మ్యూనిచ్ భద్రతా సమావేశం  2020కీలకాంశాలు 

జర్మనీ మ్యూనిచ్ లో గత వారం యాభై ఆరవ మ్యూనిచ్ భద్రతా సమావేశం జరిగింది .పశ్చిమ దేశాలలో విలువల, వ్యూహాత్మక ధోరణుల్లో విభేదాలు, అనిశ్చితుల వలన ఉద్భవించిన పాశ్చాత్య రాహిత్యం అనే భావన పై ఈ సమావేశం దృష్టి నిలిచింది. భౌగోళిక సమస్యల నుంచి, మిత్ర దేశాల నుంచి వాషింగ్టన్ తమను వేరు చేసుకుందని ఈ సమావేశంలో నాటో సెక్రటరీ జనరల్ Jens Stoltenberg పేర్కొన్నారు. అయితే యూరోపియన్ మనోభావాలకు ఆసరా ఇస్తూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అట్లాంటిక్ కూటమి అంత్యదశకు చేరుకోవడాన్ని ముఖ్యంగా ప్రస్తావించారు. పాశ్చాత్యం, ఆయన ప్రకారం గెలుపొందుతున్న దని, వాస్తవానికి కలిసి గెలుపు పొందుతోందని అన్నారు. నాటో ద్వారా యూరోపియన్ సరిహద్దుల పరిరక్షణకు వాషింగ్టన్ ప్రధాన భూమిక పోషిస్తోందని, అలాగే ఇస్లామిక్ స్టేట్ ని ఓడించేందుకు బహుళ జాతీయ ప్రయత్నానికి నాయకత్వం వహిస్తోందన్నారు. అంతర్జాతీయ సమాజం అన్న అభిప్రాయాన్ని అమెరికా తిరస్కరించిందని జర్మన్ అధ్యక్షుడు Frank Walter Steinmeier అనడమే కాక పొరుగు దేశాల,భాగస్వాముల పణంగా వ్యవహరిస్తోందని అన్నారు.ఫ్రెంచ్ అధ్యక్షుడుE mmanuel Macron కూడా పాశ్చాత్యం బలహీన పడుతున్నదనే హెచ్చరించారు.

నాటోకు మద్దతిస్తూ అధ్యక్షుడు మాక్రాన్ రక్షణ అంశాల్లో అమెరికా నుండి స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించారు. కొత్త సైనిక శక్తితో యూరోపియన్ వ్యూహం గురించి మాక్రాన్ దర్శనాన్ని సమావేశ అధ్యక్షుడు Ischinger స్వాగతించారు. రష్యా చర్యలపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించినప్పటికీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు రష్యాతో చర్చలను, అనుబంధాన్ని కొనసాగించుకోవాలని కోరారు. Donbass లో వైరాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఉక్రెయిన్ ను రెండు వేల ఇరవై ప్రమాదకర ప్రాంతాల్లో ఒకటిగా మ్యూనిచ్ భద్రతా సమావేశ నిర్వాహకులు పేర్కొన్నారు.

పశ్చిమ దేశాల ఆదర్శాలను సవాలు చేస్తున్నట్టు జర్మన్ రక్షణ మంత్రి Annegrer Kamo Karrenbauer గుర్తించారు. భద్రతను పెంచడానికి అంతర్జాతీయంగా సమన్వయ ప్రయత్నాల కోసం విజ్ఞప్తి చేస్తూ, ఆఫ్రికా sahel ప్రాంతంతో సహా విదేశీ మిషన్లలో జర్మనీ మరింత చురుగ్గా ఉండాలని కోరారు.

కాగా సమావేశం ఆద్యంతం అమెరికా, యూరప్ లు చైనా టెలీ కమ్యూనికేషన్స్ సంస్థ Huawei గురించిన విభేదాల దృష్ట్యా భేదాభిప్రాయం తోనే ఉన్నాయి. ఆ సంస్థను బీజింగ్ గూఢచారి గా అమెరికా భావిస్తోంది. పాశ్చాత్య మౌలిక సదుపాయాల్లో చొరబడటానికి చైనా పన్నిన దుర్మా ర్గపు వ్యూహానికి Huawei ని ఒక poster బిడ్డగా అమెరికా రక్షణ కార్యదర్శి ఎత్తి చూపేరు. అలాగే 5G రూపకల్పనలో ఆ సంస్థకు పరిమిత పాత్రను అనుమతించాలన్న తమ దేశపు నిర్ణయాన్ని బ్రిటన్ పునః పరిశీలించాలని హెచ్చరించారు. అయితే నాటో సంస్కరణల ఆవశ్యకత, ఐరోపా ఏకాభిప్రాయ విధానాల దృష్ట్యా, అమెరికా యూరప్ ల మధ్య విభేదాలు చొరబడే అవకాశాలను జర్మన్ విదేశాంగ మంత్రి Heiko Maas కొట్టిపారేశారు.

అమెరికా యూరప్ ల విభేదాల మధ్య ఒక ముఖ్యమైన పరిశీలన ఏమంటే దక్షిణ చైనా సముద్రంలో చైనా చర్యలు,మిలిటరీకరణ ల పై పశ్చిమ దేశాల ఏకగ్రీవ ఖండన.అయితే చైనా విదేశాంగ మంత్రి Wang Yi తమ దేశపు చర్యలను సమర్థించారు. తమ దేశం శాంతియుత అభివృద్ధికి నిలుస్తుందని, పాశ్చాత్య నమూనాకు నకలు చేయదని, అందుకు బదులు, ప్రపంచంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడటానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

వుహాన్ కరోనా వైరస్ వ్యాప్తిపై కూడా సమావేశాల్లో పాల్గొన్న వారు చర్చించారు. తమ ప్రభుత్వం ఈ వ్యాధి విషయంలో చేపడుతున్న చర్యలను ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి Win Gang ప్రశంసించారు. నియంత్రణకు సంబంధించి నిర్ధారణ కేసుల్లో ఒక శాతం మాత్రమే చైనా వెలుపల ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య విలువలను చాటి చెప్పడానికి ఉత్తమ మార్గం కాశ్మీర్ సమస్యను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించటం అని అమెరికా సెనేటర్ Lindsey Graham సమావేశం సందర్భంగా సూచించారు. దీనికి సమాధానంగా భారత ప్రజాస్వామ్యం ఆ సమస్యను స్వయంగా పరిష్కరించుకోగలవని భారత విదేశాంగ మంత్రి Dr.S. జయశంకర్ అమెరికా సెనేటర్ తో అన్నారు. డాక్టర్ జయశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి Mike Pompeo తో సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గావించబోయే భారత పర్యటన గురించి చర్చించారు. భారత మంత్రి సౌదీ,ఒమన్ విదేశాంగ మంత్రులతో కూడా ఈ సందర్భంగా సమావేశమయ్యారు.

పాశ్చాత్య కూటమి ఆలోచనపై ప్రపంచ నాయకుల భిన్నాభిప్రాయాలను ప్రతిబింబించిన మ్యూనిచ్ భద్రతా సమావేశం 2020 చాలా కీలకమైనది. ఇటువంటి వేదికపై అభిప్రాయాలు, బెదిరింపులు, సమస్యలపై చర్చలు చోటుచేసుకుంటాయి. ఏదేమైనప్పటికీ సాధారణ భద్రత, రక్షణ లపై సంయుక్త అభిప్రాయాలను పంచుకోవడం అంతర్జాతీయ సమాజానికి మరింత మేలు చేస్తుందని గుర్తుంచుకోవాలి. తదనుగుణంగా వాటిని సంయుక్తంగా పరిష్కరించడానికి ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా మార్చడానికి ఇటువంటి వేదికలు దోహదపడతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

రచన: డాక్టర్ సంఘమిత్ర శర్మ, యూరోపియన్ వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన