భారత్ - పసిఫిక్ ప్రాంత 1.5 సంప్రదింపులు
భారత్ - పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛా ప్రాంతంగా మారాలన్న భౌగోళిక వాదన వినపడుతున్న తరుణంలో న్యూఢిల్లీ 1.5 రెండు దారుల, 6వ హిందూ మహాసముద్ర సంప్రదింపులు, 11వ ఢిల్లీ సంప్రదింపులను నిర్వహించింది. స్వేచ్ఛాపూరిత, నింబంధనలకు లోబడిన ఇండో - పసిఫిక్ ప్రాంత ఏర్పాటుపై చర్చలు దీని ప్రధాన ఉద్దేశం. 2018లో షాంగ్రిలా సంప్రదింపులకు అనుగుణంగా, ఇండో - పసిఫిక్ పై ఆసియా దృక్పథాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఇది జరిగింది. గల్ఫ్, ఆఫ్రికా దేశాలతో పాటూ, తూర్పు హిందూ మహాసముద్రం, పశ్చిమ సముద్రంతో కూడిన ఇండో - పసిఫిక్ ప్రాంతంపై భారత్ దృక్పథాన్ని ఈ సమావేశంలో భారత్ విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ వివరించారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఇందులో భాగాస్వామ్యులైన దేశాలన్నిటి అభిప్రాయాలను, తెలుసుకుని, సహకార స్ఫూర్తితో ముందుకు సాగాలన్నది ప్రధాన ఉద్దేశం. ఇండో - పసిఫిక్ సముద్ర సంప్రదింపులను భారత్ నవంబర్ 2019లో ప్రారంభించింది. సముద్ర జలాల పరిరక్షణ, వాటి పర్యావరణ రక్షణ, సముద్ర వనరుల సమగ్ర వినియోగం వంటి అంశాలను చర్చించి - ఒక సహకార వేదికను రూపొందించుకోవాలన్నది ప్రధాన ఉద్దేశం.
అంతేకాకుండా స్థిరమైన మౌలిక వసతుల కల్పన, ప్రాంతీయ అనుసంధానం, అందుకు అవసరమైన నిధులు, వంటి వాటిని చర్చించి భాగస్వామ్య దేశాల సహకారంతో అవకాశాలు కల్పించాలన్నది కూడా దీని ఉద్దేశం. ఇండో - పసిఫిక్ ప్రాంతంలో సంబంధాలు మెరుగుపరుచుకోవడం, మౌలిక వసతుల కల్పన వంటి పలు అంశాలను కూడా చర్చించారు.
ప్రాంతీయ సంస్థలైన IORA, ఆసియాన్, బంగాళాఖాతం ప్రాంతం, బిమ్స్ టెక్ వంటి వాటి మధ్య సయోధ్య కుదిరేందుకు గల అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం వుందని - ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (IORA) సెక్రటరీ జనరల్ డాక్టర్ నోయూవుయో నోక్ వీ ప్రతిపాదించారు. ఏకాభిప్రాయం, సార్వభౌమిక, సమానత్వం, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ అనే IORA ప్రతిపాదిత మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా కలసి పయనించాలన్నది ప్రధాన లక్ష్యం. ప్రధాన శక్తుల మధ్య శతృభావం, రక్షణాత్మక విధానాలు, విశ్వాసరాహిత్యాల ధోరణుల నేపథ్యంలో ఇండో - పసిఫిక్‌పై ఆసియాన్ దృక్పథంలోని సకారాత్మక ఆలోచనలను ఇండోనేసియా విదేశాంగ మంత్రి రెంటో వివరించారు.
స్వేచ్ఛాయుత బహుళ వాణిజ్య వ్యవస్థ ఈ ప్రాంతంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇండో - పసిఫిక్ ప్రాంత వ్యూహాత్మక స్థానానికి అనుగుణంగా - ఈ ప్రాంతంలో అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా కార్యాచరణ వుండాలని రెంటో పేర్కొన్నారు.
40 శాతం ప్రపంచ వాణిజ్యం, 61 శాతం ముడి చమురు రవాణా 24 ట్రిలియన్ డాలర్ల సముద్ర ఉత్పత్తులను దృష్టిలో వుంచుకుని, సముద్ర జలాల వినియోగంలో ఘర్షణ ధోరణలు లేకుండా సహకారంతో సాగాలని రెంటో అన్నారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ - ఆసియాన్ సహకార స్ఫూర్తి ప్రతిబింబించాల్సిన అవసరం వుందన్నది చర్చల సారాంశం. సముద్ర జలాల ఆర్థిక సహకారంతో పాటూ, మౌలిక వసతులు, అనుసంధాన ప్రాజెక్టులు కూడా కీలకమైనవి. 2020 తాము నిర్వహించే ఇండో - పసిఫిక్ మౌలిక వసతుల, అనుసంధాన సదస్సుకు భారత్ ను ఇండోనేసియా ఆహ్వానించింది.
సాంస్కృతిక, చారిత్రాత్మక సంబంధాలకు అతీతంగా ఇండో - పసిఫిక్ సమాజాన్ని ఏర్పాటు చేసుకోవటం అసలైన సవాలు.
స్వేచ్ఛ, సమ్మిళిత, నిబంధనల ఆధారిత వ్యవస్థను ఇండో - పసిఫిక్ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడానికి 1.5 మార్గ సంప్రదింపులు దోహదపడతాయి.
రచన - టిట్లిబసు, తూర్పు, ఆగ్నేయ ఆసియా వ్యూహాత్మక విశ్లేషకులు.
Comments
Post a Comment