అయోవా సమాలోచన : అధికారిక అమెరికా అధ్యక్ష ఎన్నికల ఆరంభం 

అమెరికా అధ్యక్ష పదవికి తమ తమ పార్టీల అభ్యర్థులుగా నామినేట్ అయ్యేందుకు రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ప్రారంభించడంతో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నిక ప్రక్రియ దాదాపు ఏడాది పాటు కొనసాగుతుంది. అమెరికాలో ప్రధాన రాజకీయ పక్షాలు డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ లు.

ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ కాబట్టి, ఆయన రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఉండటం దాదాపు ఖాయం. ఆ విధంగా నవంబర్ రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికలకు అనేకమంది డెమోక్రిటిక్ పార్టీ సభ్యులు పార్టీ నుండి నామినేషన్ కోసం పోటీ పడుతున్నారు.

అధ్యక్ష పదవికి అభ్యర్థి నామినేషన్ చివరకు, పార్టీ జాతీయ సదస్సులో జరుగుతుంది. వివిధ ప్రాథమిక, వివిధ caucus - సమాలోచనల్లో ఎంపికైన పార్టీ ప్రతినిధులు సమావేశమై తమ పార్టీ నామినీ ఎవరు అనే అంశాన్ని నిర్ణయిస్తారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల విధానంలో ప్రైమరీలు caucus లు ఉంటాయి. ప్రైమరీల్లో పార్టీ సభ్యులు వివిధ రాష్ట్రాలలో సమావేశమై తగినంత మంది ప్రతినిధులను జాతీయ సమావేశానికి ఎన్నుకుంటారు. రహస్య ఓటింగ్ విధానంలో ఎన్నిక జరుగుతుంది. అయితే caucus ల్లో ప్రతినిధుల ఎన్నిక చేతులు ఎత్తటం ద్వారా కానీ తలలు లెక్కించడం ద్వారా గానీ జరుగుతుంది.

అధ్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ మొట్టమొదటి caucus అయోవాలో జరుగుతుంది.అలాగే మొట్టమొదటి ప్రాథమిక ఎన్నిక న్యూ హ్యాంప్ షైర్ లో చోటు చేసుకుంటుంది. సాధారణంగా ఈ రెండు ఎన్నికల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులు జాతీయ సమావేశానికి ఎన్నికవుతారు.

రెండు వేల ఇరవై ఫిబ్రవరి మూడున అయోవాలో డెమొక్రటిక్ పార్టీ తమ caucus ను నిర్వహించింది. తొలిగా ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు ప్రచారం కోసం బరిలో దిగారు. అయితే అయోవా కాకస్ నాటికి ఆ సంఖ్య పన్నెండుకు తగ్గింది. అయోవాలో జరిగిన కాకస్ ఎన్నికల్లో నలభై ఒక్క మంది అభ్యర్థులు డెమోక్రటిక్ పార్టీ తరఫున జాతీయ సమావేశానికి ఎన్నికయ్యారు.

అయోవా కాకస్ ఎన్నిక, ఫలితాలు వెలువడటంలో జరిగిన ఆలస్యం వలన వివాదాస్పదమయింది. ఫలితాలు వెలువరించేందుకు తక్కువ ఖర్చుతో కూడిన, ఇంతవరకు ప్రయోగించని మొబైల్ అప్లికేషన్ వాడాలన్న డెమోక్రటిక్ పార్టీ నిర్ణయం కారణంగా అయోవా సమావేశంలో ఈ ఆలస్యం కొంత మేరకు చోటుచేసుకుంది. డెమోక్రటిక్ పార్టీ మటుకు ఈ ఎన్నికల ఫలితాలు సజావు గానే వెలువడినట్లుగా ప్రకటించినా పార్టీ ప్రతిష్టను కొంతమేర ఈ విధానం దెబ్బతీసింది.

ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల ఇరవై అమెరికా అధ్యక్ష ఎన్నికను ఆతృతగా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవ పర్యాయం పోటీ చేయడమే దీనికి ప్రధాన కారణం.ఆయన అమెరికా రాజకీయాలపై, సమాజంపై ప్రగాఢమైన ప్రభావాన్ని కలిగి ఉన్నారని

భావిస్తున్నారు. ఇటీవలే ఆయన అభిశంసనను కూడా ఎదుర్కొన్నారు. డెమాక్రటిక్ పార్టీ ఆధిక్యంలో ఉన్న ప్రతినిధుల సభలో అభిశంసన ప్రక్రియ మొత్తం పక్షపాత వైఖరి తొనే జరిగినట్లుగా భావిస్తున్నారు. కాగా రిపబ్లికన్ పార్ట ఆధిక్యత గల సెనేట్ ఆయనను వదిలివేసింది.

కాక నవంబర్ మూడున తమ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ట్రంప్ ఏ విధంగా అమెరికా ఓటర్లను ఎదుర్కోనున్నారో చూడాలి.

పెరుగుదల శాతం, ఉపాధి కల్పన అంశాల వారిగా అమెరికా అర్ధవ్యవస్థ గణనీయంగా బాగానే ఉంది. అనుయాయులు పైన, ప్రతికూలుర పైనా, అధ్యక్షుడు ట్రంప్ అమెరికా మిలటరీ బలగాల బలాన్ని ప్రదర్శింపజేశారు. అమెరికాను తిరిగి ఉన్నతముగా తీర్చిదిద్దుతానని గత ఎన్నికలలో ఆయన అమెరికా ప్రజలకు వాగ్దానం చేశారు. ఈ పర్యాయం ఆ వాగ్దానాన్ని నెరవేర్చానని అదే విధంగా నడవనున్నానని తిరిగి వాగ్దానం చేస్తున్నారు.

ఉక్రేన్ ఎన్నికల ప్రక్రియలో ఆయన పాత్రపై ప్రింట్ , దృశ్యశ్రవణ, సామాజిక మాధ్యమాల్లో సమాచారం చెలరేగినా, ఆయనను తేలికగా వదిలిపెట్టిన సెనేట్ నిర్ణయంపై అమెరికా ఓటర్ల మనోగతం తెలుసుకోవటం చాలా కష్టం. అంతేకాక రెండువేల పదహారు అమెరికా అధ్యక్ష ఎన్నికల లో రష్యా ప్రమేయంతోనే ట్రంప్ విజయాన్ని సాధించారన్న ఆరోపణ కూడా ఉంది.

అమెరికా ఆర్థవ్యవస్థ, స్తానిక, సామాజిక అంశాలు అమెరికన్ల ఓటింగ్ ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. అయితే ప్రస్తుత అమెరికా అర్ధ వ్యవస్థపై డొనాల్డ్ ట్రంప్ సురక్షితంగానే ఉన్నారు.

డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి వ్యక్తిత్వం మరొక కీలక అంశం. అయోవా కాకస్లో మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ సరియైన పనితీరు కనపరచలేదు. సెనేటర్ బెర్నీ సాండర్స్ చక్కటి వక్త .అయితే ఆయన సోషలిస్టు విధానాలు కేపిటలిస్ట్ అమెరికాలో మద్దతు పొందలేదు. 2020 నవంబర్ ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ తో పోటీ పడే డెమాక్రాటిక్ అభ్యర్థి ఎవరన్న అంశంలో ఇంకా స్పష్టత లేదు.

భవిష్యత్తు లో, అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్ మాత్రం, అమెరికాతో సన్నిహితంగా కలిసి పని చేయాలనే చూస్తోంది

రచన: Profచింతామణి మహాపాత్ర Rector & Pro Vc,Unu.

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం