioner of Trade Mt. Phil Hogan, Commissioner for InternationalnPartnership Ms. Kutta Urpilainen లు వారిలో ఉన్నారు.


European Union 27 సభ్యదేశాల ప్రభుత్వాల European కౌన్సిల్ ప్రెసిడెంట్ Mr. Charles Michel ను కూడా Dr.Jaya Sankar కలిశారు.FAC తో తాను జరిపిన చర్చలు వివరాలను ఆయన President Michael కు తెలియజేసారు.

ఆయన తన Belgium సహచర మంత్రి Mr.Philippe Goffin ను కలిశారు. 2020 ఫిబ్రవరి నాటికి UNSC కి అధ్యక్షత వహించ నున్నందుకు అభినందించారు. ఉభయులకు ఆస క్తికరమైన ప్రాంతీయ, భౌగోళికాంశాలలో ద్వైపాక్షిక సందర్భంగా భారత్ బెల్జియం ల సహకారం పై ఇరువు మంత్రులు చర్చలు జరిపారు.

ఒక్క రోజు Brussels పర్యటనలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి నూతన యూరోపియన్ పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ సభ్యదేశాల, రాజకీయ బృందాల ప్రతినిధుల బృందం - MEPs తో సమావేశమయ్యారు.MEPs ఇది ఆయన రెండవ ముఖాముఖి .

రెండు వేల ఇరవై మార్చిలో జరగనున్న భారత్ యూరోపియన్ యూనియన్ సదస్సు ఇరు పక్షాల సంబంధాల పురోగమనానికి దోహదపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు .భారత్ యూరోపియన్ యూనియన్ భాగస్వామ్యం 2025 కోసం ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి సదస్సులో ఆమోదం పొందేందుకు ఒక ఒప్పందాన్ని కూడా సిద్ధపరచినట్లు భావిస్తున్నారు.Brexit తరువాత 27 సభ్యదేశాల యూరోపియన్ యూనియన్ తో భారత్ సంబంధాలు ప్రాముఖ్యత ను సంతరించుకున్నాయి.

రచన: పదం సింగ్ ఆకాశవాణి వార్తా విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన