తాలిబాన్ – అమెరికా చర్చలు జగరిగినా...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, బాగ్రాం ఎయిర్ బేస్ సందర్శన సందర్భంగా, తాలిబాన్లతో శాంతి చర్చలు పునరుద్ధరిస్తామని ప్రకటించారు. అయితే, ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే, బుధవారం, అదే ఎయిర్ బేస్ వెలపల గల వైద్య కేంద్రంపై తాలిబాన్ మానవ బాంబు దాడికి పాల్పడింది. గతంలో, కాబూల్ లోని నాటో’ సైనిక స్థావరంపై తాలిబాన్ దాడి చేయడంతోనే, అప్పటికే ఖరారైన చర్చలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చుక్క పెట్టారు. తాలిబాన్ రాజకీయ బృందం అమెరికా ప్రయాణానికి సర్వం సిద్దం చేసుకున్నప్పటికీ, ట్రంప్ చర్చలు నిలుపు చేశారు.
సెప్టెంబర్’ లో చర్చలకు అవరోధం ఏర్పడిన నాటి నుంచి, తాలిబాన్ పదే పదే తాము చర్చలకు సిద్దమని ప్రకటిస్తూనే ఉంది. ఒకసారి కాల్పుల విరమణ నియమ నిబంధనలు ఖరారు అయితే, ఆపైన యుద్ద విరామం ప్రక్రియ మొదలవుతుందని తాలిబాన్ నాయకత్వం పేర్కొంటోంది. చర్చలకు తాత్కాలికంగా బ్రేక్ పడిన నేపధ్యంలో తాలిబాన్ నాయకులు బీజింగ్, మాస్కో, ఇస్లామాబాద్’లలో పర్యటించి ఇదే విషయాన్ని ఆయా దేశాల నాయకులకు వివరించారు. చర్చల పునరుద్ధరణకు తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను ఇచ్చారు.
ఈ నేపధ్యంలో చర్చలలో జాప్యం చోటు చేసుకున్నా, అమెరికా, తాలిబాన్ మధ్య చర్చలు ఎలాంటి అవరోధాలు లేకుండా పునః ప్రారంభమవుతాయని తాలిబాన్ అధికార ప్రతినిధి సుహెయిల్ షహీన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇస్లామిక్ రిపబ్లిక్’గా పిలుస్తున్నఆఫ్ఘనిస్థాన్ పేరును,ఇస్లామిక్ ఎమిరేట్’గా మార్చాలని తాలిబాన్ పట్టుబడుతోంది. అయితే, ఇందుకు, ప్రస్తుత ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఆఫ్ఘనిస్థాన్, మౌలిక స్వరూప,స్వభావాలు,గుర్తింపు,వ్యక్తిత్వం విషయంలో మార్పులను అనుమతించేది లేదని అధ్యక్షుడు, అష్రాఫ్ ఘని, ఒకటికి పదిసార్లు స్పష్టం చేశారు.
సెప్టెంబర్’ లో అమెరికా చర్చలు సస్పెండ్ చేయడానికి ముందు అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని, తాలిబాన్ పేర్కొంటోంది. అయితే, అత్యంత కీలకమైన అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం నియమ నిబంధనల ఖరారు చేసుకోవడం,ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంతో శాంతి చర్చల విషయంలో మాత్రం ఇంకా అడుగు ముందుకు పడలేదు. ముందు ముందు కూడా ఈ విషయంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొనవలసి ఉంటుంది. రానున్న రోజుల్లో అమెరికా, తాలిబాన్, ఆఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం ఈ అంశాలపై జరిపే చర్చలే అత్యంత కీలకం కానున్నాయి.
చర్చల సందర్భంగా, తాలిబాన్ ప్రస్తావించే మరో ఇబ్బందికర అంశం, కాబుల్ ప్రభుత్వ స్టేటస్. ఈ విషయంలో తాలిబాన్,కాబూల్ ప్రభుత్వం మధ్య అనేక విబేధాలున్నాయి. సెప్టెంబర్ 28 వ తేదీన ఆఫ్ఘానిస్థాన్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అయినా, ఇంతవరకు ఎన్నికల ఫలితాలు ప్రకటించలేదు. మరో వంక, డాక్టర్ ఘని ప్రత్యర్ధి, డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్లా, ఓట్ల లెక్కింపు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా నిరసన సమావేశాలు,ఆందోళనలు,నిర్వహిస్తున్నారు. ఇప్పటికే,ఎంతో సమస్యాత్మకంగా సాగుతున్న తాలిబాన్,అమెరికా చర్చల ప్రక్రియకు ఇక ఇప్పుడు ఎన్నిక హింస తోడైతే, చర్చల ప్రక్రియను కొత్త సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం లేక పోలేదు.
ఘని ప్రభుత్వం ప్రజామోదం పొందని పక్షాన, తాలిబాన్ ప్రభుత్వ చట్ట బద్దతను వివాదం చేయవచ్చును. అదే జరిగితే,అది ఇప్పటికే ఆఫ్ఘానిస్థాన్ ప్రజలకు తామే నిజమైన ప్రతినిదులమని భావించే తాలిబాన్లకు అనుకూలంగా మారుతుంది. ఆఫ్ఘానిస్థాన్ వ్యవహరాలలో భాగస్వాములు అయిన అతర్జాతీయ పాత్ర దారులు, ఇప్పటికే, ఆఫ్ఘానిస్థాన్ అధికార వ్యవస్థలో తాలిబాన్లకు భాగస్వామ్యం ఉండాలన్న సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఇస్లామిక్ స్టేట్ సేనలు ఆఫ్ఘానిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించిన నేపధ్యంలో ఆఫ్ఘానిస్థాన్ అధికార వ్యవస్థలో తాలిబాన్ల భాగస్వామయం అనివార్యంగా మారిందని, రష్యా అధికార వర్గాలు పేర్కొన్నాయి.రష్యాలాగానే, చైనా కూడా, ఆఫ్ఘానిస్తాన్ భూభాగంలో ఇస్లామిక్ స్టేట్ సేనల ప్రాబల్యం పెరగడంతో ఈరోజు కాకపోతే రేపైనా, తాలిబాన్ అల్లర్లు, హింస సోవియట్ దేశాలు, చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలోకి విస్తరించే ప్రమాదం ఉందని, మధ్య ఆసియా భద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తపరుస్తోంది.ఇస్లామిక్ స్టేట్ నుంచి ఉత్పనమయ్యే దీర్ఘకాల సమస్యలకు పరిష్కారంగా,తాలిబాన్లు ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వంలో చేరాలని రష్యా, చైనా కోరుకుంటున్నాయి. తాలిబాన్ ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంటే, ఇతర భాగస్వామ్య దేశాలు, ఆఫ్ఘానిస్థాన్’లో సమగ్ర చర్చలు జరపవచ్చని ఎదురు చూస్తున్నాయి.
అయితే, ఆఫ్ఘానిస్థాన్’ లో పరిస్థితులు, శాంతికి అంత అనుకూలంగా లేవు.అందుకే కొందరు అమెరికా విశ్వాసం ప్రోదిచేసే దిశగా ముందడుగు వేయలాని కోరుతున్నారు. తాలిబాన్ల విశ్వాసం పొందేందుకు అమెరికా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించాలని, ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయి ఇప్పటికే పిలుపు నిచ్చారు.
మరోవంక భారత దేశం అఫ్ఘనిస్థాన్’లో చోటు చేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగ గమనిస్తోంది. యుద్ధంలో చితికి శిధిలావస్థకు చేరిన అఫ్ఘనిస్థాన్’ పునః నిర్మాణానికి భారత దేశం పూర్తిగా కట్టుబడి ఉంది. ఆ దేశంలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణాకి భారత దేశం 2 బిలయన్ అమెరికా డాలర్ల సహాయం అందించింది.
ఈనేపధ్యంలో ఆఫ్ఘనిస్థాన్ వ్యవహారాల్లో ఎదో ఒక విధంగా భాగస్వాములు అయిన అమెరికా, తాలిబాన్, ఆఫ్ఘన్ ప్రభుత్వం చర్చలు ఎలా సాగుతాయి, ఎలాంటి ఫలితాలు ఇస్తాయా అనేది చూడవలసి వుంది.అంతర్జాతీయ, స్థానిక, ప్రాంతీయ భాగస్వాములు , ప్రతి ఒక్కరూ కూడా చర్చల ప్రగతి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
ముందున్నాయి మరిన్ని సవాళ్ళు
రచన: కల్లోల్ భట్టాచార్జీ, స్పెషల్ కరెస్పాండంట్, ది హిందు
Comments
Post a Comment