తాలిబన్ నుండి శాంతి పరీక్షను కోరుతున్న అమెరికా
శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు అమెరికా తాలిబన్ లు తాత్కాలిక కాల్పుల విరమణ కోసం వేరు వేరు కాల వ్యవధులను నిర్దేశించుకోవడంలో ఆఫ్గాన్ శాంతి ప్రక్రియ అత్యంత క్లిష్టమైన దశకు చేరుకుంది. తాలిబన్లతో చర్చలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి జల్మే ఖలీల్ జాద్ ను నియమించినప్పటి నుంచి ఇరు పక్షాలు అనేక ఒడి దుడుకులను ఎదుర్కుంటున్నాయి. ఈ ఈ కాల్పుల విరమణ ఇరుపక్షాల మధ్య విశ్వాస స్థాయిని పరీక్షించనుంది. అయినప్పటికీ ఆఫ్గనిస్థాన్‌లో ఇరుపక్షాలు పోరాటంలో చిక్కుకున్నాయి.
కాల్పుల విరమణకు అమెరికా పది రోజుల వ్యవధి ఉండాలని కోరగా అందుకు విరుద్ధంగా తాలిబన్లు ఏడు రోజులు కోరారు. ఈ వైఖరి ఒప్పంద ప్రక్రియలో ఒక భాగం.
రెండు వేల పందొమ్మిది సెప్టెంబర్‌లో అధ్యక్షుడు ట్రంప్ తాలిబాన్ రాజకీయ చర్చల బృందంతోపాటు ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి అమెరికాలో ఆతిథ్యం ఇవ్వడానికి అంగీకరించిన నాటికి శాంతి చర్చలు నాటకీయ మలుపులు తిరిగా యి. ఏదేమైనా శాంతి చర్చల స్థితిగతులను పరిగణనలోకి తీసుకోకుండా కాబూల్ సమీపాల్లోని సైనిక స్థావరంపై తాలిబన్ ముందుగా దాడికి దిగడంతో ఈ ప్రయత్నం విఫలమైంది.
చైనా, రష్యా, ఇరాన్, సౌదీ అరేబియాలు అంతర్జాతీయ ప్రయత్నాలు తీవ్రతరం చేయడంతో, చర్చల పునఃప్రారంభానికి చాలా నెలల కాలం పట్టింది. సెప్టెంబరులోనే తయారు చేసిన ముసాయిదా ఒప్పందం తమ వద్ద సిద్ధంగా ఉందని తాలిబన్ వర్గాలు తెలియచేస్తున్నాయి. ఇరువర్గాల హామీతో ముసాయిదా రూపొందడంతో అందులో ఎటువంటి మార్పుల ఆవశ్యకత లేదని తాలిబన్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తుది ఒప్పందం కుదిరేందుకు అనుకూల వాతావరణం నెలకొనాల్సిన అవసరం ఉంది.
శాంతి ఒప్పందం దరిమిలా తాలిబన్లు వాస్తవంగా పోరాటాన్ని నిలుపుదల చేయగలరని నిరూపితమైన సాక్ష్యాలను అమెరికా ఇప్పుడు ఆశిస్తోందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో పేర్కొన్నారు. ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందుగా మేము ప్రయత్నించాం .అయితే తాలిబన్లు మాత్రం హింసను తగ్గించటంలో తమ సన్నద్ధతను ప్రదర్శించలేదు చూపలేదు అని అన్నారు.
వారి సన్నద్ధత అధ్యక్షుడు ఘనీ ప్రభుత్వంతో మరింత క్లిష్టమైన చర్చలను ప్రారంభించడానికి వారి రాజకీయ నిబద్ధతను కూడా సూచిస్తుంది. ఇది దేశీయ శాంతి ప్రక్రియ కు అవసరమైన దశాబ్దాల ఆఫ్ఘన్ యుద్ధాన్ని అంతం చేస్తుంది.
దక్షిణాసియా ప్రాంతంపైన, ఆఫ్ఘనిస్తాన్ పైనా దీర్ఘకాల ప్రభావం చూపగల ఒప్పందం కావడంతో తాలిబన్ శాంతి నెలకొల్పాలన్న అంశానికి కట్టుబడి ఉంటారన్న విషయాన్ని తెలియ చేయాలని అమెరికా కోరుతున్నది. తాలిబన్ ను అనేకమంది భద్రతా నిపుణులు ఒక ఉగ్రవాద సంస్థ గానే భావిస్తారు.కతార్ దోహా స్థావరంగా ఉన్న తాలిబన్ ఉగ్రవాద సంస్థ కు చెందిన రాజకీయ చర్చల బృందానికి, అమెరికాకు మధ్య ఒప్పందం కుదిరితే వారికి రాజకీయ చట్టబద్ధత చేకూర గలదు.
ఆఫ్ఘన్ స్థాన్ ప్రభుత్వం ఇంతవరకు చర్చల వైపు జాగ్రత్త వైఖరినే అవలంభిస్తోంది. ఆఫ్ఘన్ మాజీ నిఘా విభాగ అధ్యక్షుడు అమ్రుల్లా సాలే తాలిబాన్లను స్పష్టంగా విమర్శించారు ఈ ఉగ్రవాద సంస్థ ఎంతమాత్రం నమ్మదగినది కాదు అని. తమ లక్ష్యాలను చేరుకోవడానికి తాలిబన్ హింసాత్మక రాజకీయాల ను విడనాడాలన్న విషయాన్ని అంగీకరించాలని అన్నారు. అమెరికా ఎన్నికలకు ముందు ఏదో విధంగా అమెరికా తాలిబన్ ల మధ్య ఒప్పందం కుదిరినా కూడా ఇరు దేశాల మధ్య క్లిష్టమైన అంశాలు అపరిష్కృతంగా ఉండి పోతాయన్న వాస్తవం అటువంటి ప్రముఖుల ప్రకటనల ద్వారా తెలుస్తోంది.
అభిశంసన ప్రక్రియ నుంచి ఏదో ఒక విధంగా బయటపడిన అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తాలిబన్ మోసానికి గురై తమ దేశ ప్రతిష్ట ను దిగజార్చరు. తాలిబన్ ప్రగాఢమైన బలమైన సాక్ష్యాన్ని ప్రదర్శించాలన్న pampe డిమాండ్, అందుకే వ్యూహాత్మకంగా కీలకమైన ఈ భూభాగం,లో దీర్ఘకాలిక యుద్ధానికి పరిష్కారం కనుకునే విశ్వసనీయమైన అమెరికా అధ్యక్షుడి చర్య. రెండు వేల ఇరవై జనవరి మూడున ఇరాన్ జనరల్ సులైమాని హత్య తదనంతరం ఇరాన్ అమెరికాల మధ్య ఈ భూభాగం చాల ప్రాముఖ్యతను సంతరించుకుంది.
యుద్ధ వినాశనానికి గురైన దేశంలో ఎటువంటి శాంతి ప్రక్రియ అయినా ఆఫ్గనిస్తాన్ నేతృత్వంలోనూ, ఆఫ్గనిస్తాన్ యాజమాన్యంలోనే ఉండాలని భారతదేశం తన వైఖరిని కొనసాగించింది. శాంతియుతమైన సురక్షితమైన ఆఫ్ఘనిస్తాన్ ను చూడాలని భారత్ కోరుకుంటోంది. అయితే ఉగ్రవాద సంస్థలపై ఆధారపడటానికి వాటితో చర్చలు జరపడానికి న్యూఢిల్లీకి కొన్ని సందేహాలు ఉన్నాయి.
తాలిబాన్ అమెరికా ల మధ్య కుదురనున్న ఒప్పందం ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి .
రచన: కల్లోల్ భట్టాచార్జి, ద హిందూ ప్రత్యేక కరస్పాండెంట్.
Comments
Post a Comment