భారత్ – చైనా 22 వ ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో పురోగతి

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, భారత దేశంలో పర్యటించారు భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్’తో సరిహద్దు సమస్యలపై చర్చించేందుకు భారత్’ లో పర్యటించిన వాంగ్, భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. వాంగ్ పర్యటన సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రతినిధుల చర్చలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అందుకు అనేక కారణాలున్నాయి.అందులో ప్రధానంగా చెప్పుకోవలసింది, 2019 అక్టోబర్’లో చెన్నై సమీపాన సాగర తీరంలోని మహాబలిపురంలో భారత ప్రధానమంత్రి, చైనా అధ్యక్షడు జరిపిన రెండవ అనధికార సదస్సు. ఈ సదస్సులోనే ఇరువురు నాయకులు సరిహద్దుల్లో శాంతి సాధన కోసం ఉభయ మరిన్ని దేశాలు విశ్వాస నిర్మాణ చర్యలు – తీసుకోవాలని ఒక అవగాహనకు వచ్చారు.

అదే స్పూర్తిని ప్రతిధ్వనిస్తూ, భారత జాతీయ భద్రతా సలహాదారు, అజిత్ దోవల్, ఉభయ దేశాల నాయకులు, “ దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటుగా, సరిహద్దు సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు నూతన దుక్పధం, నూతన వ్యూహాత్మక మార్గదర్శకత్వం అవసరం” అని పేర్కొన్నారు. మరో వంక చైనా, చర్చల అనంతరం “యాజమాన్య నిబంధనల రూపకల్పన” , “సరిహద్దు దళాల మధ్య ఇచ్చిపుచ్చుకునే విధంగా సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవడం” విషయంలో ఉభయ దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి, అని పేర్కొంది.ఆ విధంగా ప్రత్యేక ప్రతినిధుల చర్చల ద్వారా సరిహద్దు భద్రత విషయంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు స్వస్తి చెప్పాలని ఉభయ దేశాలు ఒక విధమైన ఏకాభిప్రాయానికి వచ్చాయి. అలాగే, మిలటరీ ఆధునీకరణ, సరిహద్దుల యాజమాన్యంలో లోపాలను సవరించుకోవడంతో పాటుగా ఉభయ దేశాల సేనల మధ్య సంబంధలలను మెరుగుపరచుకునే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఉభయులు ఒక నిర్ణయానికి వచ్చారు.

కాగా, 22 సరిహద్దు చర్చలు, లడఖ్’ను భారత ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత జరిగిన తొలి సరహద్దు చర్చలు కావడంతో ఈ చర్చలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జమ్మూ – కశ్మీర్’ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత, లడఖ్’ స్థానిక హోదాను మార్చడం పట్ల చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తపరిచింది.అలాగే, జమ్మూ- కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రస్తావించేందుకు పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలకు చైనా మద్దతు తెలిపింది. అయితే భారత దేశం పాక్ ప్రయత్నలాను తిప్పికొట్టింది.

సరిహద్దు చర్చలకు ముందు కూడా చైనా మరోమారు, కశ్మీర్ విషయం చర్చినేందుకు ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సమావేశం జరపాలని ప్రతిపాదించింది.అయితే, ఐక్యరాజ్య సమితి, శాంతి పరిరక్షణ మిషన్, పీస్ కీపింగ్ మిషన్, సభ్యులకు వాస్తవ పరిస్థితిని వివరించే పరిస్థితి లేకపోవడంతో సమావేశం వాయిదా పడింది. మరో వంక ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ మిషన్ నివేదిక అందిన తర్వాత మరో మారు భద్రతా మండలి సమావేశం కోరతామని, ఐక్యరాజ్య సమితిలో చైనా రాయబారి పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో, భారత దేశం, ఉభయ దేశాలు “సున్నిత అంశాల” విషయంలో పరస్పర అవగాహనతో, పరస్పర గౌరవంతో మెలగాలని, “పరస్పర విశ్వాసాన్ని” పెంచుకోవాలని స్పష్టం చేసింది. అంటే, భారత దేశం జాతీయ పరిరక్షణలో భాగంగా తీసుకునే నిర్ణయాల విషయంలో చైనా మరింత హుందాగా, గౌరవప్రదంగా మెలగాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

, చైనా సరహద్దు వివాదం పరిష్కారానికి చైనా ప్రతిపాదించిన “ఆచరణీయ నమూనా” పట్ల “భారత దేశం ఆసక్తి చూపింది” అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, పేర్కొన్నారు. సరిహద్దు చర్చలకు సంబదించి ఇటీవల కాలంలో వచ్చిన అతి కొద్ది సానుకూల ప్రకటనలో ఇది కూడా ఒకటి. అయితే చైనా ప్రతిపాదించిన ‘నమూనా’ ఏమిటీ? భారత దేశం అందులోని మంచి చెడులను పరిగణనలోకి తీసుకుందా, లేదా? అనే విషయాల్లో ఇంకా స్పష్టత లేదు. ఆ వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. నిజానికి, చర్చలు ప్రారంభానికి ముందే వాంగ్ యీ, సరిహద్దుల పునర్విభజన విషయంలో ఉభయ దేశాలు తమ తమ అభిప్రాయలను పంచుకోవచ్చని అన్నారు. అంతిమ ప్రణాలిక పై చర్చలు జరిపేందుకు చైనా ప్రతిపాదించిన “నమూనా” కు సంబంధించి, ఉభయ దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. సంతకాలు జరగలేదు, అయినా, ఆ ప్రతిపాదనను పరస్పర అమోదయోగ్యంగా మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఉభయ దేశాలు కట్టుబడి ఉన్నాయి. అందుకు ఆధారాలూ ఉన్నాయి.

ఉభయ దేశాలు వచ్చే సంవత్సరం దౌత్య సంబంధాల 70 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాయి, ఆ విధంగానూ సరిహద్దు చర్చలు ప్రధాన్యతను సంతరించుకున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉభయ దేశాలు దౌత్య సంబంధాలలో ఒక ముందడుగు వేయాలని సంకల్పించినట్లు కనిపిస్తోంది. వచ్చే సంవత్సరం జరుపుకునే వేడుకలకు ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర సహకారం, స్నేహ సంబంధాలు ప్రామాణికంగా నిలవాలని రెండు దేశాలు భావిస్తున్నాయి.

చైనా ఈ వేడుకలను, “ సామాజిక, ప్రజా సంబంధాల స్నేహ పునాది” గా వ్యవహరిస్తోంది. ఉభయ దేశాల సంస్కృతీ, సంప్రదాయాల పరస్పర అవగాహనకు పెద్ద పీట వేయాలని భావిస్తోంది. భౌగోళిక, రాజకీయ ద్రుక్కోణానికి అతీతంగా ఉభయ దేశాల సాంస్కృతిక వారసత్వ సంపద ప్రామాణికంగా దౌత్య సంబంధాలను,సహకారాన్ని బలోపేతంగా చేసుకోవాలనే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనలను కూడా ఇది ప్రతిధ్వనిస్తోంది.

మొత్తంగా చూస్తే భారత – చైనా సంబంధాలు అనేక వడిదుడుకులు చూశాయి. ఈ నేపధ్యంలో జరిగిన ప్రస్తుత సరిహద్దు చర్చలు, రానున్న సంవత్సరాలలో భారత – చైనా దేశాల దౌత్య సంబంధాల బలోపేతానికి సానుకూల సంకేతాలను అయితే ఇచ్చాయి. ఇంతవరకు అదొక సంతోషకర పరిణామం.

రచన: డాక్టర్. ఎంఎస్ ప్రతిభ,

చైనా రక్షణ వ్యవహారాల వ్యూహకర్త

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన