వాతావరణ మార్పు ప్రభావాన్ని తొలగించేందుకు మాడ్రిడ్ సమావేశంలో భారత్ అజెండా
వాతావరణ మార్పులనదే ఒక సత్యం. ఎవరు కాదనలేనిది. ఏ ఒక్క దేశం చర్య - ప్రతి చర్య మూలంగా ఇది ఆధారపడి లేదు గనుక ప్రపంచంలోని ఏ దశం కూడా దాని ప్రభావం సోకకుండా వుండలేదు. వాతావరణ మార్పుల ద్వారా ఏర్పడిన ప్రభావాన్ని భారత్ ఇప్పటికే చవి చూస్తోంది. అకాల వర్షాలు, విపరీతమైన ఎండలు, అతి శీతల సమయాలు దీని మూలంగా జరుగుతున్నవే. ఈ ప్రభావం ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఆరోగ్యం వంటి వాటిపై పడుతోంది.
2015 ప్యారిస్ ఒప్పందాన్ని 2020 నుంచి ఏ విధమైన కార్యాచరణతో పూర్తిగా అమలు చేయవచ్చునన్న అంశంపై వాతావరణ మార్పులపై ఇటీవల జరిగిన మాడ్రిడ్ సమావేశంలో కూలంకషంగా చర్చించారు.
రెండు వారాల పాటు జరిగిన ఈ సమావేశాల్లో వాతావరణమార్పుల ప్రభావంపై వైజ్ఞానిక పరమైన హెచ్చరికలు, భూగోళాన్ని, మానవ సమాజాన్ని వీటి నుంచి ఏ విధంగా కాపాడటం వంటి అంశాలపై సమీక్షించారు. ప్రకృతిపై ఇప్పటికే పడిన దుష్ ప్రభావాన్ని తొలగించాలంటే ఆశించిన లక్ష్యాల సాధించాలంటే వివిధ దేశాలు తమ కార్యాచరణను వేగవంతం చేయనవసరం వుందని ఐక్యరాజ్యసమితి సంస్థ అయిన వాతావరణ మార్పులపై ఏర్పాటైన అంతర్ ప్రభుత్వ ఏజెన్సీ - ఐపిసిసి హెచ్చరించింది.
అత్యంత తీవ్రమైన హెచ్చరిక యుఎన్ వాతావరణ పథకం - తన ఉద్గారాల విడుదల నివేదిక 2019లో చేసింది. భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసే అవకాశాన్ని కోల్పోయే దిశలో వున్నామని ఐపిసిసి తన నివేదికలో హెచ్చరించింది.
భూతాపం గనుక ఇదే స్థాయిలో పెరుగుతూ పోతే 2030-2052 సంవత్సరాల కాలం నాటికి 1.5 డిగ్రీల సెల్సియస్ స్థాయిని మించిపోగలదని ఐపిసిసి తన నివేదికలో హెచ్చరించింది.
వాతావరణ మార్పులను కలసికట్టుగా ఎదుర్కునేందుకు అన్ని దేశాలతో జరిపిన ప్యారిస్ వాతావరణ సదస్సులో 2015 ఒప్పందం కుదిరింది. భూతాపాన్ని ఈ శతాబ్దంలో 2 డిగ్రీల సెల్సియస్ లోపులో వుంచాలని వీలైతే 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయాలన్నది ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ కార్యాచరణకు అనుగుణంగా అన్ని దేశాలు తమ లక్ష్యాలను సాధించేందుకు సిద్ధపడే చేయాలన్నది మూడ్రిడ్ సదస్సు ప్రధాన లక్ష్యం.
చైనా, భారత్, ఐరోపా సమాజం, అమెరికాలు కలిసి 2017లో శిలజల కర్చన ఉద్గారాలలో 60 శాతం దాకా ఉన్నాయి. దీనిని త్గగించుకునేందుకు భారత్ కట్టుబడి వుంది.
తన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రస్తుత విధానాల అమలులో భారత్ సంసిద్ధంగా వుంది. 15 శాతంకు పైగా లక్ష్యం అమలు సాధించే అవకాశం కూడా వుంది. కర్బన ఉద్గారల తగ్గింపునకు నాలుగు కీలక చర్యలను భారత్ చేపడుతోంది. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను శిలాజల ఇంధనేతర ప్లాంట్లుగా మార్చటం, హరిత పారిశ్రామీకరణ వ్యూహాల అమలు ద్వారా ఉద్గారాల తగ్గింపు, ప్రజా రవాణా వ్యవస్థను వస్తృత పరచడం, జాతీయస్థాయిలో ఎలక్ట్రిక్ రవాణా సదుపాయాలు భారత్ చేపడుతున్న నాలుగు కీలకచర్యలు.
స్థిర అభివృద్ధి కోసం మహాత్మాగాంధి ప్రతిపాదించిన సిద్ధాంతాలను భారత్ మాడ్రిడ్ సదస్సులో ప్రస్తావించింది. వాంఛలను తగ్గించుకుని సరళజీవనం సాగించాలన్న గాంధీజీ ప్రవచనాలను భారత్ ప్రస్తావించింది.
జిడిపిపై ఉద్గారాల ప్రభావాన్ని 21 శాతానికి తగ్గించిందని ప్యారిస్ సదస్సులో హామీ మేరకు 35 శాతానికి తగ్గించాలన్నది భారత్ లక్ష్యమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భారత్ బృందం అధినేత ప్రకాశ్ జావ్దేకర్ మాడ్రిడ్ సదస్సులో స్పష్టం చేశారు. వాతావరణ మార్పులపై చర్యలు తీసుకుంటున్న ప్రపంచంలోని అతి ముఖ్యమైన ఆరు దేశాల్లో భారత్ ఒకటని ఆయన తెలిపారు.
ప్యారిస్ ఒప్పందంలో భాగంగా 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని సాధించేందుకు భారత్ కృషి చేస్తోందని ఇప్పటికే 83 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించేందుకు పథక రచన చేస్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు.
వాతావరణ శాస్త్రం స్పష్టంగా చెబుతోంది - ప్రపంచం వాతావరణ, మానవ పరమైన సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. వాతావరణ పరిరక్షణ ఆవశ్యకత అత్యంత కీలకమైనది. శిలాజల ఇంధనంపై ఆధారపడటం నుంచి ప్రపంచం మారకపోతే వాతావరణ ఎమర్జెన్సీని అడ్డుకోలేము.
రచన - ఎన్.భద్రన్ నాయర్, ఇండియన్ సైన్స్ జనరల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్
Comments
Post a Comment