సౌదీ-ఖతార్ థావ్: ఎ ప్లే ఆఫ్ సాఫ్ట్ హావభావాలు
ఖతార్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తోందన్న ఆరోపణపై, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహరేన్ దేశాల కూటమి ఖతార్’తో దౌత్య సంబంధాలను తెగతెంపులు చేకున్న నేపధ్యంలో సౌదీ – ఖతార్ మధ్య తీవ్రంగా దెబ్బ తిన్న సంబంధాలు మెరుగవుతున్న సంకేతాలకు ఇటీవల జరిగిన 40వ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ –GCC- సర్వోన్నత సదస్సు వేదికగా నిలిచింది. రియాద్’లో జరిగిన GCC 2019 సదస్సు హాజరు కావాలని కోరుతూ, సౌది రాజు సల్మాన్ బిన్ అబ్డుల్లా అల్ సుద్, ఖతార్ ఎమిర్ షేక్ తమిన్ బిన్ హమద్ అల్ తనీకి వ్యక్తిగత ఆహ్వానం పంపారు.సౌదీ రాజు ఆహ్వానానానికి సానుకూలంగా స్పందించిన ఖతార్, ఆ దేశ ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా బిన్ నసర్ అల్ తనీ’ ని సదస్సులో పాల్గొనేందుకు పంపింది. 2017 అరేబియా ద్వీపకల్పంతో ఖాతార్’ సంబధాలు పూర్తిగా వేరు చేసే లక్ష్యంతో, సౌదీ అరేబియా, ఖతార్’ సరిహద్దుల పొడవునా 200 మీటర్ల వెడల్పు ‘సల్వా’ కాలువ తవ్వకానికి సంకల్పించిన దరిమిలా జరిగిన సదస్సులకంటే, 2019 సదస్సుకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించింది. ఉబాయ దేశాల మధ్య కరుగతున్న దూరానికి ఇదొక శుభ సంకేతం.
ఈ నేపధ్యంలో, ఉభయ దేశాలు చూపుతున్న సానుకూల స్పందనలు సౌదీ – ఖతార్ సంబంధాలు మెరుగావుతున్నట్లు కనిపిస్తోంది, ఈ సంవత్సరం మొదట్లో, ఖతార్ ప్రదాని సౌదీ అరేబియాలో పర్యటించారు.సౌదీలోని ARMMCO చమురు బావులపై దాడులు జరిగిన నేపధ్యంలో రక్షణ సదస్సు అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు. అలాగే, ఇటీవల దోహాలో జరిగిన గల్ఫ్ కప్ సాకర్ టోర్నమెంట్’లో సౌదీ అరేబియా, UAE, బహారిన్ పాల్గొన్నాయి. ఇది ఆ మూడు దేశాలు ఖతార్’తో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు సిద్దంగా ఉన్నాయనేందుకు సకేతంగా, సౌదీ అరేబియా యువరాజు, ఆ దేశ గూఢచారి విభాగం మాజీ అధిపతి తుర్కి అల్ –ఫైసల్ పేర్కొన్నారు. చమురు ఉత్పత్తిని దెబ్బతీసిన ARAMCOపై జరిగిన దాడితో సౌదీ మెత్తపదిందని అనుకోవచ్చును.అలాగే, ప్రాతీయ సమస్యలు, ప్రాతీయ పరిణామాల విషయంలో. ముఖ్యంగా ARAMCO దాడి విషయంలో అమెరికా అంటీ ముట్టనట్లు వ్యవహరించడంతో అమెరికాపై ఆధారపడడాన్ని తగ్గించుకుని, గల్ఫ్ ఐక్యతను బలోపేతం చేసుకోవాలనే సంకల్పం, GCC 2019లో వ్యక్తమైంది. అయితే, ఈ పరిణామాలు, ఈ ప్రకటనలు, హావభావ ప్రదర్శనలతో ఖతార్ సమస్య ముగింపుకు వచ్చిందని అనుకోలేము. UAE ఇంకా ఇప్పటికీ, ఖాతార్’ పై కన్నెర్ర చేస్తూనే ఉంది. వ్యతిరేకతను దాచుకోవడం లేదు. సదస్సులో పాల్గొన్న UAE విదేశాంగ శాఖ సహాయ మంత్రి, అన్వర్ గర్గాష్, ఖతార్ సంక్షోభానికి ఖతారే కారణమని, పరిష్కారం చూపవలసిన బాధ్యతకూడా ఆ దేశంపైనే ఉందని అన్నారు. అంతేకాదు. ఖతార్ సమస్య పరిష్కారానికి ఇంకా సమయం పడుతుందని అన్నారు.
బహరైన్ విదేశాంగ మంత్రి ఖలిద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, GCC సదస్సుకు ఖతార్ అమీర్ హాజరుకాకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్త పరిచారు. ఇది, ఖాతార్ సమస్య పరిష్కారం పట్ల ఆ దేశ అనాశక్తికి నిదర్శనమని అన్నారు.అయితే, ఖాతార్ విదేశాంగ మంత్రి మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ బిన్ జాస్సిం అల్ తానీ, మాత్రం పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవంతో ఇతర దేశాల అంతర్జాతీయ వ్యవహారాల్లో జోక్యం చేకొక పోవడం అనే ప్రాతిపదికన, బేషరతు చర్చలకు తమ దేశం సిద్దంగా ఉందని పునరుద్ఘాటించారు. అలాగే, స్నేహ సంకేతంగా, ఖతారీ రాజు, UAE అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్’ కు ఆయన సోదరుని మృతి పట్ల విచారం వ్యక్త పరుస్తూ సంతాప సందేశం పంపారు. గత అక్టోబర్’లో బహరేన్ పాల్గొన్న హ్యాండ్ బాల్ గేమ్’ కు కూడా ఆయన హాజరయ్యారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా సంప్రదాయ అరబ్ ప్రపంచంలో ప్రభావం చూపుతాయి.అయితే, GCCలో విబేధాలు, అమెరికా విధించిన ఆర్థిక అంక్షల నుంచి బయట పడేందుకు మరో ప్రాతీయ శక్తి ఇరాన్, కు అనుకూలంగా కనిపిస్తున్నాయి.
ఈ విషయంలో భారత దేశం మొదటి నుంచి కూడా ఒకటే మాట మీదుంది. ఖతార్ సమస్య పరిష్కారం కావాలనే కోరుకుంటోంది. పర్షియన్ గల్ఫ్’లో శాంతి, సుస్థిరతలకు ఖతార్ సమస్య పరిష్కారం కీలకమని భారత దేశం గట్టిగా విశ్వసిస్తోంది. సౌదీ అరేబియాలో 3.2 మిలియన్ల మంది, ఖతార్’లో 0.6 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు. కాబట్టి ఆ దేశాలలోని భారతీయుల భద్రత భారత దేశానికీ అత్యంత కీలకం. అలాగే, వాణిజ్యం, ఇంధనం, భారతీయ హాజ్ యాత్రికుల భద్రత దృష్ట్యా కూడా సౌదీ అరేబియాతో సంబంధాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరో వంక భారత దేశంతో దీర్ఘకాల ఇంధన ఒప్పందం కుదుర్చుకున్నఏకైక దేశం ఖతార్. అందుకే భారత దేశం ఉభయ దేశాల సంబంధాల విషయంలో ఉభయతారకంగా సంతతుల్యతను పాటిస్తుంది. నాలుగు దేశాల కూటమి ఖతార్’ ను ఏకాకిని చేసేందుకు ప్రయత్నించిన సమయంలో అంతర్జతీయ ప్రమాణాల పరిధిలో, పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవం ప్రాతిపదికన, ఇతర దేశాల జోక్యం లేకుండా నిర్మాణాత్మక చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని, భారత దేశం సూచించింది. ఖతార్ సమస్య పరిష్కారం, ప్రాంతీయ,ప్రపంచ సుస్థిరతకు ఎంతో కీలకం. అంతే కాదు, సౌదీ- ఖతార్’ ల మధ్య తరుగుతున్న దూరం ప్రాంతీయంగానే కాదు భారత దేశానికి కూడా సానుకూల సంకేతం.
రచన: Dr.లక్ష్మిప్రియ,పరిశోధన అనలిస్ట్,IDSA
Comments
Post a Comment