మరో మారు పాకిస్థాన్ కపట నాటకం
పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం 2008 ముంబై బాంబు దాడుల సూత్రం దారుడు, పాకిస్థాన్ స్థావరంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న జమాత్ - ఉద్ – దవా ,లష్కర్ –ఈ- తాయబ్ అధ్యక్షుడు, హాఫిజ్ సయీద్’కు 11సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడు అనే రెండు అభియోగాలపై సయీద్’కు న్యాయస్థానం జైలుకు పంపింది.పాకిస్థాన్ కౌంటర్ టెర్రరిజం డిపార్టుమెంటు (సీటీడీ), సయీద్ ఆయన అనుచరులపై, పంజాబ్ ప్రాంతంలోని విధ పట్టణాలలోని ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తునాడన్న ఆరోపణలపై మొత్తం 23 FIRలు నమోదు చేసింది.
“హాఫిజ్ సయీద్ ఆయన సన్నిహిత సహచరుడు జాఫర్ ఇక్బాల్’లను ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్నారన్న రెండు కేసులలో శిక్షించడం జరిగింది” అని పాకిస్థాన్ ప్రభుత్వ ప్రాసిక్యూటర్’ అబ్దుల్ రూఫ్ వాట్తో తెలిపారు. “రెండు కేసుల్లో కలిపి మొత్తం శిక్షాకాలం11 సంవత్సరాలు,అయితే, రెండు శిక్షలు ఒకే సారి అమలుతున్నందున, సయీద్ ఐదున్నర సంవత్సరాలు మాత్రమే జైల్లో ఉంటాడు” అని సయీద్ న్యాయవాది ఇమ్రాన్ గిల్ తెలిపారు. అలాగే, “మేము న్యాయస్థానం తీర్పుపై పై కోర్టులో అపీల్ చేస్తాం” అని కూడా న్యాయవాది తెలిపారు.
కాగా “ఉగ్రవాదాన్ని అంతమొందించే చర్యలకు మద్దతు ఇస్తామని ప్రపంచ దేశాలకు చేసిన వాగ్దానమ మేరకు ఎంతో కాలంగా పెండింగ్’లో ఉన్న కర్తవవ్యాన్ని నిర్వర్తిన్చినట్లు ప్రపంచానికి చూపేందుకే పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేస్తున్ననేరస్తుడు, ఐక్య రాజయ సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన, అంతర్జాతీయంగా ఉగ్రవాదిగా ముద్రపడిన హాఫిజ్ సయీద్’ను శిక్షించింది అని భారత దేశం పేర్కొంది.
అలాగే, “FATF ప్లీనరీకి ముందు పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి,ఈ నిర్ణయం ఏ మేరకు, ఎంత సమర్ధవంతంగా అమలవుతుంది అనేది చూడవలసి ఉంది. అలాగే, ఉగ్రవాడ సంస్థలు, ఉగ్రవాద కార్యకలాపాలకు పల్పడుతున్న వ్యక్తుల,ముంబై,పఠాన్ కోట సహా సరిహద్దు వెలుపల ఉగ్రదాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులపై కూడా వేగంగా చర్యలు తీసుకుంటుందా అనండి కూడా చూడవలసి ఉందని” భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
సయీద్’ ను అరెస్ట్ చేయడం ద్వార ఉగ్రవాద ముఠాలను అదుపులోకి తీసుకుని శిక్షించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందన్న తమ వాదనకు బలం చేకూరుతుందని పాక్ భావిస్తోంది. ముఖ్యంగా, పారిస్ స్థావరంగా గల ఫైనాన్షియల్ వాచ్ డాగ్ , Financial Action Task Force (FATF) కీలక సమావేసం వచ్చే వారంలో జరగనుంది. ఈ సమావేశంలో ఉగ్రవాదులకు అర్తిఅక్ సహాయం అందకుండా చేయడంలో విఫలమైన పాకిస్థాన్ పై ‘బ్లాక్ లిస్టు’లో ఉంచే అవకాశం ఉంది. అందుకే పాకిస్థాన్ ఇప్పుడు సయీద్ ను జైలుకు పంపింది.
ఇప్పటికే పాకిస్థాన్,FATA గ్రే లిస్టులో ఉంది. ఈ నేపధ్యంలో ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్’పై తీవ్ర వత్తిళ్ళు వస్తున్నాయి.బ్లాక్ లిస్టింగ్’లో పెడితే తీవ్ర ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోనవలసి వస్తుంది. అదే జరిగితే ఇప్పటికే కుంటినడక నడుస్తున్న పాక్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి పోతుంది.
FATA తదుపరి సమావేసంలో సయీద్ శిక్ష అంశాన్ని, గ్రే లిస్టు నుంచి పాకిస్థాన్ తొలిగించేందుకు ఈ కుంటిసాకు చర్య సరిపోతుందా అనేది పరిశీలించవలసి ఉంది.ఇతర దేశాలతో సమానంగా వైట్ లిస్టులో చేర్చవచ్చునా లేదా అనే విషయాన్ని కూడా FATA ఆలోచించవలసి ఉంటుంది.
చైనా, మలేషియా, టర్కీ మద్దతు ఇచ్చిన కారణంగానే,పాకిస్తాన్ను FATA బ్లాక్ లిస్టులో ఉంచలేదని, పాకిస్థాన్ విశ్లేషకులు బావిస్తున్నారు.అయితే, ఇప్పుడు గ్రేలిస్టు నుంచి బయట పడాలంటే పాకిస్థాన్ కు కనీసం 12 నుచ్న్హి 39 దేశాల మద్దతు అవసరం అవుతుంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెలలో భారత దేశంలో పర్యటించనున్నారు.ఈ నేపధ్యంలోగా కూడా సయీద్ శిక్షను చూడవలసి ఉంటుంది. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో పాకిస్థాన్ తీసుకుంటున్న చర్యల పట్ల అమెరిక అధ్యక్షుడు చాల సంతృప్తితో ఉన్నారు. అయితే, ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్’తో ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నందున అమెరికాకు పాకిస్థాన్ అవసరం ఉంది. తాలిబన్,పాకిస్థాన్ సైన్యం మధ్య ప్రేమబంధం ఉందనేది బహిరంగ రహస్యం. బీజింగ్ లో జరిగిన FATA సమావేశంలో పాకిస్థాన్ ఉగ్రవాదం పై పోరులో తీసుకున్న చర్యలను చూపించింది.చైనా, మలేషియా, టర్కీ దేశాలు పాక్’కు మద్దతుగా నిలిచాయి. అమెరికా కూడా పాకిస్తాన్ చూపిన ప్రగతి నివేదికను ప్రశ్నించ లేదు. అయినా, పారిస్ లో జరిగిన FATA మరో సమావేశంలో పాకిస్థాన్ 27 ప్రమాణాలకు గానూ, 22 ప్రమాణాలను సంతృప్తి పరచలేక పోయింది.
పాకిస్థాన్ చాలా కాలంగా అంతర్జాతీయ సమాజం ముందు వాస్తవాలను దాచి పెడుతోంది.వాస్తవానికి ఫాత గ్రే లిస్టులో ఉన్నప్పటికీ పాకిస్థాన్ ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తూనే ఉంది. కేవలం ఒక సంవత్సరం క్రితం జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామలో పాక్ ఉగ్రవాలదు 40 మంది సైనికులను పొట్టనపెట్టుకున్నారు. ఇది తీవ్ర పరిణామాలకు దారితీసింది.
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఒక విధానంగ ఉపయోగించుకుంటున్న తీరును చ్చేదించేందుకు అంతర్జాతీయ సమాజం సానుకూల పాత్రను పోషించవలసి వుంది. ఈ నేఅపధ్యంలో వాచీ వారంలో జరిగే FATA సమవేశంలో అమెరికా, UK, ఫ్రాన్స్, ఆస్టేలియా పోషించే పాత్ర కీలకం కానుంది.
రచన: కౌషిక్ రాయ్, AIR న్యూస్ అనలిస్ట్
Comments
Post a Comment