పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు

భారత విదేశీ మారక నిల్వలు భారీగా పెరిగి 2019 డిసెంబర్ 20 నాటికి ఆల్ టైమ్ హై కి చేరుకుని 455 బిలియన్ల అమెరికా డాలర్లుగా వున్నాయి. 2019 మార్చి నాటి నిల్వలు 412 బిలియన్ డాలర్లతో పోలిస్తే చెప్పుకోదగ్గ స్థాయిలో అధికం. ఫోరెక్స్‌ నిల్వలు పెరగడానికి ప్రధాన కారణం - విదేశీ కరెన్సీ ఆస్తులు - FCA పెరుగుదలు. 2019 మార్చితో పోలిస్తే FCA పదిశాతం పెరిగింది. అమెరికా డాలరు, యూరో, పౌండ్ స్టిర్లింగ్, జపాన్ ఎన్ వంటి విదేశీ కరెన్సీలతో FCAను నిర్వహిస్తారు. ఆర్.బి.ఐ చేసే విదేశీ కరెన్సీ క్రయవిక్రయాల మూలంగా ప్రధానంగా - FCAలో హెచ్చు తగ్గులు జరుగుతూ వుంటాయి. విదేశీ మారకం పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వానికి విదేశాల నుంచి వచ్చే నిధులు వంటి వాటి ద్వారా కూడా FCAలో హెచ్చు తగ్గులు ఏర్పడుతూ వుంటాయని - ఆర్.బి.ఐ తన నివేదికలో తెలిపింది.


ఫోరెక్స్‌ కు బంగారం, ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు - SDR, IMF లో RTP ద్వారా నిధులు చేరుతూ వుంటాయి.


మొత్తం ఫోరెక్స్ నిధుల‌లో FCA వాటా అత్య‌ధికంగా 93 శాతం వుంటుంది. బంగారం వాటా 6 శాతం దాకా వుంటుంది. విదేశీ మార‌క నిల్వ‌ల డిమాండ్ ఆర్థిక వ్య‌వ‌స్థ స‌ర‌ళ‌త్వం, లిక్విడిటీ అవ‌స‌రాలు త‌దిత‌ర అంశాల‌పై ఆధార‌ప‌డి వుంటుంది.


ఆర్‌.బి.ఐ చ‌ట్టం - 1934 ఆధారంగా దీని నిర్వ‌హ‌ణ జ‌రుగుతూ వుంటుంది. ఫోరెక్స్ నిల్వ‌ల‌కు ఆధార‌మైన వాటిలో హెచ్చు త‌గ్గుల‌ను ప‌రిశీలించాలంటే క‌రెంట్ అకౌంట్ వాణిజ్య లోటు, క్యాపిట‌ల్ అకౌంట్ లో చెల్లింపుల‌ను ప‌రిశీలించాల్సి వుంటుంది.


క్యాపిట‌ల్ అకౌంట్ లో రెండు ప్ర‌ధాన‌మైన అంశాలు విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు (FDI)విదేశీ ఫోర్ట్ ఫోలియో పెట్టుబ‌డులు (BOP) ప‌ట్టిక‌. ఫారెన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్ట్ మెంట్ లో ప్ర‌ధాన‌మ‌న‌వి - విదేశీ మ‌దుప‌రుల పెట్టుబ‌డులు, NRI డిపాజిట్లు, స్వ‌ల్ప‌కాలిక రుణం, విదేశీ స‌హాయం, విదేశీ అప్పులు వంటివి. ఇటీవ‌ల కాలంలో ఫోరెక్స్ నిల్వ‌లు పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు మెరుగుప‌డిన వాణిజ్య‌లోటు, FDI, FII ల పెరుగుద‌ల‌.


దిగుమ‌తుల స‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌పైన ఫోరెక్స్ నిర్వ‌హ‌ణ ఆధార‌ప‌డి వుంటుంది. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో దిగుమ‌తుల ఫోరెక్స్ సర్దుబాటు 9.6 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది. ప‌రిశీలించాల్సిన మ‌రో కీల‌క అంశం ఏమిటంటే మ‌న ఫోరెక్స్ నిల్వ‌లు స్థిరంగా వుంటున్నాయా... ఒడిదుడుకుల‌ను ఎదుర్కుంటున్నాయా అన్న‌ది. ఫోరెక్స్ నిల్వ‌ల‌కు నిధులు స‌మ‌కూర్చే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్ట్ మెంట్ స్వ‌ల్ప‌కాలిక విదేశీ రుణాల వాటా అధికంగా వుంటే - ఫోరెక్స్ నిల్వ‌లు స్థిరంగా వుండ‌వు.


విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్ట్ మెంట్ ను - హాట్ మ‌నీ గా పిలుస్తూ వుంటారు. వివిధ దేశాల్లోని వ‌డ్డీ రేట్ల వ్య‌త్యాసానికి అనుగుణంగా హాట్ మ‌నీ ఒక దేశం నుంచి మ‌రొక దేశానికి త‌ర‌లిపోతూ వుంటుంది. మ‌న దేశంలో వ‌డ్డీ రేట్ల కంటే ఇత‌ర దేశాల్లో వ‌డ్డీరేట్లు అధికంగా వుంటే హాట్ మ‌నీ అక్క‌డికి త‌ర‌లిపోతుంది. 


ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ మాంద్యంలో వుండ‌గా - భార‌త్ దేశీయ మార్కెట్ మంద‌గ‌మ‌న స్థితిలో ఫోరెక్స్ నిల్వ‌లో పెరుగుద‌ల ఒక వైచిత్రిగా భావించాలి. ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వస్థ మంద‌గ‌మ‌నాన్ని దృష్టిలో వుంచుకుని - ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌ను దీర్ఘ‌కాలిక లక్ష్యంతో ప్ర‌భుత్వం చేప‌డుతుంద‌ని - తాత్కాలిక ఫోరెక్స్ పెరుగుద‌ల ఆధారంగా కాద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోది స్ప‌ష్టం చేశారు. 2020 బ‌డ్జెట్ కు రోజులు ద‌గ్గ‌ర‌వుతున్న త‌రుణంలో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ పుంజుకునేందుకు ప్ర‌భుత్వం త‌గు చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ప్ర‌తి ఒక్కరు భావిస్తున్నారు.



రచన : డాక్టర్ లేఖ.ఎస్.చక్రవర్తి, NIPFP ప్రొఫెసర్

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన