పొరుగు దేశాల అల్పసంఖ్యాక శరణార్ధులకు పౌరసత్వం కలిపించడమే ‘ పౌరసత్వ చట్ట సవరణ బిల్లు’ లక్ష్యం
దేశంలో నిర్లక్ష్యానికి గురమవుతున్న పొరుగు దేశాల శరణార్ధులకు పౌరసత్వ హక్కులను కల్పించే లక్ష్యంతో రూపొందించిన పౌరసత్వ సవరణ బిల్లు - క్యాబ్- ను భారత ప్రభుత్వం పార్లమెంట్’ లో ప్రవేశ పెట్టింది. విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. లోక్ సభలో బిల్లు భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. అయితే, పొరుగు దేశం పాకిస్థాన్, బిల్లుకు వ్యతిరేకంగా నోరు పారేసుకుంది. నిజానికి, తమ దేశంలో మైనారిటీలను నామరూపాలు లేకుండా తుడిచేసిన పాక్’ కు భారత దేశంలోని మైనారిటీల గురించి మాట్లాడే, నైతిక హక్కు లేదు. దేశ విభజన సమయంలో పాక్’ జనాభాలో 23.5 శాతం ఉన్న, మైనారిటీలు, తరిగి తరిగి చివరకు 3.5 శాతానికి చేరుకున్నారు.
ఉభయ దేశాలలో మైనారిటీల రక్షణకు నెహ్రూ – లియాకత్’ ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని, పాకిస్థాన్ ఏ నాడూ పట్టించుకోలేదు. ఫలితంగా పాక్’ లో క్రమంగా మైనారిటీల సంఖ్య తగ్గిపోయింది. వివిధ మతాలకు చెందిన మైనారిటీలు దేశం వదిలి భారత దేశం చేరుకున్నారు. బంగ్లాదేశ్’ జనాభాలో 1971 నాటికి, 21.3 శాతం ఉన్న మైనారిటీల జనాభా, ఇప్పుడు కేవలం 8.5 శాతానికి పడిపోయింది. మరో వంక, భారత దేశంలో దేశ విభజన నాటికి జనాభాలో 9.8 శాతం మాత్రమే ఉన్న మైనారిటీలు క్రమంగా పెరుగుతూ వచ్చారు. ఇది, భారత దేశం, భారత పొరుగు దేశాలలో మైనారిటీల పరిస్థితి మధ్య గల వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తుంది.
దేశ విభజన అనతరం,పాకిస్థాన్ ఆ దేశంలోని మైనారిటీల ఓటు హక్కును రద్దు చేసేందుకు అనేక చట్టాలు చేసింది. ఎన్నికలలో మైనారిటీల విడదీసి, వారి ప్రాధాన్యతను తగ్గించేందుకు, ప్రత్యేక ఓటింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. మైనారిటీలు అధ్యక్ష, ప్రధానమంత్రి పదవులకు పోటీ చేసే హక్కు లేకుండా చట్టాలు చేసింది. ఆ విధంగా మైనారిటీల పట్ల వివక్షను వ్యవస్థీకృతం చేసింది. ఈ రాజ్యాంగ తప్పిదాన్ని సవరించేందుకు, ఈ సంవత్సరం అక్టోబర్’లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కి చెందిన క్రిస్టియన్ పార్లమెంట్ సభ్యుడు, ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లును, పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ మూజువాణీ ఓటుతో ఓడించింది.
అంతే కాదు, పాకిస్థాన్, హిందూ, క్రిస్టియన్, సిక్కు మైనారిటీలతో పాటుగా ఆహ్మేడియాలను, రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ముస్లిమేతరులుగా ప్రకటించింది. 1984లో ప్రత్యేక ఓటింగ్ విధానమ ప్రవేశ పెట్టినప్పటినుంచి, పాక్’ లో తీవ్ర వివక్షకు, పీడనకు గురవుతున్న ఆహ్మేదియాలు, ముస్లిమేతరులుగా ఓటు హక్కును వినియోగించుకోవలసి వచ్చింది. అయితే, ఈ వివక్షకు వ్యతిరేకంగా ఈ తెగ ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. ఇదిలా ఉంటే, అల్లాహ్ వాసయ వర్సెస్ ఫెడరేషన్ అఫ్ పాకిస్థాన్ కేసులో ఇస్లామాబాద్’ హై కోర్టు చాలా చిత్రమైన తీర్పును ఇచ్చింది. ఆహ్మేదియాలను ముస్లింలుగా పరిగణించాలంటే వారు తమ పేర్ల చివరన, ఖదియానీ లేదా మీర్జా తగిలించుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది. పాకిస్తాన్’ లో మైనార్టీలను తరచూ దైవ దూషణ ఆరోపణలపై కఠినంగా శిక్షించడం జరుగుతోంది. చాలా సందర్భాలలో మరణ శిక్షలు విధించడం కూడా జరుగుతోంది. మైనారిటీలపై పగ తీర్చుకునేందుకు చిన్న చిన్న తగవులలో సైతం దైవ దూషణ నేరం కింద శిఖలు వేయడం ద్వారా మైనారిటీలను మట్టు పెట్టడం, అదే విధంగా బలవంత మత మార్పిడులకు దైవ దూషణ అభియోగాన్ని అస్త్రంగా చేసుకోవడం జరుగుతోంది.
ముస్లిమలలోనే వేరే తెగకు చెందిన షియాలుకూడా వివక్షకు గురవుతున్నారు. అంతే కాదు, షియా ముస్లింలను కూడా ముస్లిమేతరులుగా ప్రకటించేందుకు మత చాందస వాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్’ను
‘సున్నీ ఇస్లామిక్ దేశం’ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి.
మతపరమైన మైనారిటీలను మాత్రమే కాదు, తూర్పు పాకిస్థాన్, బలూచిస్తాన్’లో బెంగాలీలు, మొహజిర్ల పట్ల పాక్ వ్యవహరిస్తున్న తీరు, స్వజాతీయుల పట్ల పాక్’ అనుసరిస్తున్న వివక్షకు అద్దం పడుతుంది. 1971 నుంచి బంగ్లాదేశ్’లో ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల శిబిరాలలో తల దాచుకుంటున్న బిహరీలను కూడా పాక్, గుర్తించడం లేదు.
ఇలా అన్ని విధాలా స్వదేశీ, విదేశీ మైనారిటీల పట్ల ఇంత దుర్మార్గంగా, అమానవీయంగా వివక్షకు పాల్పడుతున్న పాకిస్థాన్, పొరుగు దేశాల మైనారిటీ శరణార్ధులకు భారతీయ పౌరసత్వం కలిపించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం గురించి మాట్లాడడం విడ్డూరం కాదు మహా విడ్డూరం.గతంలో NRC విషయంలో కూడా పాక్’ ప్రధాన మంత్రి ఇలాంటి విష ప్రచారమే చేశారు.
1947 నుంచి పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లా దేశ్ నుంచి మైనారిటీలు భారత దేశానికి వస్తూనే ఉన్నారు. స్వదేశంలో రక్షణ లేకనే ఈ పేదలు దేశం వదిలి భారత దేశం వచ్చారు.వస్తున్నారు.స్వదేశం వివక్షతో పాటుగా సంఘ వ్యతిరేక శక్తుల చేతిలో దోపీదీకి కూడా గురవుతున్నారు. ఇప్పుడు ప్రతిపాదిత పౌరసత్వ సవరణ బిల్లు ఇరుగు పొరుగు దేశాలకు చెందిన మైనారిటీలకు భారతీయ పౌరులుగా పౌరసత్వ హక్కులు కలిపిస్తుంది.
అంగ్ల మూలం: డాక్టర్ సమ్రుతిస్ పట్నాయక్, దక్షిణ ఆసియా వ్యూహాత్మక విశ్లేషకులు
Comments
Post a Comment