19 వ భారత – ఇరాన్ సంయుక్త కమిషన్ సమావేశం
భారత్ – ఇరాన్ సంయుక్త కమిషన్ 19వ సమావేశంలో పాల్గొనేందుకు, భారత విదేశాంగ మంత్రి డాక్టర్. జైశంకర్ ఇరాన్’ లో పర్యటించారు. భారత, ఇరాన్ దేశాల విదేశాంగ మంత్రులు ఇద్దరూ అధ్యక్షత వహించే సంయుక్త కమిషన్, మిత్ర దేశాల మధ్య గల స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఏర్పరచుకున్న ఒక వ్యవస్థ. ఒక యంత్రాంగం. ఈ పర్యటన సందర్భంగా డాక్టర్ జైశంకర్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్. హస్సన్ రౌహనీతో కూడా సమావేశమయ్యారు. సంయుక్త కమిషన్ సమావేశం వివరాలను అధ్యక్షునికి వివరించారు.అదే విధంగా భారత విదేశాంగ మంత్రి, ఇరాన్ సర్వోన్నత భద్రతా మండలి కార్యదర్శి, రేర్ అడ్మిరల్ అలీ శంఖానీ, ఇరాన్ రహదారులు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మొహమ్మద్ ఇస్లామీతోనూ సమావేశమయ్యారు.
ఇరాన్ – అమెరికా సంబధాలు స్థంబించి ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న సమయంలో భారత్ – ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకునే లక్ష్యంతో జరిగిన ఈ సమావేశం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరాన్ అణు ఒప్పందం నుంచి ఇరాన్ ఏకపక్షంగా తప్పుకోవడంతో ఇరాన్ – అమెరికా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుదీర్ఘ కాలంగా ఉభయ దేశాల మధ్య సంబధాలలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపధ్యంలో అమెరికా ఇరాన్’పై తీవ్ర ఆర్థిక, రాజకీయ అక్షలు విధించింది.ఫలితంగా, ఇరాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఇలాంటి సమయంలో భారత్- ఇరాన్ దేశాల సంయుక్త కమిషన్ సంవేసం జరగడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
‘అత్యంత ఫలవంతం’గా సాగిన సంయుక్త కమిషన్ సమావేశంలో ఉభయ దేశాల ప్రతినిధులు భారత్ – ఇరాన్ సంబందాల సమగ్ర స్వభావాన్ని సమీక్షించారు. అలాగే, ఇరాన్’లో నిర్మాణంలో ఉన్న చబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని సమావేశంలో ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. కాగా,ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జారిఫ్ సమావేశంలో చర్చించిన విషయాల పట్ల సంపూర్ణ సంతృప్తిని వ్యక్తపరిచారు.భారత్-ఇరాన్ దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై అత్యంత ఫలప్రదమైన ‘అద్భుత చర్చలు’ జరిగాయని ఆయన సంతృప్తిని,సంతోషాన్ని వ్యక్తపరిచారు.ఉభయ దేశాల మధ్య గల చారిత్రక సంబంధాలను విచ్చిన్నం చేయడం సదయం కాదని అయన స్పష్టం చేశారు. ఉభయ దేశాల మధ్య ఎంతో కాలంగా దౌత్య పరిధిని దాటిన సాంస్కృతిక స్నేహ సంబంధాలుఉన్నాయని జవాద్ జారిఫ్ పేర్కొన్నారు.
సమావేశంలో అనేక కీలక అంశాలపై లోతైన చర్చ జరిగింది. అందులో అనుసంధానం,వ్యాపార,వాణిజ్య రంగాలలో భారత్ – ఇరాన్ పరస్పర సహకారం వంటి కీలక అంశాలు అనేకం ఉన్నాయి. అలాగే, భారత్ –ఇరాన్ దేశాలపై ప్రభావం చూపే, ప్రాంతీయ,అంతర్జాతీయ సమస్యలపై ఉభయ దేశాలు ప్రతినిధులు తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చబహర్’లో షాహిద్ బెహేష్టి పోర్ట్ నిర్మాణ ప్రగతి పట్ల ఉభయ దేశాల ప్రతినిధులు పరస్పర సంతృప్తిని వ్యక్తపరిచారు.చబహర్’పోర్ట్ భారత ఉపఖండం, ఇరాన్, ఆఫ్ఘానిస్థాన్. మధ్య ఆసియా, యూరప్ మధ్య ప్రవేశ ద్వారంగా గుర్తింపు పొందింది. ఇంధన సంపదగల ఇరాన్ దక్షిణ తీర ప్రాంతంలో నిర్మాణం అవుతున్న పోర్ట్, భారత పశ్చిమ తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న, సులభంగా చేరుకునే అవకాశం ఉన్న పోర్టు. అలాగే, చైనా పెట్టుబడులతో,ఈ పోర్టుకు 80కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్ చేపట్టిన గ్వాలియర్ పోర్టు, పోటీ పోర్టుగా భావిస్తున్నారు.
చబహార్ పోర్టును ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఎగుమతులకు కూడా వినియోగించుకోవాలనే ప్రతిపాదనను భారత్, ఇరాన్ విదేశాంగ మంత్రులు స్వాగతించారు.అలాగే, ఈ ప్రాంతంలో వ్యాపార, వాణిజ్య విస్తరణకు, చబహార్ పోర్టును అభివృద్ధికి, ప్రాంతీయ అనుసంధానానానికి గల అవకాశాలను గురించి కూడా వారు చర్చించారు.
భారత్, ఇరాన్ నడుమ ద్వైపాక్షిక వ్యాపార, వాణిజ్య సంబంధాలను మరింతగా బలోపేతం చేస్కోవాలని, అందుకుగానూ, భారత్ – ఇండియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం నిర్వహించి వాణిజ్య ఒప్పందం, ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందలకు తుది రూపం ఇవ్వాలని,అదే విధంగా కస్టమ్స్ నిబంధనల విషయంలో ఉభయ దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని సంయుక్త కమిషన్ సమావేశం పునరుద్ఘాటించింది. ఉభయ దేశాలు అందుకు అనుకూలంగా స్పందించాయి. శీఘ్రగతిన చర్యలు తీసుకునేందుకు అంగీకరించాయి.
అంతకంటే ముఖ్యంగా భారత్, ఇరాన్ దేశాలు ప్రపంచానికి పొంచిఉన్న ఉగ్రవాదం ముప్పు గురించి పరస్పరం అభిప్రాయలను పంచుకున్నాయి. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు, ఉగ్రవాద సంస్థలకు ఎలాంటి సహకారం అందకుండా చేయాలని ఉభయ దేశాలు పిలుపునిచ్చాయి. అలాగే, ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు, సుస్థిరితలకు సంపూర్ణ సహకారం అందించేందుకు ఉభయులు అంగీకరించారు.
ఇండియా – ఇరాన్ సంయుక్త కమిషన్ 19 వ సమావేశంలో ఉభయ దేశాలు 2020లో ఉభయ దేశాల ద్వైపాక్షిక స్నేహ ఒప్పందం 70 వార్షికోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించాయి. ఇందుకు సంబంధించి భారత్, ఇరాన్ దేశాలు ఇరు దేశాల ప్రజాప్రనిదుల మధ్య సంబంధాలు మెరుగు పరచుకోవడంతో పాటుగా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
అమెరికా అంక్షల కారణంగా, ఇరాన్ నుంచి భారత దేశం చేసుకునే చమురు దిగుమతులు గణనీయంగా దెబ్బతిన్నా,ఉభయ దేశాల మధ్య బహుముఖ సంబధాల విస్తరణకు రెండు దేశాలు చేస్తున్న కృషికి సంయుక్త కమిషన్ చర్చలు అద్దం పడుతున్నాయి. గతంలోనూ రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి. ఇదే వరవడిని కొనసాగించాలని ఉభయ దేశాలు పునరుద్ఘాటించాయి. ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్. హస్సన్ రౌహని గత సంవత్సరం భారత దేశంలో పర్యటించారు. కాగా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ సంవత్సరం సెప్టెంబర్’లో న్యూయార్క్’లో జరిగిన ఐక్య రాజ్య సమితి 74వ సర్వ సభ్య సమావేశం సందర్భంగా ఇరాన్ అధ్యక్షునితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు, భారత్ – ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. ఈ నేపధ్యంలో ఇటీవల జరిగిన సంయుక్త కమిషన్ సమావేశం, ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలను నిస్సందేహంగా మరింత బలోపేతం చేస్తాయి. మరింత వేగంగా ముందుకు తీసుకు పోతాయి ... సందేహం లేదు.
రచన: డాక్టర్. ఆసిఫ్ షుజా
ఇరాన్ వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు

Comments
Post a Comment