భారత్ అమెరికా ల రెండవ 2+2 సమావేశం

భారత్ అమెరికాల రక్షణ విదేశాంగ మంత్రులు, సీనియర్ అధికారుల మధ్య రెండవ 2+2 సమావేశం ఈ వారం వాషింగ్టన్ డీసీలో విజయవంతంగా ముగిసింది .

ప్రాంతీయ భద్రతా వాతావరణంలో కీలకమైన పరిణామాలపై అభిప్రాయాల మార్పిడి, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం, ఆఫ్గనిస్తాన్ స్థిరీకరణ, ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి యుత స్థిర క్రమ సాధనలు ఈ చర్చ సందర్భంగా ఎజెండాలోని ప్రధాన అంశాలు. పారిశ్రామిక భద్రతలో సహకారం కోసం ఒక ఒప్పందంపై సంతకం చేయటం ఈ సమావేశ ప్రధాన ఫలితం. రక్షణ పరిశోధన, అభివృద్ధిలో ద్వైపాక్షిక సహకార ప్రక్రియను ఇది సులభతరం చేస్తుంది.

ఇరు దేశాల సైనిక దళాల పరస్పర సామర్థ్య పెంపుదల ఉద్దేశ్యంతో కమ్యూనికేషన్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ ఎగ్రిమెంట్ లేదా కాంకాస పై సంతకం చేయటం గత ఏడాది సెప్టెంబర్లో నూఢిల్లీ లో జరిగిన 2+2 సంభాషణ మొదటి రౌండ్లో కీలకమైన చర్య. కాగా రెండవ 2+2 చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య లోతైన రక్షణ, భద్రతా సంబంధాలు మరింత మెరుగయ్యాయి.

ప్రపంచ, ప్రాంతీయ భద్రతలపై అభిప్రాయాల మేళవింపులు దృఢతరంగా చెప్పటం ద్వారా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారత్ అమెరికాల ఈ ప్రయత్న విజయం పై అపోహలు ఉన్నాయి.

అమెరికా ప్రతినిధుల సభలో అభిశంసన దృష్ట్యా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద సవాల్ ఎదుర్కొన్నారు. భారత్ కీలక నూతన శాసనపరమైన చర్యల అమలు దశలో ఉంది. భారత్ అమెరికాలు సుంకం, జనరలైస్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంశాలపై తేడాల పరిష్కారంలో వాణిజ్య చర్చల మధ్యలో ఉన్నాయి. వాషింగ్టన్ ఒత్తిడి ఉన్నప్పటికి, రష్యాతో రక్షణ ఒప్పందాలతో ముందు సాగాలని భారత్ నిశ్చయించుకుంది. మరోవైపు ఇరాన్ పట్ల ఆంక్షల విధానాన్ని ట్రంప్ పరిపాలన కలిగి వుండటాన్ని భారత్ అంగీకరించలేదు.

అమెరికా జిఎస్పీని తొలగించడంపై భారత కంపెనీలు కలత చెందాయి. ఈ చర్య భారత్ లో బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని ప్రభావితం చేసింది. మతపరమైన స్వేచ్ఛకు సంబంధించిన అంశాలు, పౌరసత్వ సవరణ చట్టాల పై కొందరు అమెరికా శాసనసభ్యుల వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా దృష్టి సారించింది.

అయితే ఈ పరిణామాలు గత రెండు దశాబ్దాలుగా శ్రమపడి రూపొందించిన ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ట పరచాలన్న సంకల్పానికి అడ్డు పడలేదు .

ఇరు దేశాల నాయకత్వాల లో బహుళ మార్పులు ఉన్నప్పటికీ, రక్షణ సముపార్జనలో భారత్ అమెరికాకు ఒక ముఖ్యమైన భాగస్వామిగా మారిందనే వాస్తవం ఈ భాగస్వామ్యాల్లో కనిపించే అంశం. భారత్ లో సుమారు రెండు వేల అమెరికా కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయి. అలాగే రెండు వందల భారతీయ కంపెనీలు అమెరికాలో బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాయి. రెండు లక్షల మంది భారత్ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. తద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా ఏడు బిలియన్ డాలర్లు సమకూరుతోంది.

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం, దోపిడీ ఆర్థిక విధానాలతో చైనీస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ ని వ్యతిరేకించటం, దక్షిణ చైనా సముద్ర వివాదాల శాంతియుత పరిష్కారం ,ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో సముద్ర క్రమ నిర్వహణ అంశాల్లో భారత్ అమెరికాలు ఒకే పంధాలో ఉన్నాయి .

భారత రాజకీయ రంగానికి సంబంధించి అమెరికా రాజకీయ నాయకులు వివిధ అంశాలపై వ్యక్తిగత విమర్శలకు దిగుతారనడంలో సందేహం లేదు. ఐతే అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో,భారత్ తన సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించిందని భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.

భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య నూతన సౌధ పటిష్ఠత, ఇతర రాజకీయ ఆర్థిక భద్రతాపరమైన సమస్యలను ఎదుర్కోవటంలో దృఢ పడిందన్న విషయం లో సందేహం లేదు.

అణు సామర్థ్యం, పటిష్టమైన ప్రజాస్వామ్యాల తో భారత్ అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా ఎదిగేందుకు ముందడుగు వేస్తుండగా, అమెరికా భారత్ ను ప్రతికూలంగా కాక వ్యూహాత్మక భాగస్వామి గానే పరిగణిస్తోంది. అంతేకాదు అమెరికాతో కలిసి నడవటంతో ప్రపంచ వ్యవహారాలలో భారత్ కు పెరుగుతున్న ఆదరణ మరింత మెరుగవుతుందని భారత రాజకీయ రంగం అంతటా స్పష్టమైన పరిపూర్ణమైన అవగాహన ఉంది.

ఈ మేరకు వాషింగ్టన్ లో జరిగిన రెండవ దఫా 2+2 సంభాషణ సరియైన దిశలో మైలురాయి.

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన