భారత్ మాల్దీవుల మధ్య 6వ సంయుక్త కమీషన్ సమావేశం
భారత్, మాల్దీవుల మధ్య 6వ సంయుక్త కమీషన్ - JCM సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్ షహీద్, భారత విదేశాంగ మంత్రి డా.జయశంకర్ అధ్యక్షత వహించారు. భారత్, మాల్దీవుల మధ్య గల ద్వైపాక్షిక సంబంధాల పూర్తి స్థాయి సమీక్షకు ఈ సమావేశం అవకాశం కల్పించింది.
మాల్దీవులలో సోలిహ్ ప్రభుత్వం ఏర్పడిన తరువాతి సంవత్సరకాలంలో - ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంపొందించుకునేందుకు - అక్కడి ప్రజాస్వామ్య ప్రక్రియ దోహదపడింది. అభివృద్ధి సహాయం అందించటం ద్వారా మాల్దీవులలో సామాజిక అభివృద్ధితో పాటూ, సముద్ర యానం, భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇరుదేశాలు ప్రయత్నిస్తున్నాయి. మాల్దీవుల్లో అధ్యక్ష ఎన్నికల అనంతరం భారత్ 1.4 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజిని ఆ దేశానికి ప్రకటించింది. దీనితోపాటు, 5.6 మిలియన్ల డాలర్ల రుణ వితరణ, సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులకు 800 మిలియన్ల డాలర్లు, కీలక మౌలిక వసతి ప్రాజెక్టులకు ప్రకటించారు. ఈ సహాయ ప్రాజెక్టులు మాల్దీవులలోని వివిధ ద్వీపాల అభివృద్ధికి దోహదపడుతుందని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది.
ద్వైపాక్షిక సంబంధాల సహకారాల విషయంలో భద్రతా సహకారం కీలకంగా మారింది. సముద్ర జలాల భద్రతను మరింత పెంచేందుకు భారత్ తన తీరరక్షణ నౌక కామ్యాబ్ ను బహూకరించింది. మాల్దీవుల జాతీయ రక్షణ దళాల వసతుల కల్పన, శిక్షణ తీర ప్రాంతాల నిఘా సహకారంలో వున్నాయి. సంయుక్త కమీషన్ సమావేశంలో ఇరు దేశాలు సంయుక్త కార్యాచరణ గ్రూపును సాధ్యమైనంత త్వరలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కునేందుకు, హింసాత్మక తీవ్రవాదాన్ని అడ్డుకునేందుకు ఈ గ్రూపును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
తీవ్రవాదాన్ని ఎదుర్కునేందుకు మాల్దీవులు అనేక చర్యలు చేపట్టింది. సిరియాను యుద్ధ ప్రాంతంగా ప్రకటించి, ప్రభుత్వ అనుమతి లేకుండా సిరియాకు వెళ్ళడం శిక్షార్హమైన నేరంగా చేస్తూ - ఉగ్రవాద నిరోధక చట్టానికి సవరణలు చేసింది. ఇస్లామిక్ స్టేట్ (IS) అల్ ఖైదాలతో సంబంధాలు పెట్టుకునే వారిపై కేసులు నమోదు చేయాలని ప్రెసిడెన్షియల్ కమీషన్ కోరుతోంది.
మాల్దీవుల పౌరుడైన మహ్మద్ అమీన్ ఆ దేశ తొలి ఉగ్రవాద నాయుకుడిగా అమెరికా ప్రకటించింది. మాల్దీవుల్లోని ప్రముఖ పాత్రికేయులు, బ్లాగర్ల హత్యలో పాత్ర ఉందని భావిస్తున్న కనిపించకుండా పోయిన మహ్మద్ మజీద్, సోమిల్ మహ్మద్‌లను అల్ షిదా సంబంధిత తీవ్రవాదులుగా ప్రెసిడెన్షియల్ కమిషన్ ప్రకటించింది. 2014 జనవరి నుంచి ఆదేశంలో 188 మత ప్రేరిత ఉగ్రవాద కేసులు నమోదయ్యాయి. ఇరుదేశాలప్రజల మధ్య సంబంధాల పెంపుదల డిజిటల్ అనుసంధానం వంటివి ద్వైపాక్షిక సంబంధాలలో ప్రాధాన్యమైనవి.
రూపే వ్యవస్థను తీసుకునేందుకు సంయుక్త కమిషన్ సమావేశంలో అంగీకరించారు. భారత ఆర్థిక సహాయంతో హల్ హుమ్లేలో క్రికెట్ స్టేడియం నిర్మాణం పురోగతిని కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. 6వ JCM లో భారత ఎన్నికల సంఘంతో మాల్దీవుల ఎన్నికల సంఘం రెండు MOU లను కుదుర్చుకుంది. నేర పూరిత వ్యవహారాల్లో పరస్పర న్యాయసహకారం ఒప్పందంపై కూడా JCM లో అవగామన కుదిరింది. మాల్దీవుల విదేశాంగ మంత్రి భారత ప్రధానమంత్రిని కలుసుకున్నారు. JCM ద్వారా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు వివిధరంగాల్లో మరింత పటిష్టమై ముందుకు సాగగలవన్న ఆశాభావాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోది వ్యక్తం చేశారు.
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలలో గత సంవత్సరం ఎంతో ఫలవంతమైనది. ఈ కాలంలో అనేక ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి. విశ్వాసం పెంపొందించే వివిధ రంగాల్లో భారత్ తో చేతులు కలిపేందుకు మాల్దీవులు సంసిద్ధతను వ్యక్తం చేసింది. మాల్దీవుల్లోని రాజకీయ స్థిరత్వం కూడా ఇందుకు దోహదం చేస్తోంది. నాలుగు సంవత్సరాల తరువాత 6వ JCM జరిగింది. కాగా ఇది ఇరుదేశాల సంబంధాలను మరింత పటిష్ట పరిచేందుకు దోహదపడింది. కుదురిన ఒప్పందాల త్వరితగతి అమలుకు ఈ రెండు పొరుగు దేశాలు కృషి చేయాల్సి వుంటుంది. ప్రస్తుతం పెద్దగా అమలులోని సార్క్ ద్వారా ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించేందుకు తిరిగి కృషి చేయాలని మాల్దీవులు భావిస్తోంది.
ఈకారణంగా ఇరు దేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ స్థాయిలో కలిసికట్టుగా పనిచేసి సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం వుంది. 7వ సంయుక్త కమిషన్ సమావేశాలు 2021లో మాల్దీవుల్లో జరుగుతాయి.
రచన : డాక్టర్ ఎమ్.సమత, హిందూమహాసముద్ర ప్రాంత వ్యవహారాల కీలక విశ్లేషకులు.

Comments
Post a Comment