పురోగ‌మ‌న‌దిశ‌లో భార‌త్ - పోర్చుగ‌ల్ సంబంధాలు

పోర్చుగీస్ ప్ర‌ధాని ఆంటోనియో కోస్టా తిరిగి ఆ ప‌ద‌వికి ఎన్నిక‌యిన త‌రువాత - యూర‌ప్ కు ఆవ‌ల భార‌త్ సంద‌ర్శ‌న అనేక కార‌ణాల‌రీత్యా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు కోస్టా ప్ర‌ధాన‌మంత్రి మోదీని మూడుసార్లు వివిధ సంద‌ర్భాల‌లో క‌లుసుకున్నారు. భార‌త్ ఆయ‌న‌కు ప్ర‌వాసీ భార‌తీయ స‌మ్మాన్ అవార్డును అందించిన‌ప్పుడు 2017 జ‌న‌వ‌రిలో భార‌త్ ను సంద‌ర్శించారు. గుజ‌రాత్ లో నిర్వ‌హించిన వైబ్రెంట్ గుజ‌రాత్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ లో పాల్గొని ప్ర‌సంగించారు.

అదే సంవ‌త్స‌రంలో ఆ త‌రువాత ప్ర‌ధాని మోది పోర్చుగీస్ ను సంద‌ర్శించిన‌ప్పుడు వివిధ అంశాల‌పై స‌హ‌కారానికి సంబంధించి చ‌ర్చ‌లు జ‌రిపారు. పోర్చుగ‌ల్ ఉన్న 65 వేల మంది భార‌తీయులు - ఆ దేశానికి అందిస్తున్న సేవ‌ల‌ను కొనియాడిన మోదీ - వారు ఆ దేశానికి నిజ‌మైన భార‌త‌రాయ‌బారుల‌ని కొనియాడారు.

ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు 2018లో పోర్చుగ‌ల్ ను సంద‌ర్శించారు.

ద‌శాబ్దాల పై పై చ‌ర్యల అనంత‌రం భార‌త్ - విదేశీ విధాన నిర్ణేత‌లు - పోర్చుగ‌ల్ పై దృష్టి సారించారు. పోర్చుగ‌ల్ తో సంబంధాల మెరుగు విష‌యంలో భార‌త్ కు స‌కారాత్మ‌క కార‌ణాలు వున్నాయి. భార‌త్ కు యూర‌ప్ ముఖ‌ద్వారం పోర్చుగ‌ల్ కావాల‌ని కోస్టా పేర్కొన్నారు.

ఐరోపా ఐక్యం స‌మ‌యంలో పోర్చుగ‌ల్ ది కీల‌క పాత్ర‌. యూరో క‌రెన్సీలో పోర్చుగ‌ల్ తొలినాళ్ళ‌లోనే చేరింది. ఐరోపా స‌మాజం రాజ‌కీయాల రూప‌క‌ల్ప‌న‌లో పోర్చుగ‌ల్ ది కీల‌క పాత్ర‌. యూర‌ప్ 2020 వ్యూహం మూలంగా పోర్చుగ‌ల్ కు అనేక విధాల ల‌బ్ధి చేకూరుతుంది.

ప్ర‌పంచ వ్య‌వ‌హారాల్లో భార‌త్ ముద్ర పెరుగుతున్న నేప‌థ్యంలో పోర్చుగ‌ల్ - మ‌న దేశంపై దృష్టి సారించింది. భార‌త్ ఆర్థిక వృద్ధి ప్ర‌పంచ దేశాల‌ను ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌జాస్వామ్యం, అభివృద్ధి ఏక‌కాలంలో జ‌ర‌గ‌వ‌చ్చున‌ని - భార‌త్ నిరూపించింది.

భార‌త్ - పోర్చుగ‌ల్ దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత‌గా మెరుగుప‌డేందుకు ఇరు దేశాల ప్ర‌ధానులు క‌ట్టుబ‌డి వున్నారు. మ‌హాత్మాగాంధీ 150 జ‌యంతి వేడుక‌ల‌కు ఆంటోనియా కోస్టాకు ప్ర‌ధాని మోది వ్య‌క్తిగ‌త ఆహ్వానం ప‌లికారు.

గాంధీ సిటిజ‌న్ షిప్ ఎడ్యుకేష‌న్ పుర‌స్కారం ఏర్పాటును కోస్టా ప్ర‌క‌టించారు. గాంధీజీ ఆలోచ‌నా ధోర‌ణ‌ల‌కు అనుగుణంగా ప్ర‌తి సంవ‌త్స‌రం ఈ పుర‌స్కారాన్ని అందిస్తారు. తొలిసారి ఈ అవార్డును మృగ సంర‌క్ష‌ణకు ఇస్తారు. ఇరు దేశాల మ‌ధ్య ర‌క్ష‌ణ‌, శాస్త్ర సాంకేతిక రంగాలు, వాణిజ్య రంగాల ప‌టిష్టానికి ఇరుదేశాల ప్ర‌ధానులు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. పోర్చుగ‌ల్ తో సంబంధాల మూలంగా పోర్చుగీస్ భాష మాట్లాడే ఇత‌ర దేశాల‌తో భార‌త్ వాణిజ్య సంబంధాలు మ‌రింత మెరుగుప‌డేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది. ఐరోపా యూనియ‌న్‌తో భార‌త్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చ‌ర్చ‌లు జ‌రుపుతోంది.

భార‌త్ చారిత్ర‌క‌, సాంస్కృతిక అంశాలైన నృత్యం, గానం, యోగా వంటి అంశాల‌తో పోర్చుగ‌ల్ లో భార‌త్ - ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా ను నిర్వ‌హించింది. సామ‌ర్థ్య స్థాయి కంటే త‌క్కువ‌యిన‌ప్ప‌టికీ - ఇరుదేశాల మ‌ధ్య వాణిజ్యం సంతృప్తిక‌రంగానే వుంది. భార‌త్ - పోర్చుగ‌ల్ కంపెనీలు ఆఫ్రికా వంటి దేశాల‌లో సంయుక్తంగా వాణిజ్యం సాగించేందుకు ముందుకు రావ‌టం హ‌ర్ష‌ణీయం. పోర్చుగ‌ల్ తో భార‌త్ సంబంధాలు ఎంతో పురాత‌న‌మైన‌వి. పోర్చుగీస్ నావికుడు వాస్కోడిగామా - ఐరోపా నుంచి భార‌త్ కు స‌ముద్ర‌మార్గాన్ని క‌నుగొన్నాడు. 1484లో ఆయ‌న కోజికోడ్ ను చేరుకున్నారు. అప్ప‌టి నుంచి ఇరుదేశాల మ‌ధ్య సుగంధ ద్ర‌వ్యాల వ్యాపారం ప్రారంభ‌మ‌య్యింది.

ఆధునిక దౌత్యానికి ఉన్న‌త‌స్థాయి రాజ‌కీయ స‌మాలోచ‌న‌లు అవ‌స‌రం. అంత‌రిక్షం, నౌకాయానం, స్టార్ట్ అప్స్‌, సంస్కృతి వంటి నూత‌న అంశాల‌లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం ద్వారా భార‌త్ - పోర్చుగ‌ల్ దేశాలు ద్వైపాక్షిక సంబంధాల‌ను మ‌రింత మెరుగు ప‌రుచుకుంటున్నాయి. మంచి విదేశాంగ విధానానికి కీల‌క‌మైన‌ది న‌మ్మ‌కం. దీంతోపాటూ, సాహ‌సోపేత‌మైన‌, సృజ‌నాత్మ‌క ఆలోచ‌న‌లు కూడా అవ‌స‌రం. ఇటువంటి పునాదుల‌పైనా భార‌త్ - పోర్చుగ‌ల్ సంబంధాలు మ‌రింత ప‌టిష్ట‌మ‌వుతున్నాయి.

ర‌చ‌న - డాక్ట‌ర్ ఆశ్‌ నారాయ‌ణ్ రాయ్‌, ఢిల్లీలోని సామాజిక శాస్త్రాల సంస్థ సంచాల‌కులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన