పార్లమెంటులో ఈ వారం
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పౌరసత్వ సవరణ బిల్లు 2019 ఆమోదం ప్రధానమైనది. ఉభయ సభలు బుధవారం నాడు బిల్లును ఆమోదించాయి. పొరుగుదేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘని స్థాన్ లలోని మైనారిటీలు అనుభవిస్తున్న కష్టాలను పరిష్కరించటం చారిత్రక అవసరమని ఈ బిల్లును ప్రవేశపెడుతూ హోంమంత్రి అమిత్ షా అన్నారు. మతపరమైన విభజన తరువాత ఆ దేశాలలోని మైనారిటీలు అనునిత్యం హింసకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ల నుంచి అక్రమంగా వలస వచ్చిన హిందువులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీలు క్రైస్తవుల కు భారత పౌరసత్వానికి అర్హత కలుగ జేయడా
నికి 1955 నాటి పౌరసత్వ చట్టాన్ని సవరించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.
ఈ బిల్లుకు షరతులకు అనుగుణంగా వర్గీకరణ ఉందని, బిల్లు రాజ్యాంగబద్ధతపై స్పందిస్తూ షా అన్నారు. గత ఐదేళ్లలో ఆ దేశాలకు చెందిన 566 మంది ముస్లింలకు పౌరసత్వం ఇవ్వడానికి భారత్ శ్రద్ధ చూపిందని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఆరోపించినట్లుగా సమస్యల నుండి మళ్లించడానికి ఈ బిల్లును తొందరపడి ప్రవేశ పెట్టలేదని అన్నారు. శ్రీలంక, ఉగాండా ప్రజలకు ఇంతకు ముందు పౌరసత్వం కల్పించినట్లు ఆయన చెప్పారు. దేశ కరుణ సౌభ్రాతృత్వాల సంస్కృతిలో ఇది ఒక చరిత్రాత్మకమైన రోజని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు .ఏళ్ల తరబడి చాలామంది ఎదుర్కొంటున్న హింసలను బాధ లను ఈ బిల్లు తొలగిస్తుందని ఆయన పేర్కొన్నారు
ఎగువ సభ ఆమోదం పొందిన రాజ్యాంగ 126 వ సవరణ బిల్లు 2019 ని పార్లమెంటు ఆమోదించింది .లోక్ సభ, రాష్ట్ర శాసనసభల లోని షెడ్యూలు కులాలు షెఫ్యూల్డ్ తెగల రిజర్వేషన్లను పదేళ్ల పాటు ఈ బిల్లు ద్వారా పొడిగించేందుకు వెసులుబాటు లభించింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ ప్రమాణాలను రూపొందించటం లేదని చర్చకు సమాధానంగా న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఈ రెండు వర్గాల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుందని అన్నారు. విద్య సాయుధ దళాలలో ఆంగ్లో ఇండియన్ సమాజాల సేవలను ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. అస్సాంలోని వివిధ విదేశీయ ట్రిబ్యూనళ్లు 1.29 లక్షల మందికి పైగా విదేశీయులు గా ప్రకటించినట్లు హోం వ్యవహారాల శాఖసహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్ సభ కు తెలియజేశారు. దాదాపు 1.14 లక్షల మంది అక్టోబర్ 2019 వరకు భారతీయ పౌరులుగా తమను ప్రకటించాలని సవాలు చేశారని వారినందరినీ భారతీయ పౌరులుగా ప్రకటించామని ఆయన తెలిపారు .
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమ అధికారిక పర్యటనల సందర్భంగా అందుకున్న జ్ఞాపికల వేలం పదిహేను కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ రాజ్యసభకు తెలియజేశారు
ఆగస్టు 5 న 370 వ అధికరణాన్ని రద్దు చేసినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి 85 ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు జరిగాయని హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి లిఖితపూర్వకంగా తెలియజేశారు. వీటిలో దాదాపు 59 ప్రయత్నాలు సఫలమైనట్లు గా అంచనా. 1990-2019 అక్టోబర్ల మధ్య జమ్మూ కాశ్మీర్లో చొరబాటు ప్రయత్నాలలో దాదాపు 22,557 మంది ఉగ్రవాదులు మరణించినట్లు ఆయన తెలిపారు.2005 నుండి2019 అక్టోబర్ 31 వరకు మొత్తం 1011 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 42 మంది పట్టుబడ్డారని, 2253 మందిని వెనుక కు పంపినట్లు ఆయన తెలిపారు .
పాకిస్తాన్ అధీనంలో 292 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో మత్స్యకారులు కూడా ఉన్నట్లుగా భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 2019 జూలై 1 జాబితా ప్రకారం భారతీయులుగా భావించబడుతున్న 52 మంది ఖైదీలను, 209 మంది మత్స్యకారులను తాము అదుపులోకి తీసుకున్నట్లు పాకిస్థాన్ అంగీకరించింది. అయితే భారత రక్షణ దళాలకు చెందిన 83 మంది కనపడకుండా పోయారని, వారిలో యుద్ధ ఖైదీలు ఉన్నారని, వారు తమ అధీనంలో ఉన్నట్లుగా ఇస్లామాబాద్ ఇంకా తెలియజేయలేదని అన్నారు.2014 నుండి పాకిస్థాన్ అదుపులో ఉన్న 2,112 మంది భారతీయులను న్యూఢిల్లీ నిరంతర కృషి వలన విజయవంతంగా విడుదల చేయటం, స్వదేశానికి రప్పించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. వీరిలో ఈ ఏడాది ఇప్పటివరకు తిరిగి వచ్చిన 364 మంది భారతీయులు కూడా ఉన్నారు .
రచన:వి.మోహన రావు,పాత్రికేయులు

Comments
Post a Comment