మతపరమైన వివక్ష గల దేశాల జాబితాలో పాకిస్తాన్ ను చేర్చిన అమెరికా
మత పరమైన వివక్ష గల దేశాలలో ఒక దేశంగా పాకిస్తాన్ ను అమెరికా గుర్తించింది. ప్రత్యేక ఆందోళనకర దేశాలుగా మయన్మార్, చైనా, ఎరిట్రియా, ఇరాన్, ఉత్తర కొరియా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, తజికిస్తాన్, టర్కిమెనిస్తాన్ దేశాలను అమెరికా నిర్ధారించింది.
అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం 1998 కింద అమెరికా ఈ నిర్ధారణ గావించింది. మత స్వేచ్ఛ ఉల్లంఘన కొనసాగుతున్న, సహిస్తున్న, దేశాలుగా ఈ జాబితాలోని దేశాలను వర్గీకరించింది.అమెరికా విధించే ఆంక్షలతో సహా మరిన్ని చర్యలను ఈ జాబితాలోని దేశాలు ఎదుర్కొంటాయి.
అయితే ఇలా పాకిస్తాన్ పై ముద్ర వేయడం కొన్ని దేశాలను గురి చూసి ఎంపిక చేశారు అనడాన్ని ప్రతిబింబిస్తుందని, మత స్వేచ్ఛను పెంపొందించేందుకు దోహద పడదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అన్నది.
రాజ్యాంగపరమైన పరిరక్షణ కింద అన్ని మతాల ప్రజలు మత స్వేచ్ఛను అనుభవిస్తారని, బహుళ మతాలతో కూడిన దేశం పాకిస్తాన్ అని ఆ దేశ విదేశాంగ కార్యాలయం అన్నది. తమ తమ మతాలను ప్రజలు స్వేచ్ఛగా అనుసరించేందుకు తమ కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలు సమగ్ర ప్రయత్నాలు చేశాయని తెలిపింది, మైనారిటీల ప్రార్థనా స్థలాల భద్రతను పవిత్రతను నిర్దేశించేది గా తమ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ గణనీయమైన తీర్పులిచ్చిందని అన్నది.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభిప్రాయం ప్రకారం అమెరికాతో సహా అంతర్జాతీయ సమాజంతో మతపరమైన స్వేచ్ఛకు సంబంధించిన అంశాల అభివృద్ధికి పాకిస్తాన్ నిమగ్నమై ఉంది. భౌగోళికంగా మత స్వేచ్ఛకు చెందిన పరస్పర ప్రయోజనాలను పెంపొందించే ఉద్దేశ్యంతో అంతర్జాతీయ మత స్వేచ్ఛ అమెరికా రాయబారి సెనేటర్ శామ్యూల్ బ్రౌన్ బ్యాక్ పాకిస్తాన్ తో చర్చలకు ఈ ఏడాది ప్రారంభంలో ఆ దేశాన్ని సందర్శించారు. అయితే ఈ నిర్మాణాత్మక చర్యలను విస్మరించటం శోచనీయమని పాకిస్తాన్ అన్నది.
భారత్ ను మత స్వేచ్ఛను ఉల్లంఫ్గించిన దేశంగా పేర్కొన్నది. ఆ దేశాన్ని విస్మరించడం ద్వారా ఈ ప్రక్రియ పక్షపాత ధోరణి వ్యక్తమవుతున్నదని ఇస్లామాబాద్ అన్నది .
కాశ్మీరీలతో భారత్ వ్యవహరించే తీరు, జమ్మూ కశ్మీరులో ప్రాథమిక హక్కులను భారత్ దీర్ఘకాలంగా అణచివేయటం వంటి చర్యలపై డెబ్బై మందికి పైగా అమెరికా శాసనకర్తలు బాహాటంగా ఆందోళన వెలిబుచ్చారని, అమెరికా కాంగ్రెస్ రెండు పర్యాయాలు ఈ అంశంపై విచారణ జరిపిందని పాకిస్తాన్ అన్నది. అయితే వాస్తవం ఏమిటంటే మూడు వందల డెబ్బై అధికరణ రద్దు, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భావం చెందిన దరిమిలా, అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. 370 వ అధిక రణం పై భారత్ చర్యను పాకిస్తాన్ సన్నిహిత దేశాలు కూడా విమర్శించాయి.
భారత్ అంతర్గత వ్యవహారాలపై వాషింగ్టన్లో పాకిస్తాన్ విమర్శలు గుప్పించింది. భారత్లో మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు హింసకు గురవుతున్నారని ఆరోపించింది .అయితే వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు.
భారత్ ప్రతిపాదించిన జాతీయ పౌరుల పుస్తకం ఎన్ఆర్సి, ఇటీవల రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాల పై పాకిస్తాన్ అనవసర వ్యాఖ్యలు చేస్తుంది. ప్రజలపై వివక్ష చూపుతున్న భారత ప్రభుత్వ చర్యలకు తాజా ఉదాహరణలని, మతం ప్రాతిపదికన సమాజాన్ని విభజించేందుకు దారి తీసే చర్యలని అన్నది.
ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ల నుండి మతపరమైన హింసకు గురైన వారికి భారత పౌరసత్వం ఇచ్చే ఉద్దేశం తో మాత్రమే పౌరసత్వ సవరణ చట్టాన్ని రూపొందించినట్లు భారత ప్రధానమంత్రి, హోం మంత్రి స్పష్టం చేశారు. జాతీయ పౌరుల జాబితా చర్చ రీతిలో కూడా లేదు.
పాకిస్థాన్లో మతపరమైన మైనారిటీల పరిస్థితి గురించి ప్రపంచమంతా తెలుసనున్నది గమనార్హం. ఆ దేశ జనాభా లో 5 శాతం కంటే వారు తక్కువగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి,పౌరసమాజం నుంచి వారు వివక్షకు గురవడమే కాక,వారిని గూఢచారులుగా,దేశ ద్రోహులుగా కూడా చిత్రీకరిస్తున్నారు. మతపరమైన మైనారిటీలకు పాకిస్థాన్ లో స్వేచ్ఛ లేదు.ఏళ్లతరబడి హిందువులు,సిక్కులు, క్రిస్టియన్ లు వంటి మైనారిటీల ప్రార్ధనాస్థలాల నెన్నిటినో అపవిత్రం గావించారు.
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నయా పాకిస్తాన్ రూపొందిస్తానని వాగ్దానం చేసినప్పటికి, పదవిబాధ్యతలు చేబట్టి 18 నెలలు గావిస్తున్నప్పటికి, అది వాస్తవ రూపం దాల్చలేదు. ఇటీవల దైవదూషణ కు పాల్పడిబట్టు ఆరోపణకు గురై నిర్దోషిగా రుజువు గావించబడిన క్రైస్తవ మహిళ అసియాబీబీ కుటుంబ సభ్యులు తమపై ప్రతీకారం తీర్చుకుంటారనే భయం లో మగ్గుతున్నామన్నారు.
ఇస్లామాబాద్ తమ ప్రజలకు ప్రార్థన హక్కుల తోబాటు ప్రాధమిక హక్కులనన్నిటిని కల్పించి పరిపక్వతను, సంయమనాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంది.లేకుంటే హింసకు గురవుతున్న మైనారిటీలున్న దేశాల జాబితాలో ఆ దేశం కొనసాగుతూనే వుంటుంది.
రచన : పదం సింగ్, ఆకాశవాణి వార్తా విశ్లేషకులు

Comments
Post a Comment