బ్రిటన్ ఎన్నికలు బ్రెగ్జిట్ కి మార్గాన్ని సుగమం చేస్తాయా ?
2016 జూన్ 23 నాటి ప్రజాభిప్రాయ సేకరణ దరిమిలా యూరోపియన్ యూనియన్ వదిలి వెళ్లే నిర్ణయం - బ్రెక్సిట్ కు అంకురార్పణ జరిగింది. ఫలితంగా ఇద్దరు ప్రధాన మంత్రులు డేవిడ్ కేమెరాన్ ,థెరిస్సా మే లు తమ పదవుల నుంచి వైదొలగాల్సి వచ్చింది. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగే ప్రయత్నం చేస్తున్నప్పుడు మరింత ఆర్థిక అనిశ్చి తితో బ్రిటన్ ఎగుడుదిగుళ్లను ఎదుర్కొనాల్సి వచ్చింది. బ్రెగ్జిట్ కోసం యూరోపియన్ యూనియ న్ తో చర్చలు జరిపిన ఒప్పందాన్ని పార్లమెంటు ఆమోదించడానికి థెరిసా మే అనేక పర్యాయాలు చేసిన ప్రయత్నాలను ఆమె పార్టీ సభ్యులు ఆమోదించలేదు. ఫలితంగా ఆమె పదవి నుండి వైదొలగారు . 2019 జూలైలో బోరిస్ జాన్సన్ పార్టీకి కొత్త నాయకుడిగా ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే 2019 అక్టోబర్ 31 నాటికి బ్రిటిష్ పార్లమెంటు నుండి నిష్క్రమణను పొందే ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు. 2020 జనవరి వరకు మూడు నెలల పాటు బ్రెజిల్ నుండి పొడిగింపు లభించింది. అయినా బ్రిటిష్ పార్లమెంటులో అసహనాన్ని ఎదుర్కొంటున్న బోరిస్ జాన్సన్ 2019 అక్టోబర్ 24 న ఎన్నికలు ప్రకటించారు.
యూరోపియన్ ఆర్థిక సమాజం EEC లో బ్రిటన్ ప్రవేశం కూడా నాటకీయంగా జరిగింది. EEC ఆవిర్భావం 1957 లో జరిగింది. అయితే ఫ్రెంచ్ అధ్యక్షుడు చార్లెస్ డి గాలే బ్రిటన్ దరఖాస్తును తిరస్కరించడంతో 1973 లో మాత్రమే EEC లో బ్రిటన్ చేరగలిగింది. ఆనంతరం 1992 లో EEC యూరోపియన్ యూనియన్ EU గా రూపాంతరం చెందింది. EU లో చేరినా కొన్ని సాధారణ వ్యవస్థల నుండి బ్రిటన్ వేరుగానే వ్యవహరించింది. కానీ ఇతర దేశాలు ఉమ్మడి కరెన్సీ యూరో, షేన్గెన్ ఉమ్మడి వీసా వ్యవస్తలకు మారాయి. ఇటువంటి తదితర పరిస్థితులు లండన్ కి ఇతర యూరోపియన్ రాజధానుల మధ్య విభేదాలు సృష్టించాయి. గత దశాబ్దములో దేశీయ బ్రిటిష్ రాజకీయాలు EU పై ఘర్షణ కు గురయ్యాయి.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకగా వ్యవహరించే దేశంలో సాపేక్షంగా స్థిరమైన ప్రభుత్వాలు కన్సర్వేటివ్ లేబర్ పార్టీలతో కూడిన రెండు పార్టీ వ్యవస్థలతో ఉన్న దేశం లో Liberal Democrats,Bexit Party, Democratic Unionist Party,UK Independence Party వంటి ఇతర పార్టీల ఏర్పడ్డాయి. రెండు పెద్ద పార్టీలూ మెజారిటీ సాధించకపోతే ఎన్నికలలో ఈ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. దీనికి తోడు స్కాటిష్ స్వాతంత్య్రం కోసం డిమాండ్ ఒకటి నలుగుతోంది. ఏతావాతా ఐదేళ్లలో మూడు సాధారణ ఎన్నికలు జరగడంతో రాజకీయ అస్థిరతకు దారి తీసింది .బ్రెగ్జిట్ అంశం దేశాన్ని ప్రజలను రాజకీయాలను విడదీసింది.
బోరిస్ జాన్సన్ స్నాప్ ఎన్నికలకు ఇచ్చిన పిలుపు ప్రజల నుంచి బ్రెక్సిట్ కోసం స్పష్టమైన ఆదేశాన్ని పొందేందుకు చేసిన ఒక రాజకీయ ఎత్తుగడ. ఎన్నికల ప్రకటన వెలువడిన తదనంతర రోజుల్లో ఆయనకు లేబర్ పార్టీ నాయకుడు జెర్మీ కార్బిన్ ల మధ్య వాక్ యుద్ధమే జరిగింది .గెట్ బ్రెక్సిట్ డన్ అనే సాధారణ ఆకర్షణీయమైన నినాదంతో కన్సర్వేటివ్ పార్టీకి ఓటర్లు అనుకూలంగా భారీ స్థాయిలో తీర్పు ఇచ్చి ఉంటారన్నది ఎక్సిట్ పోల్స్ అంచనా. అయితే EU తో చర్చలన్నీ 2020 జనవరి కి పూర్తవుతాయని దీని అర్థం కాదు. EU తో తమ అనుబంధానికి సంబంధించిన అన్ని అంశాలను యునైటెడ్ కింగ్డం చర్చించవలసి ఉంటుంది కాబట్టి రానున్నది పరీక్షా కాలమే. బ్రెగ్జిట్ పై తన వైఖరిని వెల్లడించడానికి పార్టీని నడపటానికి జాన్సన్ కు ఇది వ్యక్తిగత విజయం .
2019 మే ఎన్నికల్లో ప్రధానమంత్రి మోదీ విజయాన్ని బోరిస్ జాన్సన్ ఈ సంవత్సరం ప్రారంభంలో స్వాగతించారు . రాబోయే సంవత్సరాలలో UK భారతదేశాల మధ్య మరింత సన్నిహిత భాగస్వామ్యం కోసం తాను ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. జాన్సన్ బ్రెక్సిట్ పై దృష్టి సారించినప్పుడే యూకే వాణిజ్య సంబంధాల నిర్మాణం, పునరుద్ధరణ వైపు చూడాలి. ఇక్కడే భారత్ తో భాగస్వామ్యం కీలకపాత్ర పోషిస్తుంది. చట్టబద్ధమైన వలసలను బలోపేతం చేయడం UKలో చదువుకోవటానికి ఇంకా పెద్ద సంఖ్యలో తరలి వెళ్లే విద్యార్థులకు వీసా ప్రయోజనాల విస్తరణపై కూడా భారత్ పరిశీలిస్తుంది .యూరోపియన్ యూనియన్ తో యూనైటెడ్ కింగ్ డం జరిపే చర్చలు, ఒప్పందంపై వాణిజ్య విస్తరణ అవకాశం కూడా ఆధారపడి ఉంటుంది.
రచన: prof. ఉమ్ము సల్మా బావా,

Comments
Post a Comment